బిగ్‌బాస్ సీజన్ 7లో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈసారి ఆటలోని కంటెస్టెంట్లు అదుపు తప్పి బూతులు మాట్లాడటం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్స్, టాస్కులు, నామినేషన్లలో హీట్ సంభాషణలు పెరిగి నాలుకలు అదుపు తప్పుతుంటయ్… అది సహజమే గతంలో కూడా ఉండేవి కానీ వాటిని టెలికాస్ట్ చేసే వాళ్లు కాదు. ప్రస్తుతం ప్రోగ్రామ్‌పై బజ్ క్రియేట్ చేసేందకు ఇవన్నీ తప్పడం లేదని తెలుస్తోంది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఇలా ఉంటే బయట వారి ఫ్యాన్స్ చేసే భూతుల రచ్చ తారా స్థాయికి చేరింది. తను అభిమానించే వ్యక్తి గెలుపు కోసం మరో ఇంటి ఆడబిడ్డపై బూతులతో దాడిచేస్తారా..?ముఖ్యంగా హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లు శోభ, ప్రియాంకలతో పాటు ఎలిమినేట్ అయిన రతికా రోజ్‌ను మాటలతో చెప్పలేని భూతు పదాలతో దాడిచేస్తున్నారు. ఆటలో వారికి నచ్చిన స్ట్రాటజీ ఉపయోగించి ముందుకు వెళ్తున్నారు. నచ్చకుంటే ఓటు వేయకండి అని ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అసభ్య పదాలతో వినకూడని మాటలతో వారిద్దరిపై ఎదురు దాడి జరుగుతుంది.
రేప్ కూడా చేస్తారు అంటూ కామెంట్లు
బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్‌లలో ఒకరిపై (పేరు తెలపడం లేదు) రేప్ కూడా చేస్తారు.. ఏం చేస్తారో చెప్పండి అంటూ ఒక మహిళ తనకు నచ్చిన కంటెస్టెంట్‌ను వెనుకేసుకొస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్ చేసి వీడియో షేర్ చేసింది. ఇంతటి ఉన్మాదం ఎందుకు...? ఎవరి కోసం..? భోలే చెప్పినట్లు ఎర్రగడ్డలో చేర్పించాల్సింది శోభను కాదు... ఇలాంటి సిగ్గుమాలిన కామెంట్లు చేసే వారందరిని అక్కడ వైద్యం కోసం చేర్పించాలి.
అలాగే అమర్‌దీప్, సందీప్ కుటుంబ సభ్యులపై కూడా ఇలాంటి దాడే జరుగుతుంది. ఒకరి గెలుపు కోసం ఇంతటి నీచానికి పాల్పడటం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చెత్త పనులు మొదట ప్రారంభించేది హౌస్‌లోని కంటెస్టెంట్ల పీఆర్ టీమ్ వారే... వారికి నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంటారు. బూతులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. వాటికి కనెక్ట్ అయిన కొందరు కామన్ ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!)
నామినేషన్ల సమయంలో సింగర్ భోలే బూతుల ధారను తాజాగా నాగార్జున కూడా తప్పుబట్టారు. ప్రశాంత్ మీకు బరాబర్ చేసిండు.. అంటూ ఒక బీప్ మాట ఏదో వేసుకున్నాడు భోలే. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి సక్సెస్‌ఫుల్‌గా వాటిని తిప్పికొట్టారు కూడా. ఇలాంటి భాషను, ఈ బూతుల్ని సహించేది లేదంటూ తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. చివరకు తన తప్పును తెలుసుకుని సారీ చెప్పి తలవంచాల్సి వచ్చింది. దీంతో సహజంగానే ట్రోలర్లు రెండువైపులా చేరిపోయారు.
మాయాస్త్రం టాస్కులో కూడా అమర్ వర్సెస్ ప్రశాంత్… అమర్ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, వాడు రీజన్ లేకుండా నన్ను తీసేశాడు.. వాడి వల్ల నా గేమ్ నాశనం అయిందటూ వినరాని పరుష వ్యాఖ్య చేశాడు. ఈ పదం వాడినప్పుడు కూడా ప్రియాంకే సాక్షి… అప్పుడు కూడా అమర్‌ను 'నోరు జాగ్రత్త' అని హెచ్చరించింది.
(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు)
శోభాశెట్టిని, ప్రియాంకలను తిట్టడంతో పాటు. అమర్ దీప్ అమ్మగారిని, అతని భార్యను కూడా భూతులు తిట్టడం అధికం అయింది. సోషల్ మీడియాలో భూతుల దాడి తట్టుకోలేక అమర్ తల్లి కన్నీరు పెట్టింది. ముఖ్యంగా ప్రశాంత్ పీఆర్ టీమ్ ఇతర కంటెస్టెంట్లపై బూతు పదాలతో ఎక్కువగా దాడి చేస్తున్నారనేది మెజారిటీగా వినిపిస్తోంది. మరోవైపు సందీప్ భార్య జ్యోతి పరిస్థితి అదే. బిగ్‌బాస్‌లో ఉండాలంటే ఆయా కంటెస్టెంట్ల సోషల్ మీడియా బ్యాచులు సైట్లనూ మేనేజ్ చేయాలాల్సిందేనా అనే అపవాదు కనిపిస్తుంది.
గతంలో ఏ సీజన్‌లో కూడా పీఆర్ టీమ్ ప్రభావం అంతగా లేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం దాదాపు చాలా మందికి పీఆర్ టీమ్ ఉంది. ఎప్పుడూ లేని విధంగా వారు బూతులు క్రియేట్ చేయడం చాలా బాధకారం. ఇవన్నీ చూస్తున్న కామన్ ప్రేక్షకులు కూడా షో నుంచి దూరం అవుతున్నారు. గత సీజన్‌ను తిరస్కరించినట్టుగానే ఈ సీజన్‌కు కూడా చాలామంది దూరమైపోయారు.
Comments
Please login to add a commentAdd a comment