సరిపడేంతగా నోట్లు సరఫరా చేయాలి
• ఆర్‌బీఐకి బ్యాంక్ యూనియన్ల డిమాండ్
• రోజుకో కొత్త రూలుతో మరింత గందరగోళమని వ్యాఖ్య
• ప్రజలను ఉసిగొల్పేలా వ్యాఖ్యలు వద్దంటూ రాజకీయ నేతలకు సూచన
న్యూఢిల్లీ: నగదు కొరత కారణంగా బ్యాంకు సిబ్బంది ఖాతాదారుల ఆగ్రహానికి గురవుతున్న నేపథ్యంలో డిమాండ్‌కి తగ్గ స్థారుులో నోట్లను సమకూర్చాలంటూ బ్యాంకు యూనియన్లు .. రిజర్వ్ బ్యాంక్‌ను కోరారుు. పుష్కలంగా నగదు నిల్వలు ఉన్నప్పటికీ బ్యాంకులు.. ఖాతాదారులకు ఇవ్వడం లేదంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారుు. రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తున్న నగదు మొత్తం ఖాతాదారులకు అందిస్తున్నామంటూ నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్‌వోబీడబ్ల్యూ) ఒక ప్రకటన విడుదల చేసింది. ’ఆర్‌బీఐ ఇచ్చే నగదును ఖాతాదారులకు అందించడమే తప్ప బ్యాంకులు స్వయంగా నోట్లను ముద్రించవన్న సంగతి గుర్తుంచుకోవాలి.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు బ్యాంకు ఉద్యోగులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు’ అని ఎన్‌వోబీడబ్ల్యూ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా పేర్కొన్నారు. బాధ్యతారహితమైన ప్రకటనలతో ప్రజలను బ్యాంకర్లపైకి ఉసిగొల్పే చర్యలను రాజకీయ నేతలు మానుకోవాలని ఆయన సూచించారు. నల్లధనంపై పోరు పేరిట నవంబర్ 9 నుంచి రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్రం రద్దు చేసినప్పట్నుంచీ బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ప్రజలు బారులు తీరి ఉంటున్నారు.
వారం, పది రోజులు టెన్షనే..
జీతాల సమయం కావడంతో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లతో బ్యాంకులు పోటెత్తనున్న నేపథ్యంలో రాబోయే వారం, పది రోజులు పరిస్థితి చాలా ఆందోళనకరంగానే ఉండగలదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ పేర్కొంది. ఒకవేళ ఆర్‌బీఐ గానీ తగినంత నగదు సమకూర్చకపోతే శాంతి, భద్రతల సమస్యకు కూడా దారితీయొచ్చంటూ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్‌కు ఏఐబీఈఏ ఈ మేరకు లేఖ రాసింది. చాలా మటుకు ఏటీఎంలు మొరారుుస్తుండటంతో బ్యాంకుల్లో రద్దీ మరింత భారీగా ఉండనుందని పేర్కొంది. మరోవైపు, ఆర్‌బీఐ నిత్యం అసంఖ్యాకంగా ఆదేశాలు జారీ చేస్తోందని అరుుతే, ప్రధాన కార్యాలయాల నుంచి సూచనలు అందేదాకా వేచి ఉండాల్సినందున.. వీటిని అప్పటికప్పుడు అమలు చేయడమనేది బ్యాంకుల సిబ్బందికి కష్టసాధ్యమవుతోందని ఏఐబీఈఏ తెలిపింది.
కొన్ని సందర్భాల్లో ఆర్‌బీఐ ఆదేశాలు సమస్యలను పరిష్కరించడం కన్నా కొత్త సమస్యలు తెచ్చిపెట్టేవిగా ఉన్నాయని పేర్కొంది. శాఖల ముందు నో క్యాష్ బోర్డులతో బ్యాంకుల విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింటోందని వ్యాఖ్యానించింది. బ్యాంకు శాఖలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, గొడవలు కూడా జరగవచ్చని ఏఐబీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. సిబ్బందికి తగినంత భద్రత కల్పించే విధంగా పోలీసుల సహకారాన్ని కోరేలా బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తగు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ తగినంత స్థారుులో నగదును సరఫరా చేయాలని ఆల్ ఇండియా బ్యంక్ ఆఫీసర్స్ కాన్‌ఫెడరేషన్ (ఏఐబీవోసీ) కోరింది.