ఆ ఇంటి కరెంట్‌ బిల్లు రూ. 25,11,467 | 25 Lakhs Power Bill to Lalapet House owner Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ ఇంటి కరెంట్‌ బిల్లు రూ. 25,11,467

Published Tue, Jul 7 2020 7:16 AM | Last Updated on Tue, Jul 7 2020 7:16 AM

25 Lakhs Power Bill to Lalapet House owner Hyderabad - Sakshi

లాలాపేట: కరెంట్‌ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్‌ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు. ఆయన ఇంటి మీటర్‌కు మార్చి 6 నుంచి జూలై 6 వరకు 3,45,007 యూనిట్లకు రూ.25,11,467 బిల్లు వేశారు. దీన్ని చూసి కృష్ణమూర్తి సోమవారం తార్నాకలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటర్‌లో లోపం ఉందని అధికారులు తెలిపారు. ఆ ఇంటికి కొత్త మీటరు వేసి రూ.2,095 వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement