కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులదిన్నె వద్ద మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తూ ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
కర్నూలు: కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులదిన్నె వద్ద మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తూ ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నారు.