బిగ్ బాస్ సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు భారీ ఎమోషనల్ డ్రామాను క్రియేట్ చేశారు. తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లకు దసరా కానుకగా వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయి. వాటిన చదివిన శోభ,యావర్,తేజ ఎక్కువ మోతాదులోనే ఎమోషనల్ అయ్యారు. శోభ కోసం వారి తల్లదండ్రులు ఉత్తరం రాసినట్లు అర్థం అవుతుంది. అమర్‌దీప్‌కు కూడా ఆయన భార్య ఒక ఉత్తరాన్ని పంపినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తోంది.
(ఇదీ చదవండి: బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ)
బిగ్‌బాస్ హౌస్‌లో దసరా పండుగ వేడుకలు జరిగాయి. ఈ మేరకు హౌస్‌లోని కంటెస్టెంట్లతో బతకమ్మ ఆడించారు నాగ్.. ఆపై వారితో కొన్ని సినిమా పాటలకు డ్యాన్స్‌లు కూడా చేపించారు. దసరా సందర్భంగా నేడు సాయింత్రం 7గంటలకే షో టెలికాస్ట్ అవుతుందని స్టార్ మా ప్రకటించింది. దీంతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేశారు. పలు రియాల్టీ షోలలో పాల్గొన్న యంగ్ సింగర్స్ స్టేజీపైన పాటలు పాడారు. ఆపై డింపుల్ హయాతి తన డ్యాన్స్‌తో దుమ్ములేపింది.
శోభ కంటతడి
ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ చదివిన శోభ మొదటిసారి ఎమోషనల్ అయింది. ఆ లేఖను ఆమె నాన్నగారు రాసినట్లు తెలుస్తోంది. అందులో ఆయన తెలిపిన వ్యాఖ్యలతో ఆమె కన్నీరు పెట్టింది. ఆటలో బాగా కొనసాగుతున్నావని లేఖలో ఆమె తండ్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శోభ వల్ల తమ కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చిందని ఆయన తెలపాడు. మరోవైపు యావర్ ఒక టాస్క్‌లో లేఖను కోల్పాయాడు. ఇప్పుడు మళ్లీ తన ఫ్యామిలీ నుంచి లేఖ రావడం.. అది చదివిన యావర్ కంటతడి పెట్టాడు.
ప్రోమో చివర్లో గత వారం రీ ఎంట్రీ కోసం వారు వేసిన ఓట్ల బ్యాలెట్ బాక్స్‌ను నాగ్ తెచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిందని ఆయన తెలిపారు. రీ ఎంట్రీ అవకాశం దక్కించుకున్న కంటెస్టెంట్ నేడు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. రీ ఎంట్రీ అవకాశం దాదాపు 'రతికా రోజ్'కు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో 'పూజా' ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తోంది. కానీ నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇస్తే చెప్పలేం.
Comments
Please login to add a commentAdd a comment