గోదావరి తుప్పల్లో బోల్తాపడిన కారు
గోదావరి తుప్పల్లో బోల్తాపడిన కారు
Published Wed, Dec 21 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
రాజమహేంద్రవరం క్రైం : అదుపుతప్పి కారు గోదావరి నదిలో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడియం గ్రామానికి చెందిన శింగం నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున గోదావరి గట్టుపై నుంచి కడియం గ్రామానికి కారులో బయలుదేరారు. రోటరీ కైలాస భూమి దాటిన అనంతరం సుబ్బాయమ్మ ఘాట్ వద్ద కారుకు ఓ వరాహం అడ్డువచ్చింది. దానిని తప్పించే క్రమంలో గోదావరి గట్టు మీద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొని, అదుపుతప్పి గోదావరి నదిలోని తుప్పల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement