shoba
-
Bengaluru: కేంద్రమంత్రి ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
బెంగళూరు: కేంద్రమంత్రి శోభా కరంద్లాజె కారును ఢీకొట్టి బెంగళూరులో ప్రకాష్ అనే బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరు కేఆర్‌పురంలో సోమవారం(ఏప్రిల్ 8)జరిగింది. కేంద్ర మంత్రి కారు డోర్‌ను స్కూటర్‌పై వచ్చిన ప్రకాష్ ఢీకొట్టాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఈ సమయంలో అతడిపై నుంచి బస్సు వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి శోభ ప్రచారం కోసం కేఆర్ పురం వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు కేంద్ర మంత్రి శోభ కారులో లేరు. కారుకు మరో పక్క నుంచి స్కూటర్‌పై వస్తున్న ప్రకాష్‌ను గమనించకుండా డ్రైవర్ డోర్ తెరవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్ ఇద్దరిపై పోలీసులు 304ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో బీజేపీ కార్యకర్త చనిపోవడం తమలో ఎంతో విషాదం నింపిందని, ప్రకాష్ కుటుంబానికి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి శోభ తెలిపారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్.. నేడు షో టైమింగ్స్‌లో మార్పు
బిగ్ బాస్ సండే ఎపిసోడ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు భారీ ఎమోషనల్ డ్రామాను క్రియేట్ చేశారు. తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లకు దసరా కానుకగా వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయి. వాటిన చదివిన శోభ,యావర్,తేజ ఎక్కువ మోతాదులోనే ఎమోషనల్ అయ్యారు. శోభ కోసం వారి తల్లదండ్రులు ఉత్తరం రాసినట్లు అర్థం అవుతుంది. అమర్‌దీప్‌కు కూడా ఆయన భార్య ఒక ఉత్తరాన్ని పంపినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తోంది. (ఇదీ చదవండి: బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ) బిగ్‌బాస్ హౌస్‌లో దసరా పండుగ వేడుకలు జరిగాయి. ఈ మేరకు హౌస్‌లోని కంటెస్టెంట్లతో బతకమ్మ ఆడించారు నాగ్.. ఆపై వారితో కొన్ని సినిమా పాటలకు డ్యాన్స్‌లు కూడా చేపించారు. దసరా సందర్భంగా నేడు సాయింత్రం 7గంటలకే షో టెలికాస్ట్ అవుతుందని స్టార్ మా ప్రకటించింది. దీంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేశారు. పలు రియాల్టీ షోలలో పాల్గొన్న యంగ్ సింగర్స్ స్టేజీపైన పాటలు పాడారు. ఆపై డింపుల్ హయాతి తన డ్యాన్స్‌తో దుమ్ములేపింది. శోభ కంటతడి ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ చదివిన శోభ మొదటిసారి ఎమోషనల్ అయింది. ఆ లేఖను ఆమె నాన్నగారు రాసినట్లు తెలుస్తోంది. అందులో ఆయన తెలిపిన వ్యాఖ్యలతో ఆమె కన్నీరు పెట్టింది. ఆటలో బాగా కొనసాగుతున్నావని లేఖలో ఆమె తండ్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శోభ వల్ల తమ కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చిందని ఆయన తెలపాడు. మరోవైపు యావర్ ఒక టాస్క్‌లో లేఖను కోల్పాయాడు. ఇప్పుడు మళ్లీ తన ఫ్యామిలీ నుంచి లేఖ రావడం.. అది చదివిన యావర్ కంటతడి పెట్టాడు. ప్రోమో చివర్లో గత వారం రీ ఎంట్రీ కోసం వారు వేసిన ఓట్ల బ్యాలెట్ బాక్స్‌ను నాగ్ తెచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిందని ఆయన తెలిపారు. రీ ఎంట్రీ అవకాశం దక్కించుకున్న కంటెస్టెంట్ నేడు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. రీ ఎంట్రీ అవకాశం దాదాపు 'రతికా రోజ్'కు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో 'పూజా' ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తోంది. కానీ నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇస్తే చెప్పలేం. -
బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ
బిగ్‌బాస్ సీజన్ 7లో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈసారి ఆటలోని కంటెస్టెంట్లు అదుపు తప్పి బూతులు మాట్లాడటం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్స్, టాస్కులు, నామినేషన్లలో హీట్ సంభాషణలు పెరిగి నాలుకలు అదుపు తప్పుతుంటయ్… అది సహజమే గతంలో కూడా ఉండేవి కానీ వాటిని టెలికాస్ట్ చేసే వాళ్లు కాదు. ప్రస్తుతం ప్రోగ్రామ్‌పై బజ్ క్రియేట్ చేసేందకు ఇవన్నీ తప్పడం లేదని తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఇలా ఉంటే బయట వారి ఫ్యాన్స్ చేసే భూతుల రచ్చ తారా స్థాయికి చేరింది. తను అభిమానించే వ్యక్తి గెలుపు కోసం మరో ఇంటి ఆడబిడ్డపై బూతులతో దాడిచేస్తారా..?ముఖ్యంగా హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లు శోభ, ప్రియాంకలతో పాటు ఎలిమినేట్ అయిన రతికా రోజ్‌ను మాటలతో చెప్పలేని భూతు పదాలతో దాడిచేస్తున్నారు. ఆటలో వారికి నచ్చిన స్ట్రాటజీ ఉపయోగించి ముందుకు వెళ్తున్నారు. నచ్చకుంటే ఓటు వేయకండి అని ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అసభ్య పదాలతో వినకూడని మాటలతో వారిద్దరిపై ఎదురు దాడి జరుగుతుంది. రేప్ కూడా చేస్తారు అంటూ కామెంట్లు బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లలో ఒకరిపై (పేరు తెలపడం లేదు) రేప్ కూడా చేస్తారు.. ఏం చేస్తారో చెప్పండి అంటూ ఒక మహిళ తనకు నచ్చిన కంటెస్టెంట్‌ను వెనుకేసుకొస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్ చేసి వీడియో షేర్ చేసింది. ఇంతటి ఉన్మాదం ఎందుకు...? ఎవరి కోసం..? భోలే చెప్పినట్లు ఎర్రగడ్డలో చేర్పించాల్సింది శోభను కాదు... ఇలాంటి సిగ్గుమాలిన కామెంట్లు చేసే వారందరిని అక్కడ వైద్యం కోసం చేర్పించాలి. అలాగే అమర్దీప్, సందీప్ కుటుంబ సభ్యులపై కూడా ఇలాంటి దాడే జరుగుతుంది. ఒకరి గెలుపు కోసం ఇంతటి నీచానికి పాల్పడటం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చెత్త పనులు మొదట ప్రారంభించేది హౌస్‌లోని కంటెస్టెంట్ల పీఆర్ టీమ్ వారే... వారికి నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంటారు. బూతులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. వాటికి కనెక్ట్ అయిన కొందరు కామన్ ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!) నామినేషన్ల సమయంలో సింగర్ భోలే బూతుల ధారను తాజాగా నాగార్జున కూడా తప్పుబట్టారు. ప్రశాంత్ మీకు బరాబర్ చేసిండు.. అంటూ ఒక బీప్ మాట ఏదో వేసుకున్నాడు భోలే. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి సక్సెస్‌ఫుల్‌గా వాటిని తిప్పికొట్టారు కూడా. ఇలాంటి భాషను, ఈ బూతుల్ని సహించేది లేదంటూ తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. చివరకు తన తప్పును తెలుసుకుని సారీ చెప్పి తలవంచాల్సి వచ్చింది. దీంతో సహజంగానే ట్రోలర్లు రెండువైపులా చేరిపోయారు. మాయాస్త్రం టాస్కులో కూడా అమర్ వర్సెస్ ప్రశాంత్… అమర్ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, వాడు రీజన్ లేకుండా నన్ను తీసేశాడు.. వాడి వల్ల నా గేమ్ నాశనం అయిందటూ వినరాని పరుష వ్యాఖ్య చేశాడు. ఈ పదం వాడినప్పుడు కూడా ప్రియాంకే సాక్షి… అప్పుడు కూడా అమర్‌ను 'నోరు జాగ్రత్త' అని హెచ్చరించింది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) శోభాశెట్టిని, ప్రియాంకలను తిట్టడంతో పాటు. అమర్ దీప్ అమ్మగారిని, అతని భార్యను కూడా భూతులు తిట్టడం అధికం అయింది. సోషల్ మీడియాలో భూతుల దాడి తట్టుకోలేక అమర్ తల్లి కన్నీరు పెట్టింది. ముఖ్యంగా ప్రశాంత్ పీఆర్ టీమ్ ఇతర కంటెస్టెంట్లపై బూతు పదాలతో ఎక్కువగా దాడి చేస్తున్నారనేది మెజారిటీగా వినిపిస్తోంది. మరోవైపు సందీప్ భార్య జ్యోతి పరిస్థితి అదే. బిగ్‌బాస్‌లో ఉండాలంటే ఆయా కంటెస్టెంట్ల సోషల్ మీడియా బ్యాచులు సైట్లనూ మేనేజ్ చేయాలాల్సిందేనా అనే అపవాదు కనిపిస్తుంది. గతంలో ఏ సీజన్లో కూడా పీఆర్ టీమ్ ప్రభావం అంతగా లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం దాదాపు చాలా మందికి పీఆర్ టీమ్ ఉంది. ఎప్పుడూ లేని విధంగా వారు బూతులు క్రియేట్ చేయడం చాలా బాధకారం. ఇవన్నీ చూస్తున్న కామన్ ప్రేక్షకులు కూడా షో నుంచి దూరం అవుతున్నారు. గత సీజన్‌ను తిరస్కరించినట్టుగానే ఈ సీజన్‌కు కూడా చాలామంది దూరమైపోయారు. -
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్‌సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్‌ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్‌లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్‌గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్‌గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్‌సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్‌లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్‌కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్‌ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్‌మేట్స్‌తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్‌గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్‌గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్‌లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి -
మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా
-
స్టీరింగ్ ఆటో, టిప్పర్ ఢీ
పుల్కల్ : ఎదురెదురుగా వస్తున్న స్టీరింగ్ ఆటో, టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఎదుట సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన దండుగల నరసింహులు (42), అదే గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శోభ (28), కమ్మరికత్త గ్రామానికి చెందిన స్వరూప (30)లు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వీరి కుటుంబాలు పనుల నిమిత్తం పటాన్చెరు ప్రాంతానికి వలస వచ్చారు. అయితే సోమవారం స్వ గ్రామానికి బయలుదేరారు. అందులో భాగంగానే పటాన్చెరు నుంచి జోగిపేట కు వెళుతున్న స్టీరింగ్ ఆటోను ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీ యూ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు, శోభ, స్వరూపలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నరసింహులుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బైక్‌పై వెళ్లింటే... స్వరూప, సుధాకర్ దంపతులు కూడా కూలీ పనుల నిమిత్తం పటాన్చెరు లింగంపల్లికి వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే కుమారులు స్వగ్రామంలో చదువుతుండగా.. వీరిని కమ్మరికత్తలో వదలాల ని దంపతులు నిర్ణయించారు. అందులో భాగంగానే సోమవారం సుధాకర్, ఇద్దరు కుమారులు బైక్‌లో బయలుదేరగా.. స్వరూప కుమార్తె నిఖితలు ఆటోలో బయలుదేరారు. అయితే స్వరూపను వృుత్యువు ఆటో రూపంలో కబలించగా.. నిఖిత స్వల్పగాయాలతో బయటపడింది. కాగా ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు పూర్తిస్థాయి సమాచారం కోసం సుధాకర్ మోబైల్‌కు ఫోన్ చేశారు. అతను సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బైక్‌లో అందరం వచ్చి ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే వారం కాదా అంటూ సుధాకర్ విలపించడం అక్కడివారిని కలిచివేసింది. గాయాలైన వారిని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. రెండు వాహనాల డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.