ఒకే ఓవర్లో ఆరు వికెట్లు! | Aussie bowler takes six wickets in one over | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్లో ఆరు వికెట్లు!

Published Fri, Jan 27 2017 4:07 PM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

ఒకే ఓవర్లో ఆరు వికెట్లు! - Sakshi

ఒకే ఓవర్లో ఆరు వికెట్లు!

విక్టోరియా:ఒక ఓవర్లో మూడు వికెట్లు తీయడమే గొప్ప. మరి ఒకే ఓవర్ లో ఆరు వికెట్లు తీస్తే అది కచ్చితంగా  అద్భుతమే. తాజాగా ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ ఒకే ఓవర్ లో ఆరు వికెట్లు తీసి అదుర్స్ అనిపించాడు. క్లబ్ క్రికెట్ లో భాగంగా గోల్డెన్ పాయింట్ క్లబ్-ఈస్ట్ బల్లారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే గోల్డెన్ పాయింట్ క్లబ్ ఆటగాడు అలెడ్ క్యారీ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. అతని వ్యక్తిగత ఎనిమిది ఓవర్ల వరకూ వికెట్ కూడా సాధించని అలెడ్.. తొమ్మిదో ఓవర్లో చెలరేగిపోయాడు. వరుసగా ఈస్ట్ బల్లారత్ ఆటగాళ్లను అవుట్ చేస్తూ ఆ ఓవర్లో ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈస్ట్ బల్లారత్ జట్టు 40 పరుగులకే చాపచుట్టేసింది.

దీనిపై అలెడ్ విపరీతమైన ఆనందం వ్యక్తం చేశాడు. తాను మళ్లీ తిరిగి ఈ ఫీట్ను సాధిస్తానని అనుకోవడం లేదన్నాడు. తాను చాలాసార్లు హ్యాట్రిక్ వికెట్లను తీయడానికి దగ్గరగా వచ్చినా, ఆ ఘనతను ఇంతకుముందెప్పుడూ చేరుకోలేదన్నాడు. అయితే ఈ రోజు తనకు అదృష్టం కలిసొచ్చి ఒకేసారి డబుల్ హ్యాట్రిక్  సాధించడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement