లఖన్ యాదవ్
భోపాల్ : జీవితమనే స్వయం వరంలో ‘అదృష్టం’ అందమైన రాకుమారి లాంటిది ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేము. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతును అదృష్టం ఖరీదైన వజ్రం రూపంలో వరించింది.. రాత్రికి రాత్రి అతని జీవతాన్ని మార్చేసింది. వివరాల్లోకి వెళితే.. పన్నాకు చెందిన లఖన్ యాదవ్ అనే రైతు గత నెలలో 200 రూపాయలు ఖర్చు పెట్టి ఓ చిన్న స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. శనివారం దాన్ని చదును చేయటానికి పనులు మొదలుపెట్టాడు. దాంట్లోని రాళ్లు, రప్పలు తవ్వి బయటపడేస్తుండగా.. ఓ రంగు రాయి కనిపించింది. అది వజ్రం ఏమో అన్న అనుమానం కలిగిందతనికి. అందుకే దాన్ని దగ్గరలోని డిస్ట్రిక్ట్ డైమండ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన దాన్ని పరీక్షించి అది 14.98 క్యారెట్ల వజ్రం అని తేల్చాడు. ( 5 గంటల్లో 36 వేల అంగలు వేస్తే ఏమౌతుంది? )
దీంతో యాదవ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాన్ని వేలం వేయగా 60 లక్షల రూపాయల ధర పలికింది. దీనిపై లఖన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ ఆ వజ్రం నా జీవితాన్ని మార్చేసింది. నేను పెద్దగా చదువు కోలేదు. అందుకే ఆ డబ్బులను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాను. తద్వారా వచ్చిన డబ్బుతో నా కుమారులకు మంచి చదువులు చెప్పిస్తాను’’ అని అన్నాడు. ( ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రక్ దూసుకెళ్లినా బతికింది )
Comments
Please login to add a commentAdd a comment