Nagarjuna Reveals Secret About Bigg Boss 7 Telugu In BB Shining Stars Promo - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: టీజర్ రహస్యం చెప్పేసిన హోస్ట్ నాగ్!

Jul 23 2023 9:07 PM | Updated on Sep 2 2023 2:33 PM

Bigg Boss 7 Telugu Nagarjuna Interesting Comments - Sakshi

తెలుగులో సక్సెస్ అయిన రియాలిటీ షో అంటే చాలామంది చెప్పే పేరు 'బిగ్‌బాస్'. ప్రతి ఏడాది ఈ షోపై ఏదో ఓ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. చాలామంది బహిరంగంగానే విమర్శిస్తుంటారు. అయినాసరే ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో 7వ సీజన్ ప్రారంభానికి రెడీ అయిపోతోంది. ఈ మధ్య టీజర్ రిలీజ్ చేయగా, బాగానే రెస్పాన్స్ వచ్చింది.

కొత్త సీజన్‌కి హోస్ట్‪‌గా నాగార్జున తప్పుకొన్నారని కొన్నాళ్ల ముందు రూమర్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ ఓ ఐదారు రోజుల క్రితం టీజర్  లో నాగ్ ప్రత్యక్షమయ్యారు. స్పైసీ లుక్‌తో సందడి చేశారు. అయితే షో గురించి ఏం చెప్పకుండా కేవలం.. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాట పాడి ముగించారు. ఇప్పుడు దాని వెనకున్న సీక్రెట్‌ని ఆయనే బయటపెట్టేశారు.

(ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్)

ఈసారి బిగ్ బాస్ ఏడో సీజన్ ఆగస్టులో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాని కోసం ఏర్పాట‍్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. షో స్టార్టింగ్ కి ఇంకా బోలెడంత సమయముంది. అంతలో 'బిగ్‌బాస్ షైనింగ్ స్టార్స్' పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. గత ఆరు సీజన్లలో పాల్గొన్న కొందరు పార్టిసిపెంట్స్‌ని తీసుకొచ్చి ఎంటర్‌టైన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో సందడి చేశారు.

'కుడి ఎడమైతే..' అని టీజర్‌లో చెప్పారు కదా దానికి అర్థమేంటి అని సుమ.. నాగార్జునని అడిగింది. దీనికి బదులిచ్చిన నాగ్.. 'న్యూ గేమ్ న్యూ ఛాలెంజెస్ న్యూ రూల్స్' అని చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే ఈసారి షో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈసారి ఏం జరగబోతుందో? కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారో?

(ఇదీ చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement