roll
-
Viral: అధికారులు పట్టించుకోలేదు.. ఓపిక నశించి ఆ రైతు ఏం చేశాడంటే..
తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల వద్ద మొరపెట్టుకునేందుకు ఓ రైతు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లినా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఓపిక నశించి.. ఆ రైతు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాంద్సౌర్ కలెక్టర్(జిల్లా మెజిస్ట్రేట్) కార్యాలయంలో ఓ వ్యక్తి చేతులు జోడించి పొర్లు దండాలు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ వీడియో ఉన్న రైతు పేరు శంర్ లాల్ పాటిదార్. సొంత ఊరిలో కొంత భూమి ఉంది. అయితే ఆ కొంత భూమిని కూడా కబ్జారాయుళ్లు వదల్లేదు. నకిలీ పత్రాలతో తమ పేరున రిజిస్టర్ చేయించుకున్నారట. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో.. ఆ లాక్కున్న వ్యక్తి కలెక్టర్ ఆఫీస్‌లో పని చేసే బాబు దేశ్‌ముఖ్ అని శంకర్ తెలుసుకున్నాడు. అసలైన ధ్రువపత్రాలతో కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎలాగైనా పైఅధికారులకు ఆ విషయం వెళ్లాలనుకున్నాడు. తన బంధువుల సాయంతో ఓ వీడియో తీశాడు. ఆఫీస్ ప్రాంగణంలో పొర్లు దండాలు పెడుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారాయన. దీంతో విషయం.. జిల్లా మేజిస్ట్రేట్ దిలీప్ యాదవ్ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటానని, శంకర్‌కు న్యాయం చేస్తానని చెప్పారాయన. मंदसौर के बुजुर्ग किसान हैं, कहते हैं कहीं सुनवाई नहीं हो रही आरोप है कि ज़मीन फर्जी दस्तावेजों के जरिये कुछ लोगों ने हड़प ली है ... कलेक्टर दफ्तर से यूं निराश होकर लौटे ... pic.twitter.com/bpAHfHp2NH— Anurag Dwary (@Anurag_Dwary) July 17, 2024 -
వైరల్: బంఫర్ ఆఫర్.. 20 నిమిషాల్లో తింటే 20 వేలు మీవే !
ఇటీవల సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకోకుండా అవి వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయ్ కూడా. తాజాగా ఓ రోడ్ సైడ్ పుడ్ స్టాల్ యజమాని ఇలానే భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. సాధారణంగా ఇటువంటి ఫుడ్ ఛాలెంజ్‌లు విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అందులో తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ లాగిస్తే సరిపోతుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్ స్టాల్ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే రూ.20,000 ఇస్తానని పుడ్ లవర్స్‌కి బంఫర్ ప్రకటించాడు. ఇక ఆ రోల్ మేకింగ్ వీడియోని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఛాలెంజ్‌కి ఎవరైనా రావచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్‌గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా ఛాప్‌తో నింపేశాడు. చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. దీనంతటనీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారి పుడ్ లవర్స్‌ని నోరూరిస్తోంది. ఛాలెంజ్ ఆసక్తిగా ఉన్నా, రోల్ టేస్టీగా ఉన్నా.. ఆ బాహుబలి రోల్‌ని 20 నిమిషాల్లో తినాలంటే ఎంతటి భోజనప్రియులకైనా కొంచెం కష్టమే మరీ. అది కూడా 10 కేజీలు బరువు గల ఆహారం అంటే.. మామూలు విషయం కాదండి. అందుకే ఏమో అంత ధైర్యంగా ఆ ఛాలెంజ్ విసురుతున్నాడు. View this post on Instagram A post shared by THE FOOD CULT - TFC (@the.food_cult) చదవండి: ‘పాల దంతాలు ఊడిపోయాయి సాయం చేయండి’.. ప్రధాని మోదీ, అస్సాం సీఎంకు అక్కాచెల్లెళ్ల లేఖ -
ఉండవల్లి అప్పుడు ఏం చేశారు: సోము వీర్రాజు
సాక్షి, రాజమండ్రి: పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది బీజేపీయేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది కూడా బీజేపీయేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు ఆంధ్రా అభివృద్ధి గుర్తుకు రాలేదా.. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడదీసినపుడు అప్పటి ఎంపీ ఉండవల్లి ఏం చేశారు.. భద్రాద్రి రాముడు తెలంగాణకు వెళ్ళినపుడు ఉండవల్లి ఏమీ చేయలేకపోయారు ఎందుకు అని ప్రశ్నించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం విశాఖ రైల్వే జోన్ కోసం బీజేపీ యత్నిస్తుందని సోము అన్నారు. ‘ఉపాధి’ పథకం కొందరు అవినీతిపరులకు ఉపాధిగా మారిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని అని, ముందస్తు ఎన్నికలపై మోడీదే తుది నిర్ణయం అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం మాఫియాలను అరికట్ట లేకపోతోందని వీర్రాజు విమర్శించారు. -
గోదావరి తుప్పల్లో బోల్తాపడిన కారు
రాజమహేంద్రవరం క్రైం : అదుపుతప్పి కారు గోదావరి నదిలో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడియం గ్రామానికి చెందిన శింగం నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున గోదావరి గట్టుపై నుంచి కడియం గ్రామానికి కారులో బయలుదేరారు. రోటరీ కైలాస భూమి దాటిన అనంతరం సుబ్బాయమ్మ ఘాట్ వద్ద కారుకు ఓ వరాహం అడ్డువచ్చింది. దానిని తప్పించే క్రమంలో గోదావరి గట్టు మీద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొని, అదుపుతప్పి గోదావరి నదిలోని తుప్పల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పంటకాల్వలోకి చేపల లారీ బోల్తా
ముదినేపల్లి రూరల్: చేపల లోడుతో వెళుతున్న లారీ పంటకాల్వలో దూసుకెళ్లింది. వివరాల ప్రకారం గురువారం రాత్రి కైకలూరు నుంచి ముంబై కి 10 టన్నుల చేపలతో లారీ బయిలు దేరింది. ముదినేపల్లి సమీపంలోకిరాగానే డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న పోలరాజ్ పంట కాల్వలోకి బోల్తా కొట్టింది. లారీ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. లారీని క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు నానా అవస్థలు పడ్డారు. రహదారిపై పలుసార్లు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు లారీని కాలువ ఒడ్డుకు తీసి చేపలను మరో లారీలోకి మార్చారు. అధికలోడు, డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదంజరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రూ. 10 లక్షల సరుకులో కొంత నష్టపోయినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. -
360 డిగ్రీల్లో తిరిగే కొత్త కారు
కారు కొనాలనుకున్నవారు... ముందుగా దానికున్న విశిష్ట లక్షణాలను గమనిస్తారు. ముఖ్యంగా అందులోని ఆధునిక పరిజ్ఞానానికీ ప్రాధాన్యతనిస్తారు. అందుకే వాహన ప్రేమికులంతా ఇష్టపడే విధంగా లండన్ కు చెందిన ఓ వ్యక్తి కొత్తరకం కారును సృష్టించాడు. ప్రధానంగా 360 డిగ్రీల్లో చక్రాలు ఏ దిశకైనా తిరిగేలా ఏర్పాటు చేసి, తక్కువ స్థలంలో కూడా కారు అన్నివైపులకూ తిరిగేలా రూపొందించాడు. లండన్ కు చెందిన విలియం లిడ్డియార్డ్.. నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనాల్లో వినియోగించే వోమిని డైరెక్షనల్ చక్రాలను పెట్టి, తయారు చేసిన ఆ కారు.. 360 డిగ్రీల్లో ఎటుపక్కకైనా సులభంగా తిరిగేట్టు ఏర్పాటు చేశాడు. అడ్డంగా పార్క్ చేయాల్సి వచ్చినపుడు సైతం ఇబ్బంది పడకుండా పక్కకు జరిపేందుకు వీలుగా కారు వీల్స్ ను రూపొందించాడు. సాధారణ కార్లకు వినియోగించే చక్రాల్లా కాకుండా... తాను వినియోగించిన చక్రాలు ఏ దిశకైనా తిరుగుతాయని, బోల్ట్ ఆన్ ఆప్లికేషన్ ను వినియోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికినట్లు లిడ్డియార్డ్ చెప్తున్నాడు. పాత టయోటా కారుకు తాను రూపొందించి కొత్తరకం వీల్స్ ను పెట్టి, ట్రయల్ రన్ వేసిన అతడు.. ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి, అందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు. సాధారణ కారుకు వేగంలోనూ, పనిచేసే తీరులోనూ ఏమాత్రం తీసిపోదని, అంతకంటే ఎక్కువ నియంత్రణా సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని చెప్తున్నాడు. విలియమ్స్ కొత్త ప్రయోగం.. ఇప్పుడు యూట్యూబ్ లో లక్షలకొద్దీ వ్యూయర్లను ఆకట్టుకుంటోంది. అతడు పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగు లక్షలమంది వరకూ తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని, తన నూతన ఆవిష్కరణ 'లిడ్డర్డ్ వీల్స్' కు సోషల్ మీడియా సహాయపడుతుందని ఆశిస్తున్నాడు. తన కొత్త సృష్టిని ఏదైనా కంపెనీ ప్రోత్సహిస్గే వారితో కలసి అభివృద్ధి పరిచి, కొత్తరకం కారును మార్కెట్లోకి తేవాలని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లో ప్రవేశ పెడితే తన వీల్స్ కు ఎంతో డిమాండ్ వస్తుందని ధీమాగా చెప్తున్నాడు. -
పోలీస్ జీప్ బోల్తా: డ్రైవర్ కు గాయాలు
మంగపేట: వరంగల్ జిల్లాలో పోలీస్ జీప్ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని జీడివాగు సమీపంలో శనివారం చోటు చేసుకుంది. మంగపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన టాటాసుమో ఏటూరు నాగారాం నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో టాటా సుమో డ్రైవర్ కోటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే సుమోలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంపై స్పష్టత రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిమెంట్ లారీ బోల్తా : డ్రైవర్ మృతి
తాడిమర్రి: అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఏకపాదంపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఓ సిమెంట్‌లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ నరేంద్ర(25) అక్కడికక్కడే మృతి చెందాడు. సిమెంట్ లారీ సాగర్ సిమెంట్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. లారీ తాడిపత్రి నుంచి ధర్మవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు నరేంద్ర స్వస్థలం సింగనమల మండలం బండమీదిపల్లి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: ఏడుగురికి గాయాలు
కర్నూలు: కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులదిన్నె వద్ద మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తూ ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: 20 మందికి గాయాలు
పెందుర్తి: విశాఖపట్టణం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని పెందూర్తి మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని చింతగుట్ల వద్ద గాజవాక డిపోకు చెందిన బస్సు అదపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సమారు 90 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. -
గ్యాస్ సిలిండర్ల కంటైనర్ బోల్తా
కర్నూలు : ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్యాస్ సిలీండర్ల లోడ్‌తో వెళుతున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలో కర్నూలు- తిరుపతి రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి భారత్ గ్యాస్ సిలండర్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ ఆళ్లగడ్డ సమీపానికి రాగానే బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (ఆళ్లగడ్డ) -
చీరాలలో సిలిండర్ల లారీ బోల్తా
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని చీరాల వేటపాలెం వద్ద జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది. ఈ ఘటనతో లారీలోని సిలిండర్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిలిండర్లు చెల్లాచెదురు కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఆటో బోల్తా : 8 మందికి గాయాలు
కారంచేడు: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఓ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ఆటో మండలంలోని స్వర్ణ గ్రామం నుంచి కూలీలను తీసుకెళ్తుతోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
టూరిస్ట్ బస్సు బోల్తా
పాణ్యం: తీర్థయాత్రలకు బయల్దేరిన ఓ ప్రైవేటు బస్సు మండల పరిధిలోని నూలుమిల్లు వద్ద సోమవారం ఉదయం 7.30 గంటలకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృత్యువాత పడగా, మరో 22 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణా రాష్ట్రానికి చెందిన జనతా ట్రావెల్స్ బస్సు(ఏపీ 09 ఎక్స్ 4999)లో హైదరాబాద్, కోటి, దిల్‌షుఖ్‌నగర్, తెనాలి, చైతన్యపూరి, వివిధ పట్టణాలకు చెందిన 44 మంది భక్తులు తీర్థయాత్రల కోసం రెండు రోజుల క్రితం బయల్దేరారు. ఆయా పుణ్యక్షేత్రాలు దర్శించుకొని శబరిమలకు వెళ్తుండగా పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన డ్రైవర్ అక్రమ్ హుసేన్ సడన్‌గా బ్రేకులు వేయడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన, బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికులు వెలుపలికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పాణ్యం ఎస్ఐ సుబ్రమణ్యం, మన్మదవిజయ్ చేరుకొని హైవే పెట్రోలింగ్ వాహనం, ఆటోల్లో క్షతగాత్రులను నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా తెనాలికి చెందిన కాత్యాయనమ్మ(60) కోలుకోలేక మృతి చెందింది. బస్సు కండీషన్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రమణ్యం పేర్కొన్నారు.