![Husband Assassinated His Wife At Lalapet Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/30/women-drinking.jpg.webp?itok=s0NaPzRu)
ప్రతీకాత్మక చిత్రం
లాలాపేట: కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండి పార్టీవాడకు చెందిన శకత్వాల దర్శన్ ఈసీఐఎల్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య సౌందర్య(25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లది ప్రేమ వివాహం. వీరికి మద్యం తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉన్నారు.
భార్య సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ నిర్ణయించుకున్నాడు. అయితే పెద్దల జోక్యంతో కలిసి ఉంటున్నారు. గత వారం రోజుల నుంచి సౌందర్య భర్త దర్శన్‌తో గొడవపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్న దర్శన్ మధ్యహ్నం పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో సౌందర్యను టవల్ సాయంతో గొంతు బిగించి హతమార్చాడు. నేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: మైనర్ బాలికతో ప్రేమ.. ఆపై పురుగుల మందు తాగి!)
Comments
Please login to add a commentAdd a comment