ఒక వైపు దేశంలో డీమానిటైజేషన్ కష్టాలు కొనసాగుతుండగానే బ్యాంకు ఉద్యోగులు బాంబు పేల్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహా వివిధ బ్యాంకులు, వారి ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 28న భారీ ఎత్తున ఆందోళన నిర్వహించనున్నాయి. అనంతరం డిసెంబర్ 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖను అందించనున్నామని యూనియన్లు ప్రకటించాయి. ఇదే అంశమై 2017 జనవరి 2, 3 తేదీల్లో కూడా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపాయి