ముగిసిన రూరల్‌ జోన్‌ క్రీడోత్సవాలు | rural zone games over | Sakshi
Sakshi News home page

ముగిసిన రూరల్‌ జోన్‌ క్రీడోత్సవాలు

Published Fri, Sep 9 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

ముగిసిన రూరల్‌ జోన్‌ క్రీడోత్సవాలు

ముగిసిన రూరల్‌ జోన్‌ క్రీడోత్సవాలు

  • అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ చాంపియన్‌ తిమ్మాపూర్‌
  • విజేతలకు బహుమతులు అందజేసిన మేయర్‌ రవీందర్‌ సింగ్‌
  • కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మూడు రోజులుగా స్థానిక అంబేద్కర్‌ స్టేడియంలో జరుగుతున్న కరీంనగర్‌ రూరల్‌ జోన్‌ క్రీడోత్సవాలు శుక్రవారం ముగిశాయి. పోటీలకు ఏడు మండలాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్‌–14, 17 బాలబాలికలకు రన్నింగ్, జంప్స్, త్రోస్‌ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో రాణించిన తిమ్మాపూర్‌ మండల జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుంది. రూరల్‌ జోన్‌స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపికచేశారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానం కార్యక్రమానికి కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా యోగా సంఘం కార్యదర్శి సిద్దారెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి పుర్మ తిరుపతిరెడ్డి, కరీంనగర్‌ రూరల్‌ జోన్‌ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, మండలకార్యదర్శులు బిట్ర శ్రీనివాస్, సమ్మయ్య, బుచ్చిరెడ్డి, రవి, పీఈటీ, పీడీలు యూనుస్‌పాష, సత్యానంద్, ఎజాజ్, రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement