‘కరెంట్’‌ షాక్‌: రెండు నెలల్లో మూడు కోట్ల బిల్లు | Farmer Gets Electricity Bill of over Rs 3 Crore For 2 Months | Sakshi
Sakshi News home page

‘కరెంట్’‌ షాక్‌: రెండు నెలల్లో మూడు కోట్ల బిల్లు

Published Tue, Sep 8 2020 8:02 PM | Last Updated on Tue, Sep 8 2020 9:04 PM

Farmer Gets Electricity Bill of over Rs 3 Crore For 2 Months - Sakshi

జైపూర్‌ : గత నెలలో ఓ రైతుకు అందిన కరెంటు బిల్లు షాక్‌కు గురి చేస్తోంది. రెండు నెలల్లో మూడు కోట్ల బిల్లు రావడంతో ఇది చూసిన రైతుకు కరెంట్‌ షాక్‌ కొట్టినట్లైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాకు చెందిన పెమరం పటేల్‌(22) అనే రైతు ఓ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఆగష్టులో 22న కరెంటు బిల్లు వచ్చింది. రెండు నెలల్లో 38,514,098 యూనిట్ల విద్యుత్ వినియోగించినందుకు రూ .3.71 కోట్ల బిల్లు వచ్చింది. ఇంత మొత్తంలో బిల్లు చూసిన రైతు ఖంగుతిన్నాడు. వెంటనే సమీంపంలోని ఈ మిత్రా కేంద్రానికి వెళ్లాడు. (రైతుల కోసమే కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు..)

అక్కడి అధికారులు బిల్లును క్షుణ్ణంగా పరిశీలించగా బిల్లు ప్రింట్‌లో పొరపాటు జరిగినట్లు గుర్తించారు. మీటర్‌ రీడింగ్‌ సరిగా చేయనందుగా ఈ తప్పు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అసలు బిల్లు 6,414 రూపాయలు వచ్చినట్లు చెప్పడంతో సదరు రైతు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటనపై సూపరింటెండింగ్ ఇంజనీర్ గిరీష్ జోషి మాట్లాడుతూ.. మీటర్ రీడింగులను రికార్డ్ చేసే ఆపరేటర్ పొరపాటున తప్పుగా రికార్డ్‌ చేశాడని వెల్లడించారు. తప్పును వెంటనే సరిచేసి సరైన బిల్లు కాపీని రైతుకు అందించినట్లు వెల్లడించారు. కాగా ఈ బిల్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో  స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. (కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement