lalapet
-
కనుమరుగవుతున్న సికింద్రాబాద్ రైల్వే కాలనీలు.. అప్రోచ్ రోడ్లు మూసివేత
రైల్వే కాలనీలు, సాధారణ ప్రజల సమ్మేళనంగా దశాబ్దాల కాలంగా సికింద్రాబాద్ నగరం వర్ధిల్లింది. రైల్వే కాలనీలు, కార్యాలయాలు, స్టేషన్ల సమాహారంగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంది. ఇదిలా ఉండగా రైల్వే కాలనీలు, స్థలాల మీదుగా సాధారణ ప్రజలు రాకపోకలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉండేవి. క్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల తొలగింపుతో రైల్వే కాలనీలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ ప్రాంతాల మీదుగా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రైల్వే అప్రోచ్ రోడ్లు కనుమరుగు అవుతున్నాయి. కొంతకాలం క్రితం హమాలిబస్తీ, మెట్టుగూడ ప్రాంతాల్లో రోడ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరిన్ని రోడ్లను మూసి వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దశాబ్దాల కాలంగా...సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం రైల్వే స్థలాలు దశాబ్దాల కాలంగా ఆవరించి ఉన్నాయి. మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల పరిధిలో రైల్వేశాఖకు చెందిన కాలనీలు నెలకొని ఉన్నాయి. ఆవిర్భావ కాలం నుంచి రైల్వే రోడ్ల మీదుగా పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది మంది సాధారణ ప్రజలు పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లడం కోసం రైల్వే రహదారులను వినియోగించుకుంటున్నారు.శిథిలావస్థకు చేరడంతో.... దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే క్వార్టర్లు క్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న క్వార్టర్లను రైల్వే అధికారులు నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఖాళీ ప్రదేశాలుగా మారుతున్న సదరు స్థలాల చుట్టూ అధికారులు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. పనిలో పనిగా ఆయా కాలనీల్లోంచి లోగడ కొనసాగిన అప్రోచ్ రోడ్లను కూడా మూసివేస్తున్నారు. మైదానాలుగా మారుతున్న రైల్వే క్వార్టర్లు, కాలనీల స్థలాల్లో కొన్నింటిని రైల్వే అధికారులు పరిరక్షిస్తున్నారు. ఇంకొన్ని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు. రహదారుల మూసివేతలు పూర్వకాలం నుంచి రైల్వే అప్రోచ్ రోడ్లను వినియోగించుకున్న లష్కర్ ప్రజలకు తాజాగా ప్రవేశాల మూసివేత వ్యవహారం గుదిబండగా మారుతుంది. ఈ వ్యవహారాల్లో భాగంగా హమాలిబస్తీ – చిలకలగూడ కూడలి, విజయపురికాలనీ–రైల్వే ఆసుపత్రి, లాలాగూడ–మారేడుపల్లి అప్రోచ్ రోడ్లను ఇప్పటికే మూసివేశారు. లీజుదారులు రైల్వే స్థలాల్లో నిర్మాణం పనులు ప్రారంభిస్తే మరిన్ని రహదారులు మూతడబడే అవకాశాలు ఉన్నాయి.ఇబ్బంది పడుతున్న ప్రజలు రైల్వే అధికారులు ఎడాపెడా రోడ్లు మూసివేస్తుండడంతో పరిసర ప్రాంతాల వెళ్లి రావడం కోసం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నాంమని స్థానికులు వాపోతున్నారు. సమీపంలోని ఆసుపత్రి, పాఠశాల, బస్‌స్టాప్‌లకు వెళ్లడానికి కోసం కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా సరైన సమయంలో వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి అప్రోచ్ రోడ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలి.చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులుఅనుమతిస్తే డంపింగ్యార్డులుగా మారుతున్నాయి : అధికారులు రైల్వే స్థలాల మీదుగా ప్రయాణాలకు అనుమతిస్తే వాటిని చెత్త డంపింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. అల్లరిమూకలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు వ్యర్థ పదార్థాలు డంప్ చేస్తున్నారు. రైల్వే స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కోసం మాత్రమే అప్రోచ్ రోడ్లను మూసివేసి, రైల్వే స్థలాల్లోకి ప్రవేశాలను కట్టడి చేస్తున్నామని రైల్వే డివిజనల్ అధికారులు చెబుతున్నారు. -
హైదరాబాద్ లాలాపేట్ లో దారుణం
-
Hyd: బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి ప్లేయర్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడో వ్యక్తి. లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో ఈ ఘటన జరిగింది. మృతుడు మల్కాజిగిరికి చెందిన పరమేశ్ యాదవ్ అని పోలీసులు తెలిపారు. కాగా ప్రైవేట్ ఉద్యోగి పరమేష్ యాదవ్ (39) ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడటానికి లాలాపేటలోని ప్రొ.జయశంకర్ ఇండోర్ స్టేడియానికి వస్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అపస్మారకస్థితికి చేరిన అతడినిఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో పరమేశ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో హఠాన్మరణాలు సంభవించడం చూస్తూనే ఉన్నాం. ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు. కార్డియాక్ అరెస్టు అయినపుడు సరైన సమయంలో సీపీఆర్ చేయడం ద్వారా బాధితులను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. చదవండి: హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టుల కాలం ఇది! ఆగిపోయే గుండె మీది కాకూడదంటే.. -
నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు
తార్నాక డివిజన్ లాలాపేట సాయి నగర్‌లోని మురికివాడలో తాత్కాలిక నివాసాలు, గుడిసెల్లో నివాసాలుంటున్న సుమారు 107 కుటుంబాలను డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేరిట ఖాళీ చేయించారు. మూడు బ్లాక్‌లతో కూడిన ఇళ్ల సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ కూడా పూర్తి కాలేదు. అక్కడి నివాసితులు ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక ఇబ్బందుల మధ్య బతుకులీడుస్తున్నారు. నగరంలోని అడ్డగుట్ట డివిజన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ మురికివాడలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం అక్కడి 42 నివాసాలను ఖాళీ చేయించారు. 2015లో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లుగా వీటి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పేద కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో కిరాయి ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: గూడు కోసం నిరుపేదల ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. మురికివాడల రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిదేందుకు పేదల నివాసాలను ఖాళీ చేయించి అక్కడే చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు నత్తలకు నడక నేర్పిస్తున్నాయి. అయిదారేళ్లుగా ఇంటి అద్దె భారమై పేదలు నానా అవస్థలు పడుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ఆశలు అడియాసలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2015లో రెండు పడకగల గదుల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. కానీ ఆశించిన రీతిలో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 40 ప్రాంతాలు.. 8,898 గృహాలు హైదరాబాద్ మహానగరంలో సుమారు రెండు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ప్రభుత్వం సేకరించింది. వాటిలో స్లమ్స్‌లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో ఇన్సిటూ పద్ధతిలో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే సింగం చెరువు తండా, చిత్తారమ్మ బస్తీ, కిడ్ కీ బాత్ అలీషా, సయ్యద్ సాబ్ కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడ, కట్టెలమండి, గోడే కీ ఖబర్ తదితర 25 ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అయిదేళ్లలో రూ.3.5 లక్షలపైనే .. నగరంలోని మురికి వాడల సమీపంలో నివాసాలకు నెలసరి అద్దె కనీసం అయిదు వేల రూపాయల వరకు ఉంది. అద్దెలన్నీ లెక్కిస్తే అయిదేళ్లలో చెల్లించింది రూ.3.5 లక్షలపైనే ఉంటుంది. ఇంటి అద్దె తలకుమించిన భారంగా మారడంతో పేద కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులందకపోవడంతోనే పనులు కుంటుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అద్దెలు చెలించలేక అవస్థలు పడుతున్నాం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట సొంతింటిని ఖాళీ చేయించారు. అప్పటి నుంచి కిరాయి ఇంటిలోనే ఉంటున్నాం. ఏళ్లు గడుస్తున్నా..ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. యేటా పెరుగుతున్న అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుంది. – జీలకర్ర నవీన్, ఆజాద్‌నగర్ అయిదో దసరా వచ్చింది మా ఇల్లు ఖాళీ చేయించి నిర్మాణాలు చేపట్టారు. దసరా పండగకు గృహ ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నాలుగు దసరా పండగలు గడిచిపోయాయి. అయిదోసారి దసరా దగ్గరకు వచ్చింది. – కొత్తపల్లి అనిల్ కుమార్, సాయినగర్ -
పక్కా ప్లాన్.. భార్యకు మద్యం తాగించి దారుణం
లాలాపేట: కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్మండి పార్టీవాడకు చెందిన శకత్వాల దర్శన్ ఈసీఐఎల్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య సౌందర్య(25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లది ప్రేమ వివాహం. వీరికి మద్యం తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉన్నారు. భార్య సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ నిర్ణయించుకున్నాడు. అయితే పెద్దల జోక్యంతో కలిసి ఉంటున్నారు. గత వారం రోజుల నుంచి సౌందర్య భర్త దర్శన్‌తో గొడవపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్న దర్శన్ మధ్యహ్నం పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో సౌందర్యను టవల్ సాయంతో గొంతు బిగించి హతమార్చాడు. నేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మైనర్ బాలికతో ప్రేమ.. ఆపై పురుగుల మందు తాగి!) -
అమ్మా.. సావొద్దే..
సాక్షి, హైదరాబాద్/అడ్డగుట్ట: నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి కళ్ల ముందే ఆత్మహత్య చేసుకోవ డంతో ఆ చిన్నారులు అల్లాడిపోయారు.. గదిలో ఉరేసుకుంటున్న ఆమెను చివరి నిమిషంలో చూసిన ఇద్దరు పిల్లలు ‘అమ్మా.. వద్దు.. సావొద్దే..’అంటూ ప్రాధేయపడ్డారు. ఇటు తండ్రికి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా కలవలేదు.. దీంతో వారి మేన మామకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి వచ్చేలోపే ఘోరం జరిగిపోయింది.. ఉరికి వేలాడుతూ ఆమె విగతజీవిలా కనిపించింది. పన్నెండేళ్ల క్రితం వివాహం.. కర్ణాటకకు చెందిన సతీశ్, మంజుల గౌడలకు (32) పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. అనంతరం లాలాపేట ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఆరో తరగతి చదువుతున్న రంజిత్, ఐదో తరగతి చదువుతున్న తేజస్ సంతానం. సతీశ్ తన ఇంటికి సమీపంలోని లేబర్ అడ్డా ప్రాంతంలో బెంగళూర్ అయ్యంగార్ బేకరీ నిర్వహిస్తున్నాడు. మంజుల కూడా వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్లి భర్తకు సహాయం చేసేది. మంజుల సోదరుడు నాగరాజు సైతం హుజూరాబాద్‌లో బేకరీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటలకు సతీశ్ యథావిధిగా తన బేకరీకి వెళ్లిపోయాడు. కాసేపటివరకు మంజుల పిల్లలతోనే గడిపింది. ఏమైందో తెలియదు గానీ.. ఉదయం 10 గంటల ప్రాంతంలో మంజుల బెడ్రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరేసుకుంది. హాలులో ఆడుకుంటున్న తేజస్, రంజిత్‌లు ఆఖరి నిమిషంలో కిటికిలోంచి ఈ విషయం గమనించారు. వద్దమ్మా.. వద్దు అంటూ రోదిస్తున్నా.. మంజుల మనసు మారలేదు. దీంతో ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో తేజస్ వద్దని వారిస్తుండగా.. రంజిత్ ఇంట్లోని ఫోన్‌తో బేకరీలో ఉన్న తండ్రికి కాల్ చేయడానికి ప్రయత్నించాడు. అది కలవకపోవడంతో మేనమామ నాగరాజుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అతను బావ సతీశ్‌కు కాల్ చేసి ఆరా తీయగా.. తాను బేకరీలో ఉన్నానని, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నానంటూ పరుగుపెట్టాడు. సతీశ్ ఇంటికి చేరుకునేలోపే మంజుల ప్రాణం విడిచింది. అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సెల్ఫీ వీడియో చిత్రీకరించి.. కళ్ల ముందే ఆత్మహత్య చేసుకున్న తల్లి మృతదేహాన్ని చూస్తూ ఆ ఇద్దరు చిన్నారులు గుండెలు పగిలేలా రోదించారు. వారిని సముదాయించడం అక్కడున్న ఎవరి వల్ల కాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంజుల సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయే ముందు మంజుల ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఆమె తన చావుకు ఎవరూ కారణం కాదంటూ చెప్పింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసు ‘సాక్షి’కి తెలిపారు. -
ఆ ఇంటి కరెంట్ బిల్లు రూ. 25,11,467
లాలాపేట: కరెంట్ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్డౌన్ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు. ఆయన ఇంటి మీటర్‌కు మార్చి 6 నుంచి జూలై 6 వరకు 3,45,007 యూనిట్లకు రూ.25,11,467 బిల్లు వేశారు. దీన్ని చూసి కృష్ణమూర్తి సోమవారం తార్నాకలోని విద్యుత్ సబ్‌స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటర్లో లోపం ఉందని అధికారులు తెలిపారు. ఆ ఇంటికి కొత్త మీటరు వేసి రూ.2,095 వేశారు. -
తాగి.. తూలి.. ప్రాణాలు విడిచాడు..!
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో నాలాలో తూలిపడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లాలాపేట నాల వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నాలా గోడను ఆనుకుని నిలుచున్న ఓ వ్యక్తి కాసేపటి తర్వాత దానిపైన కూర్చునే ప్రయత్నం చేశాడు. అయితే, అతను మద్యం సేవించి ఉండటంతో గోడ పైనుంచి తూలిపడిపోయాడు. నేరుగా నాలాలో ఉన్నబండరాయిపై పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మద్యం మత్తులో తూలుతున్న సదరు వ్యక్తి నాలా గోడపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్టు వెల్లడైంది. తలకు తీవ్ర గాయమవడంతోనే అతను చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
సంధ్యపై అసత్య ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను దారుణంగా చంపిన కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు. ‘నన్ను ఎలా కాల్చాడో అలానే అతన్ని కూడా కాల్చాలని’ ప్రాణంపోయే సమయంలో తన కూతురు కోరిందని ఆమె వెల్లడించారు. చనిపోయిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానల్స్‌లో సంధ్యపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి సోదరుడు సాయికుమార్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ.. నిందితుడు తన కూతురును రోజూ ఆఫీసుకు తీసుకువెళ్లి, తీసుకొచ్చేవాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాలని, బస్తీ వాసులను విచారిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. కార్తీక్‌కు, తన కుమార్తెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఘటనలో నిందితుడి తల్లి హస్తం కూడా ఉందన్న అనుమానం కలుగుతోందని, ఆమెను కూడా విచారించాలని కోరారు. నిందితుని ఇంటివద్దకు వెళ్లి వారి కుటుంబం గురించి విచారించగా వారు ఎంతో దుర్మార్గులని తేలిందన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ.. సంధ్యారాణి హత్య మరో ఢిల్లీ నిర్భయ ఘటన లాంటిదే అన్నారు. మరణించిన తర్వాత కూడా సంధ్యపై అసత్య ప్రచారాలు చేయడంతో ఆమె ఆత్మకూడా శాంతించదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఒక మహిళను పెట్రోల్‌పోసి తగలబెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సంధ్యారాణి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు, సంధ్యారాణి తల్లి సావిత్రమ్మకు నెలకు రూ. 5 వేల ఫించన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెండ్యాల భానుప్రసాద్, నిమ్మ బాబూరావు, ఉత్తమ్ శ్రీనివాస్, ప్రభాకర్ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
బాలికపై అత్యాచారం
గుంటూరు : గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. లాలాపేటలోని యానాది కాలనీకి చెందిన ఓ బాలిక(15) బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం మధ్యాహ్నం బాధితురాలు తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లాలాపేటలో యువతి దారుణ హత్య
హైదరాబాద్: నగరంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన ఉస్మానియా వర్సిటీ పరిధిలోని లాలాపేట లో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉన్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాందీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. యువతిని అత్యాచారం చేసి హతచేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.