ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 10న పార్లమెంట్ ముందు భైఠాయించాలని బ్యాంక్ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్ సేవలను కచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment