Women's ODI World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో నోబాల్ గాని, వైడ్ బాల్ గాని లేకుండా ఒకే ఓవర్లో 7 బంతులు వేయబడ్డాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 27వ ఓవర్ ఓవర్ వేసిన ఒమైమా సోహైల్ బౌలింగ్‌లో అఖరి బంతికు బ్యాటర్ సునే లూస్‌ను ఎల్బీగా అంపైర్ ఔటిచ్చాడు.
దీంతో ఆమె రివ్యూ వెళ్లగా నాటౌట్‌గా తేలింది. ఇది ఇలా ఉంటే.. రివ్యూకు పోయిన బంతి అఖరి బంతి అన్న విషయం మర్చిపోయిన అంపైర్ బౌలర్‌తో ఆదనంగా ఇంకో బాల్‌ను వేయించాడు. ఆదనపు బంతికి సింగిల్ లభించింది. అయితే అంపైర్ చేసిన ఈ నిర్వహకం ప్రస్తుతం చర్చ నీయాంశమైంది. ఇక చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 6 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వోల్వార్డ్ట్(75), లూస్(62) పరుగులతో రాణించారు.
చదవండి: ICC Womens World Cup: పాకిస్తాన్‌కు మరో ఓటమి..సెమీస్ ఆశలు గల్లంతు!
Legal 7 ball over… 😲 What’s happening?#PAKvSA #CWC22 pic.twitter.com/V3Y8GpF2Aq
— ಒಬ್ಬಟ್ಟು | O ₿ ₿ A T T U 🔑 (@7cr0re) March 11, 2022
Comments
Please login to add a commentAdd a comment