![Catfish Head And Tail Stuck In Two Snakes Mouth - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/11/fish_0.jpg.webp?itok=l83eoYnN)
వీడియో దృశ్యం
భోపాల్ : పాముల పంతం ఓ చేపకు మేలు చేసింది. నోటి కందిన కూడును దక్కించుకోవటానికి అవి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, చేపకు పునర్జన్మ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కన్షా నేషనల్ పార్కులో కొద్దిరోజుల క్రితం ఆకలితో ఉన్న ఓ పాము బాగా వెతికి నీటిలో ఉన్న ఓ చేప తలను పట్టుకుంది. దాన్ని నీటిలోంచి బయటకు తీసింది. కొద్దిసేపటి తర్వాత నీటిలోంచి మరో పాము చేప తోకను పట్టుకుంది. ఇక రెండు పాములు తమ ఆహారాన్ని వదిలేయటం ఇష్టపడక అలానే ఉండిపోయాయి. ( అలా సరదాగా రేసుకు వెళ్దామా! )
దాదాపు 30 నిమిషాల పాటు పట్టువదలకుండా గాల్లో ఉన్నాయి. దీన్ని పర్యావరణ ప్రేమికుడు ఘన్‌శ్యామ్ ప్రసాద్ భన్‌వారే వీడియో తీశాడు. ఆ తర్వాత ఏమైందో అతను వివరిస్తూ.. ‘‘ 30 నిమిషాల తర్వాత ఆయాసానికి గురైన కింద ఉన్న పాము చేపను వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత పైనున్న పాముకూడా చేపను పైకి లాగే ఓపిక, సత్తువ లేక దాన్ని నీళ్లలోకి వదిలేసింది. దీంతో చేప బతుకు జీవుడా అంటూ నీళ్లలో పడి తుర్రుమంద’’ని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment