బుల్లితెర మెగా షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ ఇప్పటికే 6 సీజన్లు పూర్తి అయ్యాయి. తాజగా 7వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఆగష్టు నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు ఉంటాయని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఓటీటీ వేదికైన డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. సీజన్ 1లో ఎన్టీఆర్, సీజన్ 2లో నాని హోస్ట్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వచ్చిన అన్ని సీజన్ల వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా 7వ సీజన్లో నాగ్‌నే హోస్ట్‌గా రానున్నారని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..)
ఇకపోతే ఈ షోలోకి తాజాగా ఒక వార్త ట్రెండింగ్‌లో ఉంది. బిగ్‌బాస్-7లోకి ఇండియన్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వై.వేణుగోపాల రావును ఈ మెగా షోలోకి తీసుకురావాలని స్టార్ మా గట్టిగానే ప్రయత్నం చేస్తుందట. ఇదే జరిగితే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్‌గా వై.వేణుగోపాల రావు రికార్డు క్రియేట్ చేయనున్నాడు. దీనిక ప్రధాన కారణం బిగ్‌బాస్ 6వ సీజన్‌లో సరైన కంటెంస్టెంట్‌లను ఎంపిక చేయకపోవడంతో అంతగా ఆ సీజన్ మెప్పించలేదనే చెప్పవచ్చు. అందుకే ఈసారి ఆ తప్పులు జరగకుండా చాలా వరకు గుర్తింపు ఉన్న వారినే బిగ్‌బాస్ కోసం తీసుకురావలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట
విశాఖకు చెందిన వేణుగోపాల రావు క్రికెట్ కెరియర్ ఇదే
భారత మాజీ క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు వై.వేణుగోపాల రావు 2019లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ఆ సమయంలోనే ప్రకటించాడు. 2005 జులైలో తొలి వన్డే ఆడిన అతని కెరీర్ పది నెలల వ్యవధిలోనే 16 వన్డేలకే (ఆరు వేర్వేరు జట్లపై కలిపి) పరిమితమైంది. వేణుగోపాలరావు అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఏకైక అర్ధ సెంచరీ (93 బంతుల్లో 61 నాటౌట్) పాకిస్తాన్‌పై అబుదాబిలో సాధించాడు. దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున కలిపి వేణు ఐపీఎల్‌లో మొత్తం 65 మ్యాచ్‌లు (2008–2014) ఆడాడు. ప్రధానంగా విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీలో రాణించడంతో అతనికి వన్డే టీమ్ పిలుపు దక్కింది.
(ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?)
Comments
Please login to add a commentAdd a comment