గత కొంత కాలంగా వారంలో ‘ఐదురోజులే పనిదినాల’పై ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్లు, ప్రతిపాదనలు చివరి దశకు వచ్చాయి. ఐదు రోజుల పనిదినాలపై మరో ఐదు రోజుల‍్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల భవితవ్యం తేలనుంది. జులై 28న కేంద్రం సైతం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఈ సంస్కృతి ప్రైవేట్ రంగ సంస్థల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ వర్క్ కల్చర్ ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాల్ని కొనసాగిస్తుండగా.. తమకు వారాంతంలో రెండు రోజుల సెలవుల సంస్కృతిని కొనసాగించాలని ప్రభుత్వ బ్యాంక్ రంగ సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం ( ఏప్రిల్28న).. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ)లు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ఐదు రోజుల పని, వేతన పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చర్చించనున్నాయి. వీటన్నింటికంటే వారానికి ఐదురోజుల పనిదినాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నాయి.
ప్రస్తుతం, బ్యాంకుల్లో మొదటి, మూడవ శనివారం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యూఎఫ్‌బీయూ బ్యాంక్ ఉద్యోగులు వారినికి రెండురోజుల సెలవులిస్తూ వారానికి ఐదు రోజులు పనిచేసే వెసలు కల్పించాలని కోరుతుంది. వారానికి ఐదు రోజుల పని కల్పించాలన్న యూఎఫ్‌బీయూ డిమాండ్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ప్రకారం, వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున, దీనికి బదులుగా 5 రోజుల పాటు, సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది.
దీంతో పాటు పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్ విధానంలో అనుమతించాలని కోరుతోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే..బ్యాంక్ ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ఎలాన్ మస్క్‌కు మెలిక పెట్టిన కేంద్రం!
Comments
Please login to add a commentAdd a comment