over
-
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్‌ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్‌ఫుడ్‌కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్‌తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ కన్సల్టంట్ -
ఈ 5 ఎక్సర్‌సైజ్‌లతో.. మీ ఓవర్ థింకింగ్‌కి చెక్!
‘మీకున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అని ప్రశ్నిస్తే పదిమందిలో ఏడుగురు ‘అతిగా ఆలోచించడం’ అని సమాధానమిస్తారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది, త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ‘ఓవర్ థింకింగ్’కి చెక్ పెట్టవచ్చు.ఎప్పడు అతిగా ఆలోచిస్తున్నారో గుర్తించాలి..రోజులో ఏ సమయంలో, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో, ఆ సమయంలో మీ శరీరంలో ఏయే భాగాలు బిగుసుకుని ఉంటున్నాయో గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనూ ఏ పని చేస్తున్నప్పుడు మీకు తక్కువ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయో కూడా గుర్తించాలి. ఉదాహరణకు మీరు జిమ్‌కి వెళ్లినప్పుడు లేదా ఫన్నీ పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు ఆందోళన చెందకపోవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించడం, ఆచరించడం ఓవర్ థింకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.‘మీ ఆలోచనలకు’ దూరంగా జరగాలి..మీరు ఆలోచనల సుడిగుండంలో పడి మునిగిపోతున్నప్పుడు దానికి దూరంగా జరగాలి. గోడ మీది ఈగలా లేదా జడ్జిలా మీ ఆలోచనలకు దూరంగా జరిగి వాటిని గమనించాలి. ఇలా ఒక అడుగు వెనక్కు వేసి మీ ఆలోచనలను మీరు గమనించడం ద్వారా మీ భావోద్వేగాల తీవ్రత తగ్గిందని మీకు అర్థమవుతుంది. అంతే కాదు, మీ ఆలోచనల చానెల్‌ను మార్చే శక్తి మీకుందని మీరు గుర్తిస్తారు.‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారాలి..ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనతో భర్తీ చేయడానికి సులభమైన మార్గం ‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారడం. అంటే ‘నాకే ఎందుకిలా జరిగింది?’, ‘నేనే ఎందుకు చేయాలి?’ లాంటి ప్రశ్నల నుంచి దారి మళ్లించుకుని ‘నేను ఎలా ముందుకు వెళ్ళగలను?’ అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీకు చెప్పిన సమయానికి రాకపోతే, మెసేజ్‌కి స్పందించకపోతే.. ఎందుకలా చేశారని అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవచ్చనే దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, మీరు నెగెటివ్ ఓవర్ థింకింగ్ నుంచి మంచి ప్లానింగ్‌కి మారతారు.రీషెడ్యూల్ చేయాలి..అతిగా ఆలోచించడానికి రోజులో పది, పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజూ అదే సమయంలో కూర్చుని దానిపై ఆలోచించాలి . రోజూ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా సమయాల్లో ఆ అతి ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టవు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. – డా. విశేష్, సైకాలజిస్ట్ -
Gareth Morgan: 6 బంతుల్లో 6 వికెట్లు
గోల్డ్‌కోస్ట్: ఆ్రస్టేలియా క్లబ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. గోల్డ్‌కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్–3 పోటీల్లో ఒక బౌలర్ ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. ముద్గీరబ నేరంగ్ అండ్ డిస్ట్రిక్ట్స్ క్లబ్ కెపె్టన్ గారెత్ మోర్గాన్ ఈ ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ సీసీ జట్టుపై అతను ఈ రికార్డు సృష్టించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ క్లబ్ 39 ఓవర్లలో 174/4 వద్ద నిలిచింది. చివరి ఓవర్లో మరో 5 పరుగులు చేస్తే చాలు. అయితే గారెత్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించడంతో 4 పరుగుల తేడాతో గెలుపు ముద్గీరబ జట్టు సొంతమైంది. అంతకుముందే ఈ ఇన్నింగ్స్‌లో మరో వికెట్ తీసిన గారెత్ మొత్తంగా 7/16తో ముగించాడు. గతంలో ప్రొఫెషనల్ క్రికెట్లో నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్), అల్ అమీన్ (బంగ్లాదేశ్), అభిమన్యు మిథున్ (భారత్) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు. -
మిలన్కు బై బై
మిలన్కు బై బై చెప్పారు గోపీచంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో మొదలైన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడి మిలన్ నగరంలో ప్లాన్ చేసిన షెడ్యూల్ ముగిసింది. గోపీచంద్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటతో ఈ విదేశీ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్. -
ముగిసిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్‌డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్‌డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు. -
పదోన్నతుల ఆశ.. బదిలీలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో విద్యాశాఖలో మళ్లీ హడావుడి మొదలైంది. కొన్నేళ్లు గా ఎదురుచూస్తున్న టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కొన్ని నెలల క్రితం విధించిన స్టేకి హైకోర్టు బుధవారం సడలింపు ఇచ్చింది. దీంతో తక్షణమే ప్రక్రియను మొదలుపెట్టాలని విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే విధివిధానాలపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన డేటా, దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పనపై దృష్టిపెట్టాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎనిమిదేళ్లుగా నోచుకోని పదోన్నతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా, దాదాపు 6 వేల మంది పదోన్నతులు పొందారు. ఆ తర్వాత ప్రమోషన్ల వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2021లో బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా కోవిడ్ దృష్ట్యా ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు బదిలీలు చేపట్టడం అనేక వివాదాలకు దారితీసింది. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో 6,362 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. 7,141 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. ఇందులో 30 శాతం నేరుగా టీఆర్టీ ద్వారా భర్తీ చేయనుండగా, 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. హెచ్ఎం పోస్టులు 1,947 ఖాళీలుండగా, ఇందులో పదోన్నతులతో భర్తీ చేసేందుకు 1,367 మంది అర్హులని లెక్కతేల్చారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల పోస్టులు 2,043 ఖాళీలుంటే, 1,942 మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇతరత్రా కలుపుకొంటే మొత్తం 10,352 మంది టీచర్లకు పదోన్నతులు లభించే వీలుంది. బదిలీలకు 50 వేల మంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో సాధారణ బదిలీలు చేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసే హెచ్ఎంలు, 8 ఏళ్లుగా ఒకేచోట పనిచేసే టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. 2018లో 78 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 48 వేల మందికి బదిలీలు జరిగాయి. గత జనవరిలో బదిలీల షెడ్యూల్ ఇవ్వగా.. 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా షెడ్యూల్ ఇస్తే 8 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరో 2 వేలు పెరిగే అవకాశముంది. వీరిలో సీనియారిటీ, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికన 50 వేల మంది బదిలీ అయ్యే వీలుంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు? ఆన్‌డ్యూటీ తీసుకునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సరీ్వస్ పాయింట్లపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా షెడ్యూల్లో ఈ పాయింట్లను తొలగించాల్సి ఉంది. దీంతో గత జనవరిలో మొదలు పెట్టిన బదిలీల ప్రక్రియలో మార్పులు చేసి ప్రభు త్వం కొత్త షెడ్యూల్ ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా సరీ్వసు పాయింట్లు ఇస్తారు. దీంతోపాటే సరీ్వస్‌ను బట్టి కొన్ని పాయింట్లు ఇస్తారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జిల్లాల వారీగా సీనియారిటీ, సబ్జెక్టుల వారీగా సీనియారిటీని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, షెడ్యూల్ మాత్రం వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. టీఆర్టీకి పోస్టులు పెరుగుతాయా? విద్యాశాఖలో 22 వేల ఖాళీలుంటే, ప్రభుత్వం కేవలం 5,089 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా పదోన్నతులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని కొత్త ఖాళీలు వెల్లడయ్యే వీలుంది. మొత్తం 10 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఐదువేలతో కలుపుకొంటే మొత్తం 15 వేలకుపైగా నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మోక్షం కల్పించండి: ఉపాధ్యాయ సంఘాలు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తక్షణమే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్ ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి కోరారు. న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు తెలిపారు. ఏళ్ల తరబడి టీచర్లు బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. ఉపాధ్యా సంఘాల నేతలు పది ప్రత్యేక పాయింట్లు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ అంశాన్ని పరిశీలించాలని ఎస్టీయూ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్‌రెడ్డి కోరారు. -
ఆ పుస్తకం 100 ఏళ్లకు.. లైబ్రరీకి తిరిగి చేరుకుంది!
లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని చదవడం గురించి అందరికీ తెలిసింది. వాళ్లు ఇచ్చిన గడువు తీరిపోయాక ఒక్కోసారి ఇచ్చేస్తాం. కొన్నిసార్లు గడువు దాటిన సందర్భాలు ఉంటాయి. ఐతే ఇక్కడొక లైబ్రరీలోని పుస్తకం ఏకంగా రెండు, మూడు ఏళ్లు కాదు ఏకంగా 100 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రెరికీ చేరుకుంది.ఈ ఆశ్చర్యకరమైన ఘటన యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ నుంచి అరువు తెచ్చుకున్న ఓ పుస్తకం దాదాపు 100 ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చింది. ఈ ఘటన అక్కడ ఉన్న లైబ్రెరియన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత అరుదైన పుస్తకాలను ముద్రించే అవెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ లైబ్రరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్టీవర్ట్ ప్లీ కొన్ని పుస్తకాలను సదరు గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక లైబ్రరీకీ తిరిగి వచ్చిన పుస్తకం పేరు "ఎలెమెంటరీ ట్రీటైజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ" అనే పుస్తకం. దీని రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్. న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీలో ఈ పుస్తకం ఉండేది. ఈ పుస్తకాన్ని 1904లో ఎవరో జారీ చేశారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం ఎవరో వ్యక్తి తిరిగి లైబ్రరీకి హ్యండోవర్ చేశారు. అయితే ఆ పుస్తకం చెక్కు చెదరకుండా బాగానే ఉండటం విశేషం. ఈ మేరకు బెడ్ఫోర్డ్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా మెలో మాట్లాడుతూ..ఈ పుస్తకాన్ని చాలా మంచి స్థితిలోనే తీసుకువచ్చి అరలో ఉంచారు. ఏ పుస్తకం అయినా గడవుకి ఇంకాస్త ఆలస్యంగా చేరిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. అదీకూడా మహా అయితే 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే ఆలస్యంగా తిరిగి లైబ్రరీకి చేరుకునే అవకాశం ఉంటుది. కానీ మరి ఇంత దారుణంగా వందేళ్ల తర్వాత తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకాన్ని 1881లో ముద్రించారు. చరిత్రలో దీనికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం విద్యుదయస్కాంత రంగంలో ప్రముఖ సహయకారి అయిన రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ మరణం తర్వాత వచ్చిన పుస్తకమే ఇది. చెప్పాలంటే ఇది సరిగ్గా 119 ఏళ్లు తిరిగి లైబ్రరీకి చేరుకుంది. ఇంకో వందేళ్లు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ముద్రించిన పుస్తకం ఎప్పటికి విలువైనదే. అని సదరు లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా నమ్మకంగా చెబుతోంది. (చదవండి: అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది!) -
ఆలస్యం వల్ల రూ. 4.80 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. ఫలితంగా వీటి నిర్మాణ వ్యయం మే నాటికి రూ.4.80 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదికను పరిశీలించినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. రూ.150 కోట్లు, అంతకుమించిన వ్యయంతో కూడిన ప్రాజెక్టులను ప్రణాళికా శాఖ పర్యవేక్షిస్తుంటుంది. మొత్తం 1,681 ప్రాజెక్టులకు గాను 814 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 408 ప్రాజెక్టులు నిర్మాణ వ్యయం పెరిగిపోయినట్టు నివేదించాయి. 1,681 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.24,16,872 కోట్లు కాగా, వీటిని పూర్తి చేయడానికి రూ.28,96,947 కోట్లు వ్యయం అవుతుందని ప్రణాళిక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే రూ.4,80,075 కోట్ల మేర నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలుస్తోంది. 2023 మే నాటికి ఈ ప్రాజెక్టులపై రూ.15,23,957 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అంచనా వ్యయంలో 52.61 శాతం మేర ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. మొత్తం ఆలస్యంగా నడుస్తున్న 814 ప్రాజెక్టుల్లో 200 వరకు ఒకటి నుంచి 12 నెలల ఆలస్యంతో నడుస్తుంటే, 183 ప్రాజెక్టులు 13–24 నెలలు, 300 ప్రాజెక్టులు 25–60 నెలలు, 131 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా ఆలస్యం అయ్యాయి. -
క్రికెట్ లో సరికొత్త రికార్డు... ఒక్క ఓవర్ లో 46 పరుగులు
-
అతి వ్యాయామంతో గుండెకు చేటు.. పోటు!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, కారణం అది కాదంట!. మరి.. అలవాటు లేని వ్యాయామాలు లేదంటే అతి వ్యాయామం వల్ల యువత గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పాతికేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారిలో పలువురు జిమ్‌లో మృతి చెందిన సంఘటనలు ఇటీవలి కాలంలోనే బయటపడ్డాయి. కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్, గాయకుడు కేకే, కమేడియన్ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో యువత నృత్యాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తగిన శిక్షణ లేకుండానే కఠిన వ్యాయా మాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని మొరాదాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. అలవాటు లేని ఎక్సర్సైజ్లకు యువత దూరంగా ఉండాలని మరో వైద్యుడు వివేక్ కుమార్ సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు. -
వైడ్ కాదు, నోబాల్ కాదు.. కానీ ఓవర్లో 7 బంతులు.. అదెలా?
Women's ODI World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో నోబాల్ గాని, వైడ్ బాల్ గాని లేకుండా ఒకే ఓవర్లో 7 బంతులు వేయబడ్డాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 27వ ఓవర్ ఓవర్ వేసిన ఒమైమా సోహైల్ బౌలింగ్‌లో అఖరి బంతికు బ్యాటర్ సునే లూస్‌ను ఎల్బీగా అంపైర్ ఔటిచ్చాడు. దీంతో ఆమె రివ్యూ వెళ్లగా నాటౌట్‌గా తేలింది. ఇది ఇలా ఉంటే.. రివ్యూకు పోయిన బంతి అఖరి బంతి అన్న విషయం మర్చిపోయిన అంపైర్ బౌలర్‌తో ఆదనంగా ఇంకో బాల్‌ను వేయించాడు. ఆదనపు బంతికి సింగిల్ లభించింది. అయితే అంపైర్ చేసిన ఈ నిర్వహకం ప్రస్తుతం చర్చ నీయాంశమైంది. ఇక చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 6 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వోల్వార్డ్ట్(75), లూస్(62) పరుగులతో రాణించారు. చదవండి: ICC Womens World Cup: పాకిస్తాన్‌కు మరో ఓటమి..సెమీస్ ఆశలు గల్లంతు! Legal 7 ball over… 😲 What’s happening?#PAKvSA #CWC22 pic.twitter.com/V3Y8GpF2Aq — ಒಬ್ಬಟ್ಟು | O ₿ ₿ A T T U 🔑 (@7cr0re) March 11, 2022 -
రిమాండ్‌లోని ముగ్గురూ హైకోర్టులో హాజరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ముగ్గురిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లుగా హైకోర్టు ప్రకటించింది. చైతన్య మహిళా సంఘం సంయుక్త కార్యదర్శులు డి.దేవేంద్ర, ఎం.స్వప్న, తెలంగాణ విద్యార్థి వేదిక ప్రధాన కార్యదర్శి ఎం.సందీప్‌లను పలు కేసుల్లో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని, దీనిలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండలోని చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ ముగ్గురినీ హైకోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ముగ్గురినీ హైకోర్టులో హాజరుపర్చారు. ముగ్గురి నుంచి స్టేట్మెంట్ను నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశాలపై వేరే రూపంలో న్యాయపోరాటం చేసేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఉందని.. హెబియస్ కార్పస్ పిటిషన్లో తమ పరిధి పరిమితమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఆ ముగ్గురితో వారి తల్లిదండ్రులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయంలో కలుసుకుని మాట్లాడుకునేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
క్రికెట్లో కొత్త ఫార్మాట్.. అందరికీ చాన్స్
పంజగుట్ట: క్రికెట్ మ్యాచ్‌లో క్రీడాకారులు కొంతమంది మాత్రమే బ్యాటింగ్ చేసి మరొ కొంతమందికి ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేయలేకపోతున్నారని అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికే ‘సూధన ఫార్మాట్ ఆఫ్ క్రికెట్’ పేరుతో కొత్త ఫార్మాట్ రూపొందించినట్లు క్రీడాకారులు, రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ సూధన వెంకయ్య తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ స్వతహాగా తాను క్రికెట్‌తో పాటు పలు క్రీడలు ఆడుతానన్నారు. ఇటీవల క్రికెట్లో ఎన్నో మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా టీ 20 మ్యాచ్‌లో చివరి ఆటగాళ్లకు బ్యాటింగ్ అవకాశం దక్కడం లేదన్నారు. ఒక్కో టీంలో 11 మంది సభ్యులు ఉంటే కేవలం ఒకటి నుంచి నలుగురు మాత్రమే బ్యాటింగ్ చేసి అన్ని ఓవర్లు వారే ఆడుతుండడంతో మిగతా ఆటగాళ్లు అవకాశం దక్కక తమ ప్రతిభను చూపలేకపోతున్నారన్నారు. అందుకే తాను ప్రత్యేక ఫార్మాట్ రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 25న సాగర్‌రోడ్డు గుర్రంగుడలోని జీఎన్ఆర్ క్రికెట్ అకాడమీలో టీ 20 పోటీని నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో ప్రతి ఆటగాడికి 12 బంతులు ఆడే అవకాశం వస్తుందన్నారు. క్రీడాకారుడు మొదటి బంతిలోనే అవుట్ అయినప్పటికీ తప్పనిసరిగా 12 బంతులు ఆడాల్సిందేనని, వీరు 20 ఓవర్లలో కొట్టిన స్కొర్‌ను ఎదుటి జట్టు చేధిస్తే వారు విజేతలుగా నిలుస్తారన్నారు. రెండు టీంలు పోటీల్లో పాల్గొంటాయని, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ ఫార్మాట్‌ను ట్రయల్ బేస్‌పై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే రానున్న రోజుల్లో మరికొన్ని టీంలను కలిపి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ ఫార్మాట్‌కు కాపీరైట్స్ అనుమతి కూడా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాట్లాడుతున్న వెంకయ్య -
ముగిసిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు
= ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన ‘విజయవాడ’ = జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు, విజయవాడ క్రీడాకారులు గుంతకల్లు : స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్లో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఓపెన్ చెస్ చాంపియన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. ర్యాపిడ్ విభాగంలో ప్రతిభ చాటిన ఇద్దరు క్రీడాకారులను, బ్లిట్జ్ విభాగంలో రాణించిన మరో ఇద్దరు క్రీడాకారులను జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపిక చేసినట్లు అనంతపురం జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి హేమాద్రి తెలిపారు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగంలో రెండింటిలో గుంతకల్లుకు చెందిన తిరుమలై పురుషోత్తం అత్యధిక పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో విజయవాడకు చెందిన లక్ష్మణరావు, బ్లిట్జ్ విభాగంలో వెంకటకార్తీక్ (విజయవాడ) ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ నలుగురు క్రీడాకారులను అండమాన్ నికోబార్‌లో నవంబర్‌లో జరిగే జాతీయ స్థాయి చెస్ పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ మధ్య రైల్వే ఉమెన్స్ ఆర్గనైజేషన్ గుంతకల్లు డివిజన్ ఉపాధ్యక్షురాలు మాధవీలత, కార్యదర్శి రీటా, కోశాధికారి కేథరిన్లు హాజరై విజేతలకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉమెన్స్ ఆర్గనైజేషన్ సభ్యులు అంజుమ్, మాధవి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షురాలు ఉమ, రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఓవర్లో ఆరు వికెట్లు!
విక్టోరియా:ఒక ఓవర్లో మూడు వికెట్లు తీయడమే గొప్ప. మరి ఒకే ఓవర్ లో ఆరు వికెట్లు తీస్తే అది కచ్చితంగా అద్భుతమే. తాజాగా ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ ఒకే ఓవర్ లో ఆరు వికెట్లు తీసి అదుర్స్ అనిపించాడు. క్లబ్ క్రికెట్ లో భాగంగా గోల్డెన్ పాయింట్ క్లబ్-ఈస్ట్ బల్లారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే గోల్డెన్ పాయింట్ క్లబ్ ఆటగాడు అలెడ్ క్యారీ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. అతని వ్యక్తిగత ఎనిమిది ఓవర్ల వరకూ వికెట్ కూడా సాధించని అలెడ్.. తొమ్మిదో ఓవర్లో చెలరేగిపోయాడు. వరుసగా ఈస్ట్ బల్లారత్ ఆటగాళ్లను అవుట్ చేస్తూ ఆ ఓవర్లో ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈస్ట్ బల్లారత్ జట్టు 40 పరుగులకే చాపచుట్టేసింది. దీనిపై అలెడ్ విపరీతమైన ఆనందం వ్యక్తం చేశాడు. తాను మళ్లీ తిరిగి ఈ ఫీట్‌ను సాధిస్తానని అనుకోవడం లేదన్నాడు. తాను చాలాసార్లు హ్యాట్రిక్ వికెట్లను తీయడానికి దగ్గరగా వచ్చినా, ఆ ఘనతను ఇంతకుముందెప్పుడూ చేరుకోలేదన్నాడు. అయితే ఈ రోజు తనకు అదృష్టం కలిసొచ్చి ఒకేసారి డబుల్ హ్యాట్రిక్ సాధించడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. -
గోదావరి తుప్పల్లో బోల్తాపడిన కారు
రాజమహేంద్రవరం క్రైం : అదుపుతప్పి కారు గోదావరి నదిలో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడియం గ్రామానికి చెందిన శింగం నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున గోదావరి గట్టుపై నుంచి కడియం గ్రామానికి కారులో బయలుదేరారు. రోటరీ కైలాస భూమి దాటిన అనంతరం సుబ్బాయమ్మ ఘాట్ వద్ద కారుకు ఓ వరాహం అడ్డువచ్చింది. దానిని తప్పించే క్రమంలో గోదావరి గట్టు మీద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొని, అదుపుతప్పి గోదావరి నదిలోని తుప్పల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
-
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
న్యూఢిల్లీ: ఒక వైపు దేశంలో డీమానిటైజేషన్ కష్టాలు కొనసాగుతుండగానే బ్యాంకు ఉద్యోగులు బాంబు పేల్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహా వివిధ బ్యాంకులు, వారి ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 28న భారీ ఎత్తున ఆందోళన నిర్వహించనున్నాయి. అనంతరం డిసెంబర్ 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖను అందించనున్నామని యూనియన్లు ప్రకటించాయి. ఇదే అంశమై 2017 జనవరి 2, 3 తేదీల్లో కూడా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపాయి. ఎంప్లాయీస్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వెంకటాచలం, బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎస్ నాగార్జున ఈ మేరకు ఒక ప్రకటన జారీచేశారు. తమ సంస్థల పిలుపు మేరకు, ఇప్పటికే తమ యూనిట్లు అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు కార్యక్రమం చేపట్టి, స్తానిక ఆర్బీఐ అధికారులకు మెమోరాండం అందించినట్టు తెలిపారు. తాము సరిపడా నగదు సరఫరా చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ను కోరామనీ, కానీ ఆర్ బీఐ విఫలమైందని ఆరోపించారు. నగదు అందుబాటులో లేనపుడు ఆయా కార్యాలయల్లో లావాదేవీలను నిలిపివేసే నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. భారీ ఎత్తున కొత్త నోట్లు పట్టుబడ్డ కొంతమంది వ్యక్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. దీంతోపాటు డీమానిటైజేషన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు సిబ్బంది కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం దాదాపు 9 లక్షల బ్యాంక్ ఉద్యోగుల్లో రెండు సంఘాలు 5.50 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. రద్దయిన పాత నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్30 తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
ముగిసిన ఆందోళన
–మృతదేహానికి అంత్యక్రియలు కేతేపల్లి: మండలంలోని కొత్తపేట గ్రామంలో విద్యుదాఘాతంతో మృతిచెందిన చిట్టిమళ్ల జానయ్య అంత్యక్రియలను బుధవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి లోనైన జానయ్య మృతిచెందటం, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మంగళవారం రాత్రి పొద్దు పోయేంత వరకు బందువులు, గ్రామస్తులు, మృతదేహంతో కేతేపల్లి సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బుధవారం ట్రాన్స్‌కో అధికారులు, మృతుడి బందువులతో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడి రాజీ కుదిర్చారు. మృతుని కుటుంబానికి శాఖ పరంగా వచ్చే రూ.4లక్షల అర్థికసాయంతో పాటు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా కింది రూ.2లక్షలు, ట్రాన్స్‌కో యూనియన్ తరుపున రు.లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం కుదిర్చారు. దీంతో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే పరామర్శ: విద్యుదాఘాతంతో మృతి చెందిన చిట్టిమల్ల జానయ్య మృతదేహాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహం దహన సంస్కారాల నిమిత్తం రూ.5వేలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, నాయకులు బుర్రి యాదవరెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, కత్తుల వీరయ్య, ఆర్.సైదులు తదితరులు ఉన్నారు. -
ముగిసిన రూరల్ జోన్ క్రీడోత్సవాలు
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ తిమ్మాపూర్ విజేతలకు బహుమతులు అందజేసిన మేయర్ రవీందర్ సింగ్ కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మూడు రోజులుగా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న కరీంనగర్ రూరల్ జోన్ క్రీడోత్సవాలు శుక్రవారం ముగిశాయి. పోటీలకు ఏడు మండలాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–14, 17 బాలబాలికలకు రన్నింగ్, జంప్స్, త్రోస్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో రాణించిన తిమ్మాపూర్ మండల జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. రూరల్ జోన్‌స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపికచేశారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానం కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా యోగా సంఘం కార్యదర్శి సిద్దారెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి పుర్మ తిరుపతిరెడ్డి, కరీంనగర్ రూరల్ జోన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, మండలకార్యదర్శులు బిట్ర శ్రీనివాస్, సమ్మయ్య, బుచ్చిరెడ్డి, రవి, పీఈటీ, పీడీలు యూనుస్‌పాష, సత్యానంద్, ఎజాజ్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఖేల్‌ఖతం..
షాద్‌నగర్ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఎవరెవరు ఉంటారో పక్కింటివారికి కూడా తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని సేఫ్ షెల్టర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. –ఎన్కౌంటర్లో మాజీ మావోయిస్టు –నయీం హతం l–4గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ l–నేర సామ్రాజ్య విస్తరణకు షాద్‌నగర్‌లో మకాం l–రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించిన ఎన్కౌంటర్ l–జిల్లాకు చెందిన పలువురు ప్రజాసంఘాల –నేతల హత్యకేసుల్లో నయీంకు ప్రధానపాత్ర ‘షాక్’నగర్ సోమవారం ఉదయం నుంచీ షాద్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు, మీడియా హడావుడితో ఏం జరుగుతుందోనని పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాంగ్‌స్టర్ తమ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడని, ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నాడని, అతడు ఎన్కౌంటర్ అయ్యేంత వరకు స్థానికులకు తెలియకపోవడం గమనార్హం. నయీం ఎన్కౌంటర్ తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్న 11మంది కీలక నిందితులను ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు తెలిసింది. నేర సామ్రాజ్యాధి నేత, మాజీ మావోయిస్టు, మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నయీం రక్తచరిత్ర ఇక ముగిసింది.. నిత్యం తన వెంట ఎంతో మంది బలగం ఉన్నా ఒంటరిగానే కథ ముగించాల్సి వచ్చింది. ఒక్కడే ఉండి ఒంటరి పోరాటం చేసినా మత్యువును జయించలేపోయాడు. రాజధాని హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో ప్రశాంతంగా ఉండే షాద్‌నగర్‌ను తన నేర సామ్రాజ్య విస్తరణకు అడ్డాగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున మట్టుబెట్టడంతో నయీం కథ ముగిసినట్లయింది. పోలీసుల బూట్ల చప్పుళ్లు, కాల్పుల మోతతో షాద్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ప్రశాంతంగా ఉండే నగరం వార్తల్లోకెక్కింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రశాంతతకు మారుపేరుగా ఉండి పారిశ్రామికంగా ప్రగతిపథంలో దూసుకెళ్తున్న షాద్‌నగర్ సోమవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. మాజీ మావోయిస్టు నేత, మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నయీం ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఇదిలాఉండగా, జిల్లాలో ఇటీవల కాలంలో పెద్దగా మావోయిస్టు కార్యకలాపాలు ఏమీలేవు. మాఫియా ఆగడాలకు అవకాశమే లేదని జిల్లా ప్రజలు భరోసాతో ఉన్న సమయంలో నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి షాద్‌నగర్‌ను అడ్డాగా మార్చుకున్నాడని తెలుస్తోంది. నెలల తరబడి నయీం అనుచరులు షాద్‌నగర్ కేంద్రంగా ఉండి సెటిల్మెంట్లు, రియల్ఎస్టేట్ దందాలు, భూకబ్జాలకు పాల్పడినట్లు తెలిసింది. తమకు సహకరించని వ్యాపారులు, రియల్టర్లకు బెదిరిస్తున్న విషయం నయీం ఎన్కౌంటర్లో మరణించే దాకా బయటికి పొక్కకపోవడం విశేషం. తొలుత పీపుల్స్పార్టీలో చేరి తరువాత పార్టీని వీడి మావోయిస్టు నేతలను లక్ష్యంగా చేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న నయీం సుమారు 100కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని, 40హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నారు. షాద్‌నగర్‌లో సెఫ్టీగా అయిజ మండలానికి చెందిన పౌరహక్కుల నేత పురుషోత్తం, కనకాచారిని దారుణంగా హతమార్చడంతో పాటు పలువురి హత్యకేసుల్లో నయీం కీలక నిందితుడిగా ఉన్నాడు. షాద్‌నగర్‌ను నేరసామ్రాజ్యం అడ్డాగా మార్చుకోవడంపై పోలీసు అధికారులు పలు కోణాల్లో విశ్లేస్తున్నారు. హైదరాబాద్‌లోని తన నేరసామ్రాజ్యంపై నిఘా ఉండడంతో షాద్‌నగర్ సురక్షితంగా ఉంటుందన్న భావంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే నయీం ఇక్కడ ఉన్నా షాద్‌నగర్‌లో ప్రాంతంలో ఉంటు న్న వ్యాపారులు, రియల్టర్ల జోలికి పెద్దగా వెళ్లకపోవడం విశేషం. స్థానికులను టార్గెట్ చేస్తే తన ఆశ్రయానికి ఇబ్బంది కలుగుతుందనే ఈ ప్రాంతంలో భూదందాలపై కల్పించుకోలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇతర ప్రాంతాల వాసులకు మాత్రం ఇక్కడినుంచే ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని బెదిరించగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. అయితే సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా నయీం రహస్య స్థావరాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన ఉస్నూర్ బాషా ఆశ్రయం ఇచ్చి నయీం దందాకు సహకరించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రసంస్థలతో లింల్ ఉగ్రవాద సంస్థలకు పేలుడు సామాగ్రిని అందజేయడం ద్వారా తమ సంబంధాలను పటిష్టం చేసుకున్నారని భావిస్తున్న ఆ కోణంలో నేరచరిత్రను పరిశీలిస్తున్నారు. నల్లగొండ జిల్లావాసి అయిన నయీం మహబూబ్‌నగర్ జిల్లాతో తన నేర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతున్న జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ వంటి సంస్థలకు సహకరించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ వైపు కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్న నయీం ఇతర దేశాలకు పారిపోకుండా జాతీయస్థాయిలో పోలీసులను అప్రమత్తం చేశారు. -
ముగిసిన కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు
అర్హత సాధించిన 10,936 మంది అభ్యర్థులు ఖమ్మం క్రైం: నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 21రోజులుగా జరిగిన కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షల్లో 10,936 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో పురుషులు 8,513మంది, మహిళలు 2,423 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఖాసిం మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక పక్రియలో పోలీస్ సిబ్బంది, వ్యాయమ ఉపాధ్యాయులు, వైద్యులు, మినీస్టిరియల్ స్టాఫ్ నిబద్ధతో పనిచేసారన్నారు. ప్రధానంగా అభ్యర్థుల బయెమెట్రిక్, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల పరిశీలనలో తప్పులు జరుగకుండా అదనపు ఎస్పీ సాయికృష్ణ అధ్వర్యంలో పోలీస్ అధికారులు, ఐటీకోర్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్రావు, తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, రాంరెడ్డి, సురేందర్‌రావు, వీరేశ్వరావు, సురేష్‌కుమార్, మాణిక్‌రాజ్, సంజీవ్, ఏఓ సత్యకుమార్, జానకిరామ్, జయరాజ్, సమ్మయ్య, సత్యవతి, చంద్రకళ, అక్తరున్సీబేగం, ఓంకార్, ఫిజికల్ డైరక్టర్లు, పీఈటీలు, వైద్యులు పాల్గొన్నారు. -
రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయా?
కార్టలన్ః యాంత్రీకరణ పలు రకాల ఉద్యోగాలు అంతర్థానమయ్యేలా చేస్తోంది. వీటి ప్రభావం ఉపాధిని భారీగా దెబ్బతీస్తోంది. కంప్యూటరరీకరణ వల్ల ఉపాధి శాతం ఇప్పటికే తగ్గిపోగా.. ఆధునిక రోబోట్లు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే కొనసాగితే వచ్చే 20 ఏళ్ళలో ప్రపంచమే రోబోట్ లా మారిపోతుందేమోనన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇటీవల ఓ ఫుడ్ కంపెనీలో పనికోసం ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్ బార్న్ స్లే లోని కారల్టన్.. ప్రిమియర్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్తగా ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో.. అనేకమంది కార్మికుల ఉపాధిని కొల్లగొట్టింది. ఆ సరికొత్త యంత్రం.. వందలకొద్దీ మిస్టర్ క్లిప్పింగ్ కేక్ లను సునాయాసంగా బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేసేస్తోంది. ఇక్కడ ఈ యంత్రానికి సంబంధించిన అన్ని పనులు ఆపరేషన్ప్ మేనేజర్ డారన్ రైనే చూసుకుంటాడు. పని సరిగా చేయడం లేదు, ప్యాకింగ్ సరిగా లేదు అంటూ కార్మికులపై అరవాల్సిన పని ఇప్పుడతడికి లేదు. పనికోసం అధికశాతం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనేక చేతులున్న మనుషుల్లాగా పనిచేసే ఆరోబో... ఎంతోమంది కార్మికులు చేయాల్సిన పనిని స్వయంగా చేసేస్తోంది. ప్రిమియర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొత్తగా ప్రవేశపెట్టిన డజన్లకొద్దీ చేతులున్న ఆ యంత్రం.. సుమారు వెయ్యి కేక్ ముక్కలను కేవలం ఒక్క నిమిషంలోనే ప్యాక్ చేసేస్తుంది. రోబోకి ఏర్పాటు చేసిన కళ్ళు.. కేక్ ఆకారాన్ని గుర్తుపట్టగల్గుతాయి. దీంతో ట్రేలో సర్దుకునే ముందే వాటిలో లోపాలను గుర్తించి, ఏమాత్రం తేడా కనిపించినా వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఈ మిషన్ తో కేవలం ఒక్క నిమిషంలో 1000 వరకూ కేక్ లు ప్యాక్ అయిపోవడం చూసినవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోబోకు ఏర్పాటు చేసిన చేతులు అతి వేగంగా ఒక్కో ముక్కను ఎంచుకోవడం, ట్రేలో పెట్టి నిమిషాల్లో ప్యాక్ చేసేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కార్మికులు కేవలం మిషన్ ను ఆపరేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి మాత్రమే అవసరం అవుతారు. దీంతోపాటు రోబో తీసుకోకుండా వదిలేసిన ముక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించి ఫ్యాక్టరీ ఉద్యోగుల షాప్ కు తరలిస్తారు. బ్రిటన్ ఫ్యాక్టరీల్లో ఈ ఆటోమేషన్ ఉపయోగం ఇటీవల చాలా మామూలైపోయింది.ఇటువంటి అత్యాధునిక రోబోలు నిజంగా అద్భుతమే అనిపించినప్పటికీ, ఇక్కడ కార్మిక శక్తి తగ్గిపోవడం, ఉపాధి మార్గాలు కరువవ్వడం మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది. చివరికి మనుషులు.. ఫ్యాక్టరీల్లో చెత్తను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది. -
సీనియర్ల చేత ప్రచారం.. పార్టీలో భిన్న వాదనలు
-
రైతులకు సమగ్ర పంటల భీమా పథకం
-
గులాబీ గ్రేటర్ ఆపరేషన్
-
ఐసిస్ చేతిలోని నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఇరాక్
-
నా సస్పెన్షన్ వ్యవహారంలో జోక్యం చేసుకోండి
-
జగడం..సమాప్తం
శనివారం ఉదయం డ్యాంపై ఉద్రిక్త పరిస్థితులు ఆంధ్రా డీఐజీ, గుంటూరు ఎస్పీలతో కలిసి వచ్చిన అక్కడి పోలీసులు హుటాహుటిన డ్యాం వద్దకు చేరుకున్న మన రాష్ట్ర డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు సీఎంల చర్చల తర్వాత ఎడమకాల్వకు నీటి నిలిపివేత.. ఆన్ఆఫ్ పద్ధతిలో ఇస్తామన్న ఎస్ఈ డ్యాంను సందర్శించిన ఎస్పీఎఫ్ కమాండెంట్.. ఉదయాన్నే టీఆర్ఎస్ ఆందోళన నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జగడానికి తాత్కాలికంగా తెరపడింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి రెండు రాష్ట్రాల్లోని పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేసుకోవాలని నిర్ణయించడంతో సాగర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయాయి. సీఎంలతో చర్చల అనంతరం డ్యాం వద్ద భారీగా మోహరించిన ఇరు రాష్ట్రాల పోలీసులు ఎటువారు అటే వెళ్లిపోవడంతో ఉపశమనం లభించినట్టయింది. దీంతో శనివారం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సీఎంలతో చర్చల అనంతరం ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసుకున్న పంటలకు ఆన్ఆఫ్ పద్ధతిలో నీరు విడుదల చేస్తామని డ్యాం ఎస్ఈ తెలిపారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుడికాల్వకు నీటి విడుదలను ఏడువేల క్యూసెక్కులకు పెంచారు. విద్యుత్ కేంద్రం ద్వారా 2వేలు, హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 5వేల క్యూసెక్యులను మధ్యాహ్నం నుంచి విడుదల చేశారు. ఉదయం... ఉద్రిక్తం సాగర్ డ్యాంపై శుక్రవారం నాటి ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యాంకు అవతలి వైపు ఆంధ్ర పోలీసులు, ఇవతలివైపు తెలంగాణ పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. డ్యాం వద్ద గుంటూరు డీఐజీ సంజీవ్, ఎస్పీ రామకృష్ణ, గురజాల డీఎస్పీ నాగేశ్వర్రావు, మాచర్ల సీఐతో పాటు పోలీసు బలగాలు మోహరిస్తున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ నుంచి తెలంగాణ డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావుల నేతృత్వంలో ఆంధ్రాసరిహద్దులోని బ్రిడ్జి వద్ద, బుద్ధవనం వద్ద తాత్కాలిక పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతివాహనాన్ని తనిఖీచేసి పంపారు. దీంతోపాటు స్పెషల్ పార్టీ పోలీస్‌లను దింపారు. మొత్తం 597మంది పోలీస్ఫోర్స్ను రం గంలోకి దింపారు. మరోవైపు రైతుసంఘాల నేత లు కూడా డ్యాం వద్ద ఆందోళన చేపట్టారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వారి నిరసన విరమించారు. సీఎంల సమావేశంలో చర్చలు ఫల ప్రదం కావడంతో ఇరు వర్గాలు డ్యాం వద్ద నుంచి వెళ్లిపోయాయి. క్రమేపీ పోలీసులు డ్యాం వద్ద నుంచి వెళ్లిపోవడంతో సాగర్‌లో ప్రశాంతత నెలకొంది. అప్పటి వరకు డీఐజీతో పాటు జిల్లా ఎస్పీ, ఓఎస్డీ, మిర్యాలగూడ డీఎస్పీ గోనె సందీప్, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, పెద్దవూర తహసీల్దార్ ఖలీల్ అహ్మద్, నాగార్జునసాగర్డ్యాం ఎస్ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈలు విజయకుమార్, హాలియా సీఐ పార్థసారధి ఉన్నారు. ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్ సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వకు శుక్రవారం అర్ధరాత్రి నీటి విడుదలను నిలిపివేశారు. ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా వేసిన ఆయకట్టుకు ఈ నెల 3వ తేదీ నుంచి ఆన్ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లుగా సాగర్ డ్యాం ఎస్ఈ విజయ్‌భాస్కర్‌రావు తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ఐదు రోజులపాటు నీటిని నిలిపివేసి అనంతరం 19వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పది రోజులు నీటిని విడుదల చేసి 28వ తేదీ నీటిని నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి ఐదు రోజుల అనంతరం నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి యథావిధి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఆదివారం నుంచి యథావిధిగా ఉంటుందని మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న మాదిరిగానే ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని తెలిపారు. డ్యాం ఎస్ఈ నిర్వహణలో కొనసాగుతుందన్నారు. ఆంధ్ర అధికారుల విగ్రహాలను తొలగించాలి నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలోనే తెలంగాణ రైతులకు అన్యాయాన్ని తలపెట్టిన ఆంధ్రా ఇంజినీర్ల, నాయకుల విగ్రహాలను డ్యాం మీదనుంచి తొలగించాలని సాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సాగర్ పైలాన్ పిల్లర్ వద్ద తెలంగాణ పోలీస్‌లకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మలిగిరెడ్డి లింగారెడ్డి, రావుల భిక్షం, రవినాయక్, బషీర్, రమేశ్‌జీ, వర్రవెంకట్రెడ్డి, వల్లపురెడ్డి, కృష్ణ, నర్సిరెడ్డి, సైదులు. ఖాళీదా, నజీర్, హనుమంతు, వెంకోజీ ఉన్నారు. సాగర్ భద్రతను పరిశీలించిన ఎస్పీఎఫ్ కమాండెంట్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న రగడపై స్పందించిన ఎస్పీఎఫ్ కమాండెంట్ అన్వర్‌పాషా శనివారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. భద్రతపై ఆరాతీశారు. పేరుకు 7 వేలు.. వెళ్లేది 10వేల క్యూసెక్కులు ఆంధ్రారాష్ట్రానికి విడుదల చేసేది ఏడు వేల క్యూసెక్కులైతే వెళ్లేది మాత్రం 10వేల క్యూసెక్కులని టీఆర్ఎస్సాగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కుడికాల్వలో ఏర్పాటు చేసిన స్కేలు తప్పుల తడక అని తెలిపారు.