ఖేల్‌ఖతం.. | Game over | Sakshi
Sakshi News home page

ఖేల్‌ఖతం..

Published Tue, Aug 9 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ఘటనస్థలం వద్ద పడి ఉన్న నయీమ్‌ మతదేహం

ఘటనస్థలం వద్ద పడి ఉన్న నయీమ్‌ మతదేహం

షాద్‌నగర్‌ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఎవరెవరు ఉంటారో పక్కింటివారికి కూడా తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని సేఫ్‌ షెల్టర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
–ఎన్‌కౌంటర్‌లో మాజీ మావోయిస్టు 
–నయీం హతం
l–4గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌ 
l–నేర సామ్రాజ్య విస్తరణకు షాద్‌నగర్‌లో మకాం
l–రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించిన ఎన్‌కౌంటర్‌
l–జిల్లాకు చెందిన పలువురు ప్రజాసంఘాల
  –నేతల హత్యకేసుల్లో నయీంకు ప్రధానపాత్ర
 
 
‘షాక్‌’నగర్‌
సోమవారం ఉదయం నుంచీ షాద్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు, మీడియా హడావుడితో ఏం జరుగుతుందోనని పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాంగ్‌స్టర్‌ తమ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడని, ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నాడని, అతడు ఎన్‌కౌంటర్‌ అయ్యేంత వరకు స్థానికులకు తెలియకపోవడం గమనార్హం. నయీం ఎన్‌కౌంటర్‌ తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్న 11మంది కీలక నిందితులను ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు తెలిసింది. 
 
 
      నేర సామ్రాజ్యాధి నేత, మాజీ మావోయిస్టు, మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ నయీం రక్తచరిత్ర ఇక ముగిసింది.. నిత్యం తన వెంట ఎంతో మంది బలగం ఉన్నా ఒంటరిగానే కథ ముగించాల్సి వచ్చింది. ఒక్కడే ఉండి ఒంటరి పోరాటం చేసినా మత్యువును జయించలేపోయాడు. రాజధాని హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో ప్రశాంతంగా ఉండే షాద్‌నగర్‌ను తన నేర సామ్రాజ్య విస్తరణకు అడ్డాగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున మట్టుబెట్టడంతో నయీం కథ ముగిసినట్లయింది. పోలీసుల బూట్ల చప్పుళ్లు, కాల్పుల మోతతో షాద్‌నగర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ప్రశాంతంగా ఉండే నగరం వార్తల్లోకెక్కింది.
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ప్రశాంతతకు మారుపేరుగా ఉండి పారిశ్రామికంగా ప్రగతిపథంలో దూసుకెళ్తున్న షాద్‌నగర్‌ సోమవారం  ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. మాజీ మావోయిస్టు నేత, మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ నయీం ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఇదిలాఉండగా, జిల్లాలో ఇటీవల కాలంలో పెద్దగా మావోయిస్టు కార్యకలాపాలు ఏమీలేవు. మాఫియా ఆగడాలకు అవకాశమే లేదని జిల్లా ప్రజలు భరోసాతో ఉన్న సమయంలో నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి షాద్‌నగర్‌ను అడ్డాగా మార్చుకున్నాడని తెలుస్తోంది. నెలల తరబడి నయీం అనుచరులు షాద్‌నగర్‌ కేంద్రంగా ఉండి సెటిల్‌మెంట్లు, రియల్‌ఎస్టేట్‌ దందాలు, భూకబ్జాలకు పాల్పడినట్లు తెలిసింది. తమకు సహకరించని వ్యాపారులు, రియల్టర్లకు బెదిరిస్తున్న విషయం నయీం ఎన్‌కౌంటర్‌లో మరణించే దాకా బయటికి పొక్కకపోవడం విశేషం. తొలుత పీపుల్స్‌పార్టీలో చేరి తరువాత పార్టీని వీడి మావోయిస్టు నేతలను లక్ష్యంగా చేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న నయీం సుమారు 100కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని, 40హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నారు. 
 
 
షాద్‌నగర్‌లో సెఫ్టీగా 
అయిజ మండలానికి చెందిన పౌరహక్కుల నేత పురుషోత్తం, కనకాచారిని దారుణంగా హతమార్చడంతో పాటు పలువురి హత్యకేసుల్లో నయీం కీలక నిందితుడిగా ఉన్నాడు. షాద్‌నగర్‌ను నేరసామ్రాజ్యం అడ్డాగా మార్చుకోవడంపై పోలీసు అధికారులు పలు కోణాల్లో విశ్లేస్తున్నారు. హైదరాబాద్‌లోని తన నేరసామ్రాజ్యంపై నిఘా ఉండడంతో షాద్‌నగర్‌ సురక్షితంగా ఉంటుందన్న భావంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే నయీం ఇక్కడ ఉన్నా షాద్‌నగర్‌లో ప్రాంతంలో ఉంటు న్న వ్యాపారులు, రియల్టర్ల జోలికి పెద్దగా వెళ్లకపోవడం విశేషం. స్థానికులను టార్గెట్‌ చేస్తే తన ఆశ్రయానికి ఇబ్బంది కలుగుతుందనే ఈ ప్రాంతంలో భూదందాలపై కల్పించుకోలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇతర ప్రాంతాల వాసులకు మాత్రం ఇక్కడినుంచే ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరించగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. అయితే సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా నయీం రహస్య స్థావరాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన ఉస్నూర్‌ బాషా ఆశ్రయం ఇచ్చి నయీం దందాకు సహకరించేవాడని పోలీసులు చెబుతున్నారు. 
 
 
    ఉగ్రసంస్థలతో లింల్‌
ఉగ్రవాద సంస్థలకు పేలుడు సామాగ్రిని అందజేయడం ద్వారా తమ సంబంధాలను పటిష్టం చేసుకున్నారని భావిస్తున్న ఆ కోణంలో నేరచరిత్రను పరిశీలిస్తున్నారు. నల్లగొండ జిల్లావాసి అయిన నయీం మహబూబ్‌నగర్‌ జిల్లాతో తన నేర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతున్న జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ వంటి సంస్థలకు సహకరించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ వైపు కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్న నయీం ఇతర దేశాలకు పారిపోకుండా జాతీయస్థాయిలో పోలీసులను అప్రమత్తం చేశారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement