
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారిపై ఒక కంటెయినర్ ట్రక్కు బోల్తా పడింది. పక్కనే వెళుతున్న ఒక కారుతో పాటు టూ వీలర్ ట్రక్కు కింద పడి నలిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారు.
వీకెండ్‌సెలవులు కావడంతో ఓ వ్యాపారవేత్త తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరాడు. కారు వెళుతున్న వైపే వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ముందు వెళుతున్న పాలట్యాంకర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై బోల్తాపడడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 48పై మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం కారణంగా బెంగళూరు-తుమకూరు హైవేపై ట్రాఫిక్ అంతరాయంపై ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.
— SP Bengaluru District Police (@bngdistpol) December 21, 2024