ధోతీ ధరించాడని.. మాల్‌లోకి అనుమతి నిరాకరణ! | Farmer In Dhoti Denied Entry To Mall Bengaluru video viral | Sakshi

ధోతీ ధరించాడని.. మాల్‌లోకి అనుమతి నిరాకరణ!

Published Wed, Jul 17 2024 3:37 PM | Last Updated on Wed, Jul 17 2024 3:43 PM

Farmer In Dhoti Denied Entry To Mall Bengaluru video viral

బెంగళూరు: ధోతీని ధరించినందుకు ఓ వృద్ధరైతుకు షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశం నిరాకరించారు. ఈ ఘటన బెంగళూరులోని జీటీ మాల్‌లో చోటుచేసుకుంది. ఒక వృద్ధ రైతు జీటీ మాల్‌లో సినిమా చూడటానికి తన కుమారుడితో కలిసి వెళ్లారు. అయితే వృద్ధుడు ధరించిన ధోతీని చూసి.. భద్రతా సిబ్బంది ఆయన్ని, ఆయన కుమారుడుని మాల్‌ లోపలికి వెళ్లకుండా ఆపేశారు.

 

మాల్‌ యాజమాన్యం ధోతీ ధరించినవారిని లోపలికి అనుమతించకూడదని ఆదేశించినట్లు తెలిపారు. మాల్‌లోకి ప్యాంట్స్‌ వేసుకొని వచ్చినవాళ్లను మాత్రమే అనుమతించాలని చెప్పారని అన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. దీంతో వృద్ధుడిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. తర్వాత ఆయనకు క్షమాపణలు తెలిపారు.

మరోవైపు.. ‘ఈ ఘటనపై పోలీసులు మాల్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే వేలమంది రైతులతో నిరసనకు దిగతాం’ అని రైతు నాయకుడు కురుబురు శాంతకుమార్ డిమాండ్‌ చేశారు.  ఇక.. సోషల్‌మీడియాలో సైతం నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ.. మాల్‌ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

గతంలో కూడా  ఓ వ్యక్తి సంచి నెత్తిన పెట్టుకొని రాజాజీనగర్‌ మెట్రోస్టేషన్‌కు వెళ్లితే.. అక్కడి సిబ్బంది ఆయన దుస్తులు సరిగాలేని అనుమతింలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారటంతో  స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ అధికారులు క్షమాపణలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement