
లాంగ్ జంప్ దూకుతున్న అభ్యర్థి
- అర్హత సాధించిన 10,936 మంది అభ్యర్థులు
ఖమ్మం క్రైం:
నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 21రోజులుగా జరిగిన కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షల్లో 10,936 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో పురుషులు 8,513మంది, మహిళలు 2,423 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఖాసిం మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక పక్రియలో పోలీస్ సిబ్బంది, వ్యాయమ ఉపాధ్యాయులు, వైద్యులు, మినీస్టిరియల్ స్టాఫ్ నిబద్ధతో పనిచేసారన్నారు. ప్రధానంగా అభ్యర్థుల బయెమెట్రిక్, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల పరిశీలనలో తప్పులు జరుగకుండా అదనపు ఎస్పీ సాయికృష్ణ అధ్వర్యంలో పోలీస్ అధికారులు, ఐటీకోర్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు, తూనికల కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, రాంరెడ్డి, సురేందర్‌రావు, వీరేశ్వరావు, సురేష్‌కుమార్, మాణిక్‌రాజ్, సంజీవ్, ఏఓ సత్యకుమార్, జానకిరామ్, జయరాజ్, సమ్మయ్య, సత్యవతి, చంద్రకళ, అక్తరున్సీబేగం, ఓంకార్, ఫిజికల్ డైరక్టర్లు, పీఈటీలు, వైద్యులు పాల్గొన్నారు.