పైశాచికానికి పరాకాష్ట | Tantric sacrifices 14-yr-old girl, rapes dead body in UP's Kannauj in exchange of gold to parents | Sakshi
Sakshi News home page

పైశాచికానికి పరాకాష్ట

Published Sat, Jun 10 2017 2:55 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

పైశాచికానికి పరాకాష్ట - Sakshi

పైశాచికానికి పరాకాష్ట

కనౌజ్‌: ఘోరాతి ఘోరం. పైశాచికానికి పరాకాష్ట. మనం ఆధునిక యుగంలో ఉన్నామా, ఆటవిక యుగంలో ఉన్నామా అనే అనుమానం కలిగించే భయానక ఘటన ఉత్తరప్రదేశ్‌ కనౌజ్‌ జిల్లాలో భాదౌసి గ్రామంలో ఆలస్యం వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో 14 ఏళ్ల బాలికను బలి ఇచ్చి, శవంపై లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ దారుణోదంతం వెల్లడైంది. నిందితుడు కృష్ణ కుమార్‌ శర్మ, బాలిక తల్లిదండ్రులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

కనౌజ్‌ ఏఎస్పీ కేశవ్‌ చంద్ర గోస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తమ పూర్వపు ఇంట్లో పాతిపెట్టిన బంగారం జాడ చెప్పాలని బాలిక తల్లిదండ్రులు మహవీర్‌ ప్రసాద్‌, పుష్ప.. తాంత్రికుడు కృష్ణ కుమార్‌ను ఆశ్రయించారు. మీ కుమార్తెను బలి ఇచ్చి పూజలు చేస్తే ఐదు కేజీల బంగారం దొరుకుతుందని వారికి కుమార్‌ నమ్మబలికాడు. అతడి ఆదేశాల మేరకు తమ కుమార్తెను తీసుకుని మహావీర్‌ దంపతులు స్థానిక ఆలయానికి వెళ్లారు. కొన్ని పూజలు చేసిన తర్వాత బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ముందే ఆమెను నగ్నంగా నిలబెట్టి గొంతు పిసికి చంపేశాడు. తర్వాత శవంపై ఆకృత్యానికి పాల్పడ్డాడు. పూజ కోసమని చెప్పి బాలిక గొంతు కోసి రక్తం తీశాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక స్పృహలోకి వస్తుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు.

తాంత్రికుడి మాటలు నమ్మి కూతుర్ని కోల్పోయామని గ్రహించిన మహవీర్‌ ప్రసాద్‌(55) పోలీసులను ఆశ్రయించాడు. కుష్ణకుమార్‌ తన కూతురు కవితను కిడ్నాప్‌ చేశాడని కేసు పెట్టాడు. ఈ నెల 8న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి పోస్టుమార్టంకు పంపారు. నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ప్రమేయం ఉందన్న అనుమానంతో అతడిని ప్రశ్నిస్తున్నామని ఏఎస్పీ గోస్వామి తెలిపారు. దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement