Bengaluru: కేంద్రమంత్రి ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి | BJP Worker Dies After Crashing Union Minister's Car In Bengaluru | Sakshi
Sakshi News home page

Bengaluru:కేంద్రమంత్రి శోభా కరంద్లాజె ప్రచారంలో అపశృతి.. బీజేపీ కార్యకర్త మృతి

Published Mon, Apr 8 2024 7:52 PM | Last Updated on Mon, Apr 8 2024 9:24 PM

BJP Worker Dies After Crashing Union Minister's Car In Bengaluru - Sakshi

బెంగళూరు: కేంద్రమంత్రి శోభా కరంద్లాజె కారును ఢీకొట్టి బెంగళూరులో ప్రకాష్‌ అనే బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరు కేఆర్‌పురంలో సోమవారం(ఏప్రిల్‌ 8)జరిగింది. కేంద్ర మంత్రి కారు డోర్‌ను స్కూటర్‌పై వచ్చిన ప్రకాష్‌ ఢీకొట్టాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఈ సమయంలో అతడిపై నుంచి బస్సు వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున బెంగళూరు నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి శోభ ప్రచారం కోసం  కేఆర్‌ పురం వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది.

ప్రమాదం జరిగినపుడు కేంద్ర మంత్రి శోభ కారులో లేరు. కారుకు మరో పక్క నుంచి  స్కూటర్‌పై వస్తున్న ప్రకాష్‌ను గమనించకుండా డ్రైవర్‌ డోర్‌ తెరవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ ఇద్దరిపై పోలీసులు 304ఏ సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రమాదంలో బీజేపీ కార్యకర్త చనిపోవడం తమలో ఎంతో విషాదం నింపిందని, ప్రకాష్‌ కుటుంబానికి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి శోభ తెలిపారు. 

ఇదీ చదవండి.. కాంగ్రెస్‌ లైసెన్స్‌ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement