Dimond
-
రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవ తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తన వెంట రామ మందిర ప్రతిరూపాన్ని తీసుకెళ్లారు. తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి రామ మందిరం నేపథ్యంతో వజ్రాల హారాన్ని తయారు చేయించారు. ఈ వజ్రాల హారంలో ఐదు వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించామని సదరు వ్యాపారి తెలిపారు. హారం తయారీలో రెండు కిలోల వెండిని వినియోగించామన్నారు. అలాగే 40 మంది కళాకారులు ఈ డిజైన్‌ను 35 రోజుల్లో పూర్తి చేశారన్నారు. దీనిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనం కోసం తయారు చేయలేదని, అయోధ్యలోని రామాలయానికి కానుకగా అందజేస్తామని తెలిపారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రపంచంలోని కోట్లాది మంది రామభక్తులు ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటాయన్నారు. సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్‌ఇ, సివిల్ పోలీసులు నిత్యం పహారా కాస్తారన్నారు. కొత్త భద్రతా ప్రణాళికల ప్రకారం ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తామని అన్నారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నదీతీరం గుండా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేడుకల సందర్భంగా 37 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: ఏఐతో మరో కొత్త ఆందోళన! -
జీఆర్టీ జ్యువెలర్స్ వజ్రాల పండుగ
హైదరాబాద్: జీఆర్టీ జువెలర్స్ ‘డైమండ్ ఫెస్టివల్’ పేరుతో గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది. ప్రత్యేకంగా చేతితో తీర్చిదిద్దిన అద్భుతమైన వజ్రాలు, అన్‌కట్ డైమండ్స్‌పై 25 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. ప్లాటినం ఆభరణాలపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ‘కస్టమర్లందరికీ వజ్రాల కలను నిజం చేసుకునే అవకాశం కల్పించడమే ఈ డైమండ్ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశం. కావున వారంతా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము’ అని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
పంజాగుట్టలో డైమండ్ షోరూం ప్రారంభోత్సంలో అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫోటోలు)
-
బిర్యానీ సెంటర్లో కేథరిన్ సందడి
సాక్షి, రాజేంద్రనగర్: అత్తాపూర్‌లో చిక్‌పెట్ డోనీ బిర్యానీ సెంటర్‌ను సోమవారం సినీనటి కేథరిన్ ప్రారంభించారు. వంటకాలను టేస్ట్ చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ప్రముఖ వ్యాపారవేత డి.రమేష్ హైదర్‌గూడ పిల్లర్ నంబర్–143 వద్ద ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్: రోడ్ నంబర్-36లోని చందూభాయ్ గ్రూప్‌నకు చెందిన ది డైమండ్ స్టోర్‌లో వెడ్డింగ్ సీజన్‌ను పురస్కరించుకొని సరికొత్త బ్రైడల్ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అరుదైన ఆభరణాలను సోమవారం మోడల్స్ ప్రదర్శించారు. కోవిడ్ కారణంగా అందరి క్షేమం కోసం మా స్టోర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు వర్చువల్‌గా కూడా ఆభరణాలు ఎంపిక చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తోందన్నారు. -
రైతు జీవితం మార్చేసిన ఖరీదైన వజ్రం
భోపాల్ : జీవితమనే స్వయం వరంలో ‘అదృష్టం’ అందమైన రాకుమారి లాంటిది ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేము. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతును అదృష్టం ఖరీదైన వజ్రం రూపంలో వరించింది.. రాత్రికి రాత్రి అతని జీవతాన్ని మార్చేసింది. వివరాల్లోకి వెళితే.. పన్నాకు చెందిన లఖన్ యాదవ్ అనే రైతు గత నెలలో 200 రూపాయలు ఖర్చు పెట్టి ఓ చిన్న స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. శనివారం దాన్ని చదును చేయటానికి పనులు మొదలుపెట్టాడు. దాంట్లోని రాళ్లు, రప్పలు తవ్వి బయటపడేస్తుండగా.. ఓ రంగు రాయి కనిపించింది. అది వజ్రం ఏమో అన్న అనుమానం కలిగిందతనికి. అందుకే దాన్ని దగ్గరలోని డిస్ట్రిక్ట్ డైమండ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన దాన్ని పరీక్షించి అది 14.98 క్యారెట్ల వజ్రం అని తేల్చాడు. ( 5 గంటల్లో 36 వేల అంగలు వేస్తే ఏమౌతుంది? ) దీంతో యాదవ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాన్ని వేలం వేయగా 60 లక్షల రూపాయల ధర పలికింది. దీనిపై లఖన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ ఆ వజ్రం నా జీవితాన్ని మార్చేసింది. నేను పెద్దగా చదువు కోలేదు. అందుకే ఆ డబ్బులను బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. తద్వారా వచ్చిన డబ్బుతో నా కుమారులకు మంచి చదువులు చెప్పిస్తాను’’ అని అన్నాడు. ( ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రక్ దూసుకెళ్లినా బతికింది ) -
టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి
-
ఉపాధి పనుల్లో వజ్రం దొరికింది(ట)!
ధారూరు(రంగారెడ్డి): ఉపాధి పనుల్లో వజ్రం లభ్యమైందనే ప్రచారం గ్రామస్తులతోపాటు పోలీసులను ఉరుకులు పరుకులు పెట్టించింది. చివరికి అదంతా తమాషా కోసం చేసిన ప్రచారమని తెలిసి.. ఎస్సై గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం అల్లీపూర్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ... గ్రామానికి చెందిన పాతూరు చిన్న అంతయ్య భూమిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గ్రామానికి చెందిన 16 మంది చేస్తున్నారు. వారిలో నర్సయ్య అనే కూలీ గ్రామంలో ఉన్న శ్రీనివాస్‌కు ఫోన్ చేసి పనిచేస్తున్న చోట వజ్రం దొరికిందని చెప్పాడు. అంతే.. ఈ వార్త ఒకరి నుంచి ఒకరికి తెలియటంతో గ్రామస్తులంతా పని జరిగే వద్దకు తరలివచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎస్సై మల్లేశం కూడా సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అక్కడి వారిని వజ్రం ఉదంతంపై ఆరా తీయగా.. తాము సరదా కోసమే వజ్రం దొరికిందని చెప్పామని, వాస్తవంగా అలాంటిది ఏమీ దొరకలేదని కూలీలు ఎస్సైకి వివరించారు. సరదా కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయటం నేరమని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డైమండ్ ఆఫర్ చేసి...దోచుకున్నారు
మహబూబ్‌నగర్: దురాశ దుఃఖానికి చేటు అన్నారు పెద్దలు. అతి దురాశకు పోతే.. ఐదు లక్షల రూపాయలు దొంగల పాలయ్యాయి. లక్షల విలువైన వజ్రం వస్తుందంటే ఎవరికైనా ఆశే. అయితే ముందు వెనక ఆలోచించకుండా డైమండ్ చౌకగా వస్తుందంటూ డబ్బులతో వెళ్లి.. ఘరానా మోసగాళ్ల చేతిలో బాధితులు అడ్డంగా మోసపోయారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో అయిజలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 50 లక్షల రూపాయల విలువ చేసే డైమండ్‌ను కేవలం 10 లక్షల రూపాయల ఆఫర్ కే ఇస్తామంటూ గుర్తు తెలియని దుండగులు.. డోన్ ప్రాంతానికి చెందిన కొందరిని నమ్మబలికారు. అది నమ్మి.. చివరకు ఐదు లక్షల రూపాయలకు ఇస్తామని ఒప్పందం కుదర్చుకున్నారు. ఈ క్రమంలో వారిని అయిజకు రప్పించారు. డబ్బులు తెచ్చామని... డైమండ్ ఇవ్వమని అడగగా.. వారిని కొట్టి డబ్బులు తీసుకుని దుండగులు ఉడాయించారు. దాంతో బాధితులు చేసేదేమీ లేక అయిజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.