Viral: అధికారులు పట్టించుకోలేదు.. ఓపిక నశించి ఆ రైతు ఏం చేశాడంటే.. | Farmer Rolls On Floor With Folded Hands Video Viral | Sakshi
Sakshi News home page

Viral: అధికారులు పట్టించుకోలేదు.. ఓపిక నశించి ఆ రైతు ఏం చేశాడంటే..

Jul 17 2024 6:58 PM | Updated on Jul 17 2024 7:14 PM

Farmer Rolls On Floor With Folded Hands Video Viral

తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల వద్ద మొరపెట్టుకునేందుకు ఓ రైతు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్‌ ఆఫీస్‌కు వెళ్లినా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఓపిక నశించి.. ఆ రైతు చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మాంద్‌సౌర్‌ కలెక్టర్‌(జిల్లా మెజిస్ట్రేట్‌) కార్యాలయంలో ఓ వ్యక్తి చేతులు జోడించి పొర్లు దండాలు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ వీడియో ఉన్న రైతు పేరు శంర్‌ లాల్‌ పాటిదార్‌. సొంత ఊరిలో కొంత భూమి ఉంది. అయితే ఆ కొంత భూమిని కూడా కబ్జారాయుళ్లు వదల్లేదు. నకిలీ పత్రాలతో తమ పేరున రిజిస్టర్‌ చేయించుకున్నారట. 

దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో.. ఆ లాక్కున్న వ్యక్తి కలెక్టర్‌ ఆఫీస్‌లో  పని చేసే బాబు దేశ్‌ముఖ్‌ అని శంకర్‌ తెలుసుకున్నాడు. అసలైన ధ్రువపత్రాలతో కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎలాగైనా పైఅధికారులకు ఆ విషయం వెళ్లాలనుకున్నాడు. తన బంధువుల సాయంతో ఓ వీడియో తీశాడు. ఆఫీస్‌ ప్రాంగణంలో పొర్లు దండాలు పెడుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారాయన. దీంతో విషయం.. జిల్లా మేజిస్ట్రేట్‌ దిలీప్‌ యాదవ్‌ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటానని, శంకర్‌కు న్యాయం చేస్తానని చెప్పారాయన. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement