ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్యాస్ సిలీండర్ల లోడ్‌తో వెళుతున్న వాహనం బోల్తా కొట్టింది.
కర్నూలు : ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్యాస్ సిలీండర్ల లోడ్‌తో వెళుతున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలో కర్నూలు- తిరుపతి రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి భారత్ గ్యాస్ సిలండర్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ ఆళ్లగడ్డ సమీపానికి రాగానే బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
(ఆళ్లగడ్డ)