![UP Kannauj Railway Station Collapses Incident Latest Updates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/11/Kannauj_Accident2.jpg.webp?itok=qkRl-JwC)
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం జరిగింది. కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 12 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్(DM) శుభ్రాంత్ కుమార్ శుక్ల్ తెలిపారు.
కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో 35 మంది కూలీలు అక్కడ ఉన్నట్లు సమాచారం.
ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు.
![కన్నౌజ్ రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు](https://www.sakshi.com/s3fs-public/inline-images/st_3.jpg)
Comments
Please login to add a commentAdd a comment