Bank unions
-
బ్యాంకుల్లో ఊహించని మార్పులు.. వారానికి 5 రోజులే పని..ఇంకా
గత కొంత కాలంగా వారంలో ‘ఐదురోజులే పనిదినాల’పై ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్లు, ప్రతిపాదనలు చివరి దశకు వచ్చాయి. ఐదు రోజుల పనిదినాలపై మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల భవితవ్యం తేలనుంది. జులై 28న కేంద్రం సైతం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఈ సంస్కృతి ప్రైవేట్ రంగ సంస్థల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ వర్క్ కల్చర్ ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాల్ని కొనసాగిస్తుండగా.. తమకు వారాంతంలో రెండు రోజుల సెలవుల సంస్కృతిని కొనసాగించాలని ప్రభుత్వ బ్యాంక్ రంగ సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం ( ఏప్రిల్28న).. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ)లు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ఐదు రోజుల పని, వేతన పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చర్చించనున్నాయి. వీటన్నింటికంటే వారానికి ఐదురోజుల పనిదినాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నాయి. ప్రస్తుతం, బ్యాంకుల్లో మొదటి, మూడవ శనివారం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యూఎఫ్‌బీయూ బ్యాంక్ ఉద్యోగులు వారినికి రెండురోజుల సెలవులిస్తూ వారానికి ఐదు రోజులు పనిచేసే వెసలు కల్పించాలని కోరుతుంది. వారానికి ఐదు రోజుల పని కల్పించాలన్న యూఎఫ్‌బీయూ డిమాండ్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ప్రకారం, వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున, దీనికి బదులుగా 5 రోజుల పాటు, సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది. దీంతో పాటు పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్ విధానంలో అనుమతించాలని కోరుతోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే..బ్యాంక్ ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ఎలాన్ మస్క్‌కు మెలిక పెట్టిన కేంద్రం! -
బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె,వారానికి 5 రోజులే పనిచేస్తాం!
ప్రైవేట్ ఉద్యోగస్థుల తరహా పనివేళలు తమకు ఉండాలని జూన్ 27న 9 బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇదే విషయంపై గత కొన్నేళ్లుగా విన్నపాలు వినిపిస్తున్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదని బ్యాంక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు సోమవారం నుంచి శుక్రవారం వరకు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం కుటుంబ సభ్యులతో గడుపుతుంటుంటారు. ఇప్పుడీ ఈ పని విధానాన్ని బ్యాంక్ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 7 ఏళ్లుగా వారానికి 5 రోజుల పనిదినాల్ని అమలు చేసేలా బ్యాంక్ స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నట్ల తెలిపారు. వర్కింగ్ డేస్‌ను కుదించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంతోపాటు వారి వర్క్‌లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నారు. అయితే ఆ చర్చలు విఫలమవుతున్నాయని, కానీ ఈనెల 27 జరిగే సమ్మెలో తమ డిమాండ్‌ను ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ (ఏఐబీఈఏ) సీహెచ్ వెంకటా చలం తెలిపారు. ఈ సందర్భంగా వెంకటా చలం మాట్లాడుతూ జూన్ 27న సుమారు 9 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రొటెస్ట్‌లో ఐదురోజుల పనిదినాల అమలుతో పాటు మరికొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచుతామని పేర్కొన్నారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు 2015 నుంచి వారానికి 5 రోజుల పని దినాల్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. శనివారం, ఆదివారం సెలవు కావాలని కోరుతున్నాయి. ఉద్యోగులు సెలవు దినాల్లో తప్ప శనివారం రోజు పనిచేస్తున్నారు. అరె ఇప్పటి వరకు మా విన్నపాన్ని ఎవరు పట్టించుకోలేని చెప్పారు. మేం ఏ పాపం చేశాం విదేశాల్లో బ్యాంక్ ఉద్యోగులు షిఫ్ట్‌లు వైజ్‌గా వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మన దేశానికి చెందిన బ్యాంక్ ఉద్యోగులు వారానికి 6రోజులు పనిచేస్తున్నారని నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (ఎన్సీఈబీ) జనరల్ సెక్రటరీ బండ్లీష్ మేం ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ సైతం 5 వర్కింగ్ డేస్ బ్యాంక్‌లు మినిహాయిస్తే ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, ఎల్ఐసీ సంస్థ ఉద్యోగులు సైతం వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు. కానీ మేం (బ్యాంక్ ఉద్యోగులు) మాత్రం 6 రోజులు పనిచేస్తున్నాం. భారత్‌ను బలమైన ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు డిజిటల్ ఇండియా అందుబాటులోకి వచ్చింది. ఆ వ్యవస్థను ఆసరగా చేసుకొని వివిధ పద్దతుల్లో బ్యాంక్ కార్యకాలాపాల్ని అందించవచ్చు. అందుకే బ్యాంక్ ఉద్యోగులు వారానికి 5 రోజులకు పనిదినాల్ని కుదించాలని డిమాండ్ చేస్తున్నట్లు బండ్లీష్ తెలిపారు. -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 2 రోజులు బ్యాంక్ యూనియన్ల సమ్మె!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతామని బ్యాంక్ యూనియన్లు నోటీసులు ఇచ్చాయి. రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం సమాయత్తం అయిన నేపథ్యంలో బ్యాంకులు ఈ రెండు రోజుల సమ్మె బాట పట్టాయి. పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ, 2019లో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీకి మెజారీటీ వాటా విక్రయం ద్వారా ఐడీబీఐని కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరించింది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను కూడా కేంద్రం విజయవంతంగా పూర్తిచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాలను 26 శాతానికి తగ్గించుకోడానికి వెసులు బాటు కల్పించడానికి ఉద్దేశించి బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి వీలుగా బ్యాంకింగ్ చట్ట (సవరణ) బిల్లును కేంద్రం లిస్ట్ చేసింది. ఆయా చర్యలను నిరసిస్తూ, రెండు రోజుల సమ్మె నిర్వహించాలని బ్యాంకింగ్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)కు యూఎఫ్‌బీయూ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. -
రెండు రోజులు బ్యాంకింగ్ సమ్మె!
సాక్షి, న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ, మార్చి 15 నుంచీ రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించాలని తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) మంగళవారం బ్యాంకింగ్‌కు పిలుపునిచ్చింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో.. తాము మార్చి 15 నుంచి సమ్మె చేయనున్నట్లుగా యూఎఫ్‌బీయూ స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. 2019లో ఈ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీకి విక్రయించింది. అలాగే గడచిన నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. -
భారత్ బంద్‌కు విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ దేశవ్యాప్త బంద్‌కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సత్వరం పరిష్కారం చూపనట్లయితే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్ 9న పవార్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ వెల్లడించారు. పవార్‌తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి. మరోవైపు, రేపటి(డిసెంబర్ 8, మంగళవారం) బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి 250 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిపాయి. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. ఇది దేశవ్యాప్త నిరసన. కేంద్రం త్వరగా స్పందించనట్లయితే.. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మేం భారత్ బంద్‌కు పిలుపునివ్వడంపై నిన్నటి(శనివారం) చర్చల సందర్భంగా మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు’ అని రైతు నేత బల్దేవ్ సింగ్ యాదవ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బంద్ నుంచి అంబులెన్స్‌లకు, అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చామన్నారు. బంద్‌లో అంతా శాంతియుతంగా పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. బంద్‌కు మద్దతుగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపింది. నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘ఎంఎన్ఎం’ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సహా పలు బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఎన్ఆర్ఐ కుటుంబాల మద్దతు ఈ ఉద్యమంలో అన్ని విధాలుగా సాయం చేసేందుకు విదేశాల్లోని తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని కొందరు రైతులు వెల్లడించారు. దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చిన విషయం తెలిసిందే. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాల్లో పంజాబ్ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. విపక్ష నేతల ఉమ్మడి ప్రకటన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఏజీడీ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రైతుల న్యాయబద్ధ డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అందులో వారు కోరారు. ఈ ప్రకటనపై తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అఖిలేశ్‌యాదవ్(ఎస్పీ), డీ రాజా(ఆర్జేడీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదతరులు సంతకాలు చేశారు. లండన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఎన్ఆర్ఐల నిరసన -
ఎస్బీఐలో వీఆర్ఎస్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు చేయాలని భావిస్తోంది. దీన్ని వినియోగించుకునేందుకు సుమారు 30,190 మంది ఉద్యోగులకు అర్హత ఉంటుందని తెలుస్తోంది. వీఆర్ఎస్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమయినట్లు, బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్ – 2020’ పేరిట ప్రతిపాదించే స్కీమును ప్రధానంగా మానవ వనరుల వినియోగాన్ని, ఖర్చులను మెరుగుపర్చుకోవడానికి ఉద్దేశించినట్లు వివరించాయి. తమ కెరియర్లో ఆఖరు స్థాయికి చేరినవారు, అత్యుత్తమ పనితీరు కనపర్చలేని పరిస్థితుల్లో ఉన్న వారు, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు, ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నవారు గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు కూడా ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. అయితే, ప్రతిపాదిత వీఆర్ఎస్ స్కీముపై బ్యాంకు యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారితో కుదేలవుతున్న తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ఉద్యోగులపై యాజమాన్యానికి ఉన్న వ్యతిరేక ధోరణులను సూచిస్తోందని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా వ్యాఖ్యానించారు. పాతికేళ్ల సర్వీసు.. కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఈ స్కీము అందుబాటులో ఉంటుంది. ముసాయిదా ప్రకారం వీఆర్ఎస్ పథకం డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి ఆఖరు దాకా అమల్లో ఉంటుంది. వీఆర్ఎస్ దరఖాస్తులను ఈ వ్యవధిలో మాత్రమే స్వీకరిస్తారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 11,565 మంది అధికారులు, 18,625 ఇతర సిబ్బందికి వీఆర్ఎస్ ఎంచుకునేందుకు అర్హత ఉంటుంది. 2020 జూలై వేతనాలు బట్టి అర్హత కలిగిన ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది దీన్ని ఎంచుకున్నా బ్యాంకుకు నికరంగా సుమారు రూ. 1,663 కోట్ల దాకా మిగులుతుందని అంచనా. వీఆర్ఎస్ ఎంచుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, వైద్యం తదితర ప్రయోజనాలన్నీ కూడా లభిస్తాయి. అలాగే దీని కింద రిటైరైన వారు పదవీ విరమణ తేది నుంచి రెండేళ్ల తర్వాత తిరిగి బ్యాంకులో చేరేందుకు లేదా సర్వీసులు అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. గతేడాది 2.57 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2020 మార్చి ఆఖరు నాటికి 2.49 లక్షలకు తగ్గింది. -
మార్చి 27న బ్యాంకుల సమ్మె
చెన్నై: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మె చేపట్టనున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మెగా బ్యాంక్ విలీనాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్) మార్చి 27 న సమ్మెకు దిగనున్నాయి. బ్యాడ్ లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. చెడు రుణాల మొత్తం రూ. 216,000 కోట్లుగా వుండటంతో, 2019 మార్చి 31 తో ముగిసిన సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ .150,000 కోట్ల స్థూల లాభాలకు పరిమితమైనాయని తెలిపారు. దీంతో రూ .66,000 కోట్ల నికర నష్టం వాటిల్లిందని విమర్శించారు. తాజా బ్యాంకుల విలీనం వల్ల భారీ ఎత్తున పేరుకు పోయిన కార్పొరేట్ బ్యాడ్ లోన్లు తిరిగి వస్తాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. దీనికి ఉదాహరణగా ఎస్బీఐ విలీనం విలీనం తరువాత ఈ బెడదమరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. కేవలం 323 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో బ్యాంకుల సంఖ్య భారతదేశంలోని బ్యాంకుల కంటే ఎక్కువ ఉందని, అలాంటిది 1.35 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఏకీకరణ అవసరం లేదని వెంకటాచలం అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆ రెండ్రోజులు బ్యాంకులు పనిచేయవు..
కోల్‌కతా : వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు ముందుకు సాగకపోవడంతో ఈనెల 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. డిమాండ్ల సాధన కోసం మరోసారి మార్చి 11 నుంచి 13 వరకూ సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య (యూఎఫ్‌బీయూ) వెల్లడించింది. అప్పటికీ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూఎఫ్‌బీయూ పశ్చిమ బెంగాల్ కన్వీనర్ సిద్ధార్ధ ఖాన్ వెల్లడించారు. కాగా యూఎఫ్‌బీయూ 15 శాతం వేతన పెంపును కోరుతుండగా ఐబీఏ 12.25 శాతం మేరకే పెంపును పరిమితం చేస్తోందని ఇది తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు. నెలాఖరు నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మె తలపెట్టడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అత్యవసర క్లియరెన్స్, ఏటీఎం సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు. -
జనవరి 8 సమ్మెలో ఆరు బ్యాంకు సంఘాలు
సాక్షి, ముంబై: జనవరి 8న దేశవ్యాప్తంగా చేపట్టనున్న అఖిల భారత సమ్మెకు పలు బ్యాంకింగ్ సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబిఎ) ప్రకారం ఆరు బ్యాంకు సంఘాలు కూడా సమ్మెలో చేరనున్నాయి. ఆరు ఉద్యోగ సంఘాలు (ఏఐబీఈఏ, ఏఐబీఓఏ,బీఎఫ్ఎప్ఐ, ఐఎన్ బీఈఎఫ్, ఐఎన్ బీఓసీ, బీకేఎస్ఎంఈ) సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయ. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చింది. అలాగే సెంట్రల్, కోఆపరేటివ్, రీజినల్ గ్రామీణ , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా ఈ సమ్మెలో చేరాలని నిర్ణయించాయి. దీంతో అధికారికంగా ఆ రోజు (జనవరి 8, బుధవారం) సాధారణ సెలవు దినం కానప్పటికీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా బ్యాంకు ఏటీఎం సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే, ఆన్లైన్ లావాదేవీలు ప్రభావితం కావు. మరోవైపు ఈ యూనియన్లలో ఉద్యోగుల సభ్యత్వం చాలా తక్కువ కాబట్టి బ్యాంకు కార్యకలాపాలపై సమ్మె ప్రభావం తక్కువగా ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. -
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 10న పార్లమెంట్ ముందు భైఠాయించాలని బ్యాంక్ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్ సేవలను కచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి. -
నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
న్యూఢిల్లీ/కోల్‌కతా: బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ)లు బ్యాంక్ యూనియన్లు జాతీయ స్థాయిలో 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే బ్యాంక్ ఆఫీసర్లు, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు, ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. బ్యాంక్‌ల విలీనం వీటిపై ఎలాంటి ప్రభావం చూపనందున ఇవి ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మె కొనసాగుతుంది.... ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీ.హెచ్. వెంకటాచలమ్ పేర్కొన్నారు. అందుకని సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మె పరిధిలోనే ఉన్నందున ఏటీఎమ్‌లను కూడా మూసేస్తామని బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కొన్ని బ్యాంక్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం, బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని ఈ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తగిన స్థాయిల్లో బ్యాంక్ క్లర్క్‌లను నియమించాలని, భారీగా పేరుకుపోతున్న మొండి బకాయిల రికవరీకి గట్టి చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభావం స్వల్పమే !.. పలు బ్యాంక్‌లు ఇప్పటికే సమ్మె విషయమై తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ సంఘాల్లో తమ ఉద్యోగుల సభ్యత్వం తక్కువగా ఉందని, ఈ సమ్మె ప్రభావం బ్యాంక్ కార్యకలాపాలపై స్వల్పంగానే ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. సమ్మె కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ పేర్కొంది. అయితే సమ్మె జరిగితే, కార్యకలాపాలపై ప్రభావం ఉండగలదని వివరించింది. గత నెలలో 26, 27 తేదీల్లో బ్యాంక్‌ల సమ్మెకు ఆఫీసర్ల యూనియన్లు పిలుపునిచ్చాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ యూనియన్లు సమ్మెను విరమించాయి. -
బ్యాంకుల దేశవ్యాప్త 24 గంటల సమ్మె
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. రేపు (మంగళవారం, అక్టోబరు 22) ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. రెండు బ్యాంకు సంఘాలు అక్టోబర్ 22న 24 గంటల సమ్మెను ప్రకటించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి బ్యాంకు విలీనాలు, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) మరియు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఈ సమ్మెను చేపట్టనున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనవు.అయితే తన ఉద్యోగులలో ఎక్కువమంది పాల్గొనే యూనియన్లలో సభ్యులు కానందున సమ్మె ప్రభావం తమ కార్యకలాపాలపై తక్కువగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. సమ్మె కారణంగా తమ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ రెగ్యులేటరీకి ఇప్పటికే తెలియజేసింది. తమ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి మంచి స్పందన వస్తుందని తాము ఆశిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (స్టేట్ ఫెడరేషన్) ప్రధాన కార్యదర్శి జాయిదేబ్ దాస్‌గుప్తా అన్నారు. ఎస్బీఐ కూడా సమ్మెలో భాగమైతే బావుండేదన్నారు. -
మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంతో సహా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతో బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపు నిచ్చాయి. అక్టోబర్ 22, మంగళవారం నిర్వహించనున్న ఈ సమ్మె కారణంగా తమ బ్యాంకింగ్‌కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. అక్టోబర్ 22న ట్రేడ్ యూనియన్ సంస్థలు ప్రతిపాదించిన సమ్మె కారణంగా బ్యాంక్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే హెచ్చరించింది. తమ శాఖల పనితీరు ప్రభావితం కావచ్చు లేదా స్తంభించిపోవచ్చు అని ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కార్యకలాపాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ హామీ ఇచ్చింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) సంయుక్తంగా అక్టోబర్ 22 న అఖిల భారత బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) మద్దతు లభించిందని అసోసియేషన్ ప్రకటించింది. ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా ఏర్పరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ విలీనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమని విమర్శిస్తున్నాయి. గత నెలలో కూడా నాలుగు బ్యాంక్ యూనియన్లు, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ)ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్బీవోసీ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్వోబీవో) , ఇలాంటి సమస్యలపై సమ్మెకు పిలుపునిచ్చారు. తరువాత, కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తమ డిమాండ్లను పరిశీలిస్తామని యూనియన్లకు హామీ ఇవ్వడంతో సెప్టెంబర్ 26-27 నిర్వహిచ తలపెట్టిన 48 గంటల సమ్మె వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
రెండు రోజుల బ్యాంకుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న బ్యాంకింగ్ యూనియన్లు మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు బ్యాంక్ ఆఫీసర్స్ ట్రేడ్ యూనియన్ సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఇచ్చిన నోటీసులిచ్చాయి. ముఖ్యంగా 10 ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించనున్నాయి. ఈ మేరకు బ్యాంకింగ్ రంగంలో విలీనాలు, సమ్మేళనాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25 అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు నిరంతర సమ్మెకు పిలుపునిచ్చాయి. అలాగే నవంబర్ రెండవ వారం నుండి నిరవధిక సమ్మెకు వెళ్లాలని ప్రతిపాదించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబీఓ) సంయుక్తంగా ఈ సమ్మె నోటీసును అందించాయి. 4 Bank Officers' Trade Union Organisations have proposed to go on a continuous strike from midnight of 25 Sept to midnight of 27 Sept and on an indefinite strike from second week of Nov 2019, against the mergers & amalgamations in banking sector. pic.twitter.com/o3YGUisbAZ — ANI (@ANI) September 13, 2019 -
బ్యాంక్‌లు బంద్ ; ఏటీఎంలపై తీవ్ర ప్రభావం
-
బ్యాంకుల సమ్మె; ముందే జీతాలు వేసినా..
న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో ఈ బంద్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నెల ముగింపు కావడంతో, ఉద్యోగుల వేతనాలు పడేది కూడా ఈ రోజుల్లోనే. మే 30, 31 తేదీల్లో బ్యాంకుల బంద్ కాబట్టి, కంపెనీలు లేదా ఆర్గనైజేషన్స్ తమ ఉద్యోగుల వేతనాలను ఈ రోజే(మంగళవారమే) క్రెడిట్ చేసే అవకాశముంది. ఉద్యోగుల వేతనాలు నేడే క్రెడిట్ అయినప్పటికీ, వాటిని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు లేకుండా..ఈ బంద్ దెబ్బకొట్టనుంది. ఈ బంద్‌లో ఏటీఎం గార్డులు కూడా పాలుపంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎంలు మూతపడబోతున్నాయి. దీంతో వేతన విత్‌డ్రాయల్స్ కష్టతరంగా మారనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. థర్డ్ పార్టీతో కలిసి బ్యాంకులు ఏటీఎంలను నింపినప్పటికీ, ఏటీఎంల సెక్యురిటీ మాత్రం ప్రశ్నార్థకమే. దీంతో నగదు విత్‌డ్రాయల్స్‌లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంద్ నేపథ్యంలో కస్టమర్లు భారీ ఎత్తున్న నగదు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్ బ్యాంకు యూనియన్ ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. అయితే ఈ రెండు రోజులు మాత్రం ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కేవలం 2 శాతం వేతన పెంపును మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ.. బ్యాంకు యూనియన్లు ఈ బంద్ చేపడుతున్నాయి. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. గత రెండు నుంచి మూడేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం జన్‌ధన్, డిమానిటైజేషన్, ముద్రా, అటల్ పెన్షన్ యోజన వంటి వాటిని ఎంతో కృతనిశ్చయంతో అమలు చేస్తూ వస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ల కన్వినర్ దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. 2017 నవంబర్ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఖరారు
సాక్షి, చెన్నై: బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల పాటు(48 గంటల) సమ్మె చేపట్టనున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నాయకులు చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మె చేపట్టనున్నారు. మే 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 6గంటల వరకు సమ్మె నిర్వహించేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. వేతనాల సమీక్ష విషయంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య మే 5 న ముంబైలో జరిగిన చర్చలు మరోసారి విఫలమవడంతో సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. బ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ చీఫ్ లేబర్ కమీషనర్ (సెంట్రల్), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కు సమ్మె నోటీసులిచ్చామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. . 2017, నవంబరు నుంచి వేతన సవరణ పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపునకు బదులుగా 2శాతం ఐబీఏ ఆఫర్ చేయడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ నెల ఆఖరున బ్యాంకు ఉద్యోగుల సమ్మె
-
రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల బంద్
ముంబై : బ్యాంకు ఉద్యోగులు మరోసారి బంద్‌కు దిగబోతున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకర్లు ఈ నెల ఆఖరున 48 గంటల పాటు బంద్‌కు దిగనున్నట్టు పిలుపునిచ్చారు. వేతనాల సమీక్ష విషయంలో శనివారం యునిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు ఉద్యోగులు ఈ బంద్ చేపట్టబోతున్నారు. యూఎఫ్‌బీయూలో తొమ్మి బ్యాంకు యూనియన్లు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులకు అందించే వేతన పెంపు చాలా తక్కువ మొత్తంలో ఉందని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. కేవలం రెండు శాతం పెంపు చేపట్టడం చాలా దారుణమన్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతన చర్చలను, వేతన సమీక్షను 2017 నవంబర్ 1వరకు పూర్తి చేయాలని బ్యాంకు మేనేజ్మెంట్లను, ఐబీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు సార్లు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్, బ్యాంకు యూనియన్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై 2018 మార్చి 15న యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోసారి ఐబీఐ చర్చలకు పిలవడంతో, యూనియన్లు ఆ బంద్‌ను వాయిదా వేశాయి. శనివారం ముంబైలో బ్యాంకు యూనియన్లకు, ఐబీఏకు మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ నెల ఆఖరున రెండు రోజులు బంద్‌చేపట్టాలని యూనియన్లు నిర్ణయించాయి. 2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. కానీ ఈ పెంపును 2 శాతం మాత్రమే చేపట్టనున్నట్టు ఐబీఏ 2017 మార్చి 3న ప్రకటించింది. ప్రస్తుతం ఐబీఏ ఆఫర్‌చేసే మొత్తం చాలా తక్కువగా ఉందని, ఈ ఆఫర్‌ను యూనియన్లు తిరస్కరిస్తున్నట్టు టాప్ యూనియన్ నాయకుడు చెప్పారు. ఈ విషయంలో వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. వేతన పెంపును పెంచేలా ఐబీఏకి సూచించాలని, ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంలో విఫలమైతే ఈ నెల చివరిన 48 గంటల పాటు బంద్ చేయనున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. -
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
-
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
న్యూఢిల్లీ: ఒక వైపు దేశంలో డీమానిటైజేషన్ కష్టాలు కొనసాగుతుండగానే బ్యాంకు ఉద్యోగులు బాంబు పేల్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహా వివిధ బ్యాంకులు, వారి ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 28న భారీ ఎత్తున ఆందోళన నిర్వహించనున్నాయి. అనంతరం డిసెంబర్ 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖను అందించనున్నామని యూనియన్లు ప్రకటించాయి. ఇదే అంశమై 2017 జనవరి 2, 3 తేదీల్లో కూడా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపాయి. ఎంప్లాయీస్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వెంకటాచలం, బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎస్ నాగార్జున ఈ మేరకు ఒక ప్రకటన జారీచేశారు. తమ సంస్థల పిలుపు మేరకు, ఇప్పటికే తమ యూనిట్లు అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు కార్యక్రమం చేపట్టి, స్తానిక ఆర్బీఐ అధికారులకు మెమోరాండం అందించినట్టు తెలిపారు. తాము సరిపడా నగదు సరఫరా చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ను కోరామనీ, కానీ ఆర్ బీఐ విఫలమైందని ఆరోపించారు. నగదు అందుబాటులో లేనపుడు ఆయా కార్యాలయల్లో లావాదేవీలను నిలిపివేసే నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. భారీ ఎత్తున కొత్త నోట్లు పట్టుబడ్డ కొంతమంది వ్యక్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. దీంతోపాటు డీమానిటైజేషన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు సిబ్బంది కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం దాదాపు 9 లక్షల బ్యాంక్ ఉద్యోగుల్లో రెండు సంఘాలు 5.50 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. రద్దయిన పాత నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్30 తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
సరిపడేంతగా నోట్లు సరఫరా చేయాలి
• ఆర్బీఐకి బ్యాంక్ యూనియన్ల డిమాండ్ • రోజుకో కొత్త రూలుతో మరింత గందరగోళమని వ్యాఖ్య • ప్రజలను ఉసిగొల్పేలా వ్యాఖ్యలు వద్దంటూ రాజకీయ నేతలకు సూచన న్యూఢిల్లీ: నగదు కొరత కారణంగా బ్యాంకు సిబ్బంది ఖాతాదారుల ఆగ్రహానికి గురవుతున్న నేపథ్యంలో డిమాండ్‌కి తగ్గ స్థారుులో నోట్లను సమకూర్చాలంటూ బ్యాంకు యూనియన్లు .. రిజర్వ్ బ్యాంక్‌ను కోరారుు. పుష్కలంగా నగదు నిల్వలు ఉన్నప్పటికీ బ్యాంకులు.. ఖాతాదారులకు ఇవ్వడం లేదంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారుు. రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తున్న నగదు మొత్తం ఖాతాదారులకు అందిస్తున్నామంటూ నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్వోబీడబ్ల్యూ) ఒక ప్రకటన విడుదల చేసింది. ’ఆర్బీఐ ఇచ్చే నగదును ఖాతాదారులకు అందించడమే తప్ప బ్యాంకులు స్వయంగా నోట్లను ముద్రించవన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు బ్యాంకు ఉద్యోగులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు’ అని ఎన్వోబీడబ్ల్యూ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా పేర్కొన్నారు. బాధ్యతారహితమైన ప్రకటనలతో ప్రజలను బ్యాంకర్లపైకి ఉసిగొల్పే చర్యలను రాజకీయ నేతలు మానుకోవాలని ఆయన సూచించారు. నల్లధనంపై పోరు పేరిట నవంబర్ 9 నుంచి రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్రం రద్దు చేసినప్పట్నుంచీ బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ప్రజలు బారులు తీరి ఉంటున్నారు. వారం, పది రోజులు టెన్షనే.. జీతాల సమయం కావడంతో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లతో బ్యాంకులు పోటెత్తనున్న నేపథ్యంలో రాబోయే వారం, పది రోజులు పరిస్థితి చాలా ఆందోళనకరంగానే ఉండగలదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ పేర్కొంది. ఒకవేళ ఆర్బీఐ గానీ తగినంత నగదు సమకూర్చకపోతే శాంతి, భద్రతల సమస్యకు కూడా దారితీయొచ్చంటూ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్‌కు ఏఐబీఈఏ ఈ మేరకు లేఖ రాసింది. చాలా మటుకు ఏటీఎంలు మొరారుుస్తుండటంతో బ్యాంకుల్లో రద్దీ మరింత భారీగా ఉండనుందని పేర్కొంది. మరోవైపు, ఆర్బీఐ నిత్యం అసంఖ్యాకంగా ఆదేశాలు జారీ చేస్తోందని అరుుతే, ప్రధాన కార్యాలయాల నుంచి సూచనలు అందేదాకా వేచి ఉండాల్సినందున.. వీటిని అప్పటికప్పుడు అమలు చేయడమనేది బ్యాంకుల సిబ్బందికి కష్టసాధ్యమవుతోందని ఏఐబీఈఏ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ ఆదేశాలు సమస్యలను పరిష్కరించడం కన్నా కొత్త సమస్యలు తెచ్చిపెట్టేవిగా ఉన్నాయని పేర్కొంది. శాఖల ముందు నో క్యాష్ బోర్డులతో బ్యాంకుల విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింటోందని వ్యాఖ్యానించింది. బ్యాంకు శాఖలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, గొడవలు కూడా జరగవచ్చని ఏఐబీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. సిబ్బందికి తగినంత భద్రత కల్పించే విధంగా పోలీసుల సహకారాన్ని కోరేలా బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తగు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ తగినంత స్థారుులో నగదును సరఫరా చేయాలని ఆల్ ఇండియా బ్యంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) కోరింది. -
ఆగ్రహించిన బ్యాంకు ఉద్యోగులు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు బుధవారం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. అధికారులు కూడా సంఘీభావం తెలుపడంతో జిల్లాలో సుమారు 300 బ్యాంకు శాఖలు మూతబడ్డాయి. దీంతో వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు లేక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఒంగోలు నగరంలోని బ్యాంకు ఉద్యోగులు స్థానిక భాగ్యనగర్‌లోని ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వద్ద గల, సిండికేట్ బ్యాంకు వరకు ప్రదర్శనగా వచ్చి సభ నిర్వహించారు. ఏఐబీఈఏ నాయకుడు వి.పార్థసారధి మాట్లాడుతూ 10వ వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ఎఫ్‌డీఐలను వ్యతిరేకించాలని, బ్యాంకింగ్ సెక్టార్లో వస్తున్న నూతన సవరణలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్సు ఖర్చులన్నీ బ్యాంకులే భరించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సర్దార్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న నూతన ఆర్థిక విధానాలను ఆపివేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగర కో-ఆర్డినేషన్ సమితి ప్రధాన కార్యదర్శి వి.రామచంద్రరావు (రాము) నాయకులను ఆహ్వానించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ యూపీఏ-2 ప్రభుత్వం ఎల్ఐసీ, బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ప్రభుత్వ వాటాలను తగ్గిస్తూ, బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్పొరేషన్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్సులివ్వడాన్ని వ్యతిరేకించారు. ధరలు విపరీతంగా పెంచుతూ, ద్రవ్యోల్బణానికి లెక్కలు కల్పించిన ప్రభుత్వం, వేతన సవరణలో 5 శాతం మాత్రమే వేతనం పెంచుతామనడం దారుణమన్నారు. 10వ వేతన సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని కోరారు. ఉద్యోగులు పోరాటాల ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోవాలని కోరారు. బ్యాంకుల విలీనాలను వ్యతిరేకించాలని కోరారు. నగరంలోని 50 పైగా బ్యాంకు శాఖలన్నీ మూతబడ్డాయని.. ఎస్బీఐలోని క్లియరింగ్ హౌస్ పని చేయలేదని, 2000 కోట్లపై చిలుకు నగదు లావాదేవీలు నిలిచిపోయాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని మార్కాపురం, చీరాల, కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, కొండపి, పర్చూరు తదితర అన్ని ప్రధానమైన ప్రాంతాల్లో స్వీపర్ మొదలుకొని, మేనేజర్ల స్థాయి వరకు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారన్నారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, యు.ప్రకాశరావు, సీహెచ్ శ్రీనివాసరావు, ఎ.సుధాకరరావు, యు.వేణుగోపాల్, కె.రాజేశ్వరరావు, వి.ఆంజనేయులు, మల్లికార్జునరావు, సీహెచ్ శోభన్‌బాబు, పి.నరసింహ, కె.జానకిరామయ్య, ఎ.వేణుగోపాలరావు, డి. కోటేశ్వరరావు, ఎం.నరేంద్రబాబు, పి.బ్రహ్మయ్య, వి.వి.రమణమూర్తి, టీఎల్ ప్రసాద్, వంశీకృష్ణ, బి.వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, ఉమాపతి, కె.వి.రమణయ్య, డి.శశిధర్, కె.హనుమంతరావు నాయక్, బి.సురేంద్రబాబు, జిలానీ, చైతన్య, ఆర్.డేవిడ్‌కింగ్,లక్ష్మీమాధవి, ఇందు, జి. శ్రీనివాసులు, రమణకుమార్ పాల్గొన్నారు. -
నేడు బ్యాంకు యూనియన్ల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న సంస్కరణలను తక్షణం నిలిపివేయడంతో పాటు, వేతన సవరణను చేపట్టాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు బుధవారం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో దేశంలోని 47 బ్యాంకులకు చెందిన పది లక్షల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ సమ్మెకు ఆంధ్రాబ్యాంకుకు చెందిన 20,000 మంది ఆఫీసర్లు, ఇతర ఉద్యోగులు మద్దతు తెలుపుతున్నట్లు ఆల్ ఇండియా ఆంధ్రాబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూని యన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ టి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మెతో బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది.