కరెంటు కనెక్షన్ మరిచారు బిల్లులు మాత్రం ఇచ్చారు | Illiterate couple pay for power without getting connection | Sakshi
Sakshi News home page

కరెంటు కనెక్షన్ మరిచారు బిల్లులు మాత్రం ఇచ్చారు

Published Wed, Aug 5 2015 5:09 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

కరెంటు కనెక్షన్ మరిచారు బిల్లులు మాత్రం ఇచ్చారు

కరెంటు కనెక్షన్ మరిచారు బిల్లులు మాత్రం ఇచ్చారు

రామనాథపురం(తమిళనాడు): విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండానే నిరక్షరాస్యులనై దంపతుల వద్ద నుంచి కరెంటు బిల్లులు వసూలు చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.  తమ ఇంటికి విద్యుత్ కనెక్షన్కోసం మీటర్ పెట్టిన అధికారులు ఆ తర్వాత కనెక్షన్ ఇవ్వకుండానే దాదాపు మూడు నెలల బిల్లు వసూలు చేశారు. రామనాథపురంలోని ఓ దంపతులు విద్యుత్ కనెక్షన్ కోసం రూ.6000 వేలు చెల్లించారు.

డబ్బు చెల్లించాక ఇంటికొచ్చిన అధికారులు ముందు మీటర్ పెట్టారు. త్వరలోనే వారి ఇంటికి సమీపంలో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుచేస్తామని, ఆ వెంటనే కరెంట్ వస్తుందని చెప్పారు. కానీ, వారు చెప్పిన మాట ప్రకార విద్యుత్ రాకపోగా, తాము మీటర్ పెట్టినందున పవర్ వచ్చినా రాకపోయినా నెల నెలా సగటు చార్జీల కింద బిల్లు చెల్లించాలని మార్చి, ఏప్రిల్, మే నెలలకు వరుసగా రూ.86, రూ.86, రూ.110  చార్జీ విధించారు. దీంతో ఆ మొత్తం చెల్లించిన దంపతులు ఎలక్ట్రిసిటీ బోర్డ్కు ఫిర్యాదు చేరవేయగా.. వారు పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement