పోలీస్ జీప్ బోల్తా: డ్రైవర్ కు గాయాలు
పోలీస్ జీప్ బోల్తా: డ్రైవర్ కు గాయాలు
Published Sat, Nov 28 2015 1:35 PM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM
మంగపేట: వరంగల్ జిల్లాలో పోలీస్ జీప్ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని జీడివాగు సమీపంలో శనివారం చోటు చేసుకుంది. మంగపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన టాటాసుమో ఏటూరు నాగారాం నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో టాటా సుమో డ్రైవర్ కోటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే సుమోలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంపై స్పష్టత రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement