విశాఖపట్టణం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
పెందుర్తి: విశాఖపట్టణం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని పెందూర్తి మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని చింతగుట్ల వద్ద గాజవాక డిపోకు చెందిన బస్సు అదపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సమారు 90 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.