Bigg Boss Telugu Season 7 Promo Released, Makers Reveals Interesting Things - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్‌ ఏం చెప్పారంటే

Published Tue, Jul 11 2023 7:12 AM | Last Updated on Wed, Sep 6 2023 10:19 AM

Bigg Boss Telugu 7 Promo Released - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్‌లు పూర్తికాగా, త్వరలోనే బిగ్‌బాస్‌-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు.  బిగ్‌ బాస్‌ ఆరో సీజన్‌ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈసారి సీజన్‌ ఉంటుందా..? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ అభిమానులకు  బిగ్‌బాస్‌ టీమ్‌​ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి అప్డేట్ లేకుండా ప్రోమోను రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు)

BB7 తెలుగుతో మళ్లీ వచ్చేస్తున్నామని ఈసారి వినోదం పూర్తి ప్యాకేజీ ఉంటుందని టీమ్‌ తెలిపింది. ఈ సీజన్‌లో అభిమానులకు ఎమోషన్స్‌తో పాటు సర్ప్రైజ్‌లు ఉంటాయని మేకర్స్‌ చెప్పారు. ఈ సీజన్‌లో  ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌ ఉండనున్నట్లు వారు చెప్పారు. ఓరకంగా అభిమానుల్ని రోలర్‌కోస్టర్ రైడ్‌లోకి తీసుకెళ్తుందని మేకర్స్‌ తెలుపుతూ ప్రోమోను విడుదల చేశారు. కాబట్టి ఈసారి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా చేయనున్నారని తెలుస్తొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement