బిగ్‌బాస్ 7వ సీజన్‌లో మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ఓ మాదిరి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. కాకపోతే శివాజీ మీద నాగ్ ప్రేమ ఎంత ఉందనేది మరోసారి బయటపడింది. ప్రియాంకని అయితే నాగ్ పదే పదే ఓ విషయం ఒప్పించేందుకు తెగ ప్రయత్నించాడు. అమర్‌కి ఓ సర్‌ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 90 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
బయటపడ్డ ప్రియాంక ఆవేదన
టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన అర్జున్.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీకెండ్ కాబట్టి స్టేజీపైకి వచ్చిన నాగార్జున.. శుక్రవారం ఏం జరిగిందో చూశాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. ఫినాలే రేసు మొదటి రౌండులోనే ఎలిమినేట్ అయిపోయిన శోభా-శివాజీ నిలబెట్టి.. ఒకరి గేమ్ గురించి మరొకరు చెప్పాలని అన్నాడు. ఈ డిస్కషన్‌లో వీళ్లిద్దరూ అమర్‌కి పాయింట్స్ ఇవ్వడంపై నాగ్ కౌంటర్స్ వేశాడు.
(ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?)
అమర్ అలుగుతాడని, బ్లాక్ మెయిల్ చేస్తాడని నవ్వుతూనే నిజాలు చెప్పేశాడు. ఆ వెంటనే.. ప్రియాంక చెప్పమ్మా అని ఆమెని నిలబెట్టాడు. దీన్ని నిజమేనని ఒప్పుకొన్న ప్రియాంక.. అది చాలా పెయిన్‌ఫుల్, ఆల్రెడీ ఓడిపోయినా బాధ ఓవైపు ఉంటే.. మళ్లీ మళ్లీ అమర్ పాయింట్స్ ఇవ్వమని చెబుతుంటే చాలా బాధగా అనిపించింది ప్రియాంక తన ఆవేదన బయటపెట్టింది.
ప్రియాంకని ఒప్పించే ప్రయత్నం
ప్రియాంకని నిలబెట్టి మాట్లాడిన నాగ్.. గతవారమే అనుకున్నాం కదా ఒంటరిగా గేమ్ ఆడమని.. కానీ నువ్వు ఏం చేశావ్? అని అమర్‌కి గౌతమ్ ద్వారా పాయింట్లు ఇచ్చిన విషయం గురించి మాట్లాడాడు. అయితే ఈ మొత్తం డిస్కషన్‌లో ప్రియాంకది గ్రూప్ గేమ్ అని ఒప్పించాలని నాగ్ చాలా ప్రయత్నించాడు. కానీ ఈ విషయంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత గౌతమ్‌తోనూ నాగ్.. ప్రియాంకది తప్పని చెప్పించాడు. ప్రియాంక.. నువ్వు ఎంత సమర్ధించుకున్నాసరే నీది గ్రూప్ గేమ్ అని మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. కానీ ఇలానే గతంలో శివాజీ బ్యాచ్‌గా ఆడినప్పుడు మాత్రం నాగ్ కనీసం పల్లెత్తు మాట కూడా అనలేకపోయాడు. దీనిబట్టి శివాజీపై నాగ్ ప్రేమ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కు హెల్త్ ఇష్యూ.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్)
అమర్‌కి సర్‌ప్రైజ్.. ప్రశాంత్‌కి షాక్
ఈ వారం 'టికెట్ టూ ఫినాలే' అర్జున్ గెలిచిన కారణంగా.. ఎవిక్షన్ పాస్ 14వ వారం కాదు, ఈ వారమే ఉపయోగించాలని ప్రశాంత్‌కి నాగ్ కండీషన్ పెట్టాడు. దాని గురించి తర్వాత చెబుతానని అన్నాడు. కానీ శనివారం ఎపిసోడ్‌లో కారణం లాంటిది ఏం చెప్పలేదు. మరోవైపు అమర్ మాట్లాడుతూ.. ఒక్కసారి మీరు నన్ను కెప్టెన్ అని పిలిస్తే వినాలని ఉందని నాగార్జునని రిక్వెస్ట్ చేశాడు. ఇది జరిగిన నాగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే పోటీలో 1200 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన కారణంగా.. వచ్చే వారం కెప్టెన్ అయ్యావ్ అమర్ అని నాగ్ చెప్పాడు. శివాజీ, అర్జున్.. డిప్యూటీస్ అని నాగ్ ఆదేశించాడు.
శివాజీతో గౌతమ్ గొడవ
ఇక 'బీబీ లైబ్రరీ' అని ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని పేర్లు రాసున్న బుక్... మరొకరికి ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల విషయంలో పెద్దగా ఇబ్బంది కాలేదు కానీ.. 'ప్రతిదానికి నేనే రైట్ అని అనుకోకుండా ఎలా ఉండాలి?' అనే బుక్ మాత్రం గౌతమ్.. శివాజీకి ఇచ్చాడు. దీన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. 'కుళ్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?' అని పుస్తకాన్ని.. రిటర్న్‌లో గౌతమ్‌కి ఇచ్చాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ నీది తప్పంటే నీది తప్పు అని నామినేషన్స్‌లో వాదించుకున్నట్లు హోస్ట్ నాగార్జున ముందే గొడవపడ్డారు. అంతా విన్న నాగార్జున.. ఎప్పటిలానే శివాజీకి సపోర్ట్ చేశాడు. గౌతమ్‌దే తప్పన్నట్లు తీర్పు ఇచ్చాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కారణంగా అర్జున్.. ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయిపోయినట్లు నాగ్ ప్రకటించాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే శనివారం అంతా కూడా నవ్వుతూనే సీరియల్ బ్యాచ్ గురించి నాగార్జున నిజాలు చెప్పాడు. ఇలానే శివాజీ బిహేవియర్ గురించి కూడా నిజాలు చెబితే బాగుండేది అనిపించింది.
(ఇదీ చదవండి: ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్‌మెంట్ లేదు!)
Comments
Please login to add a commentAdd a comment