
బాధిత యువతి
లక్నో, ఉత్తరప్రదేశ్: యూపీలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆ అకృత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 24న యువతి తాగునీటిని తెచ్చేందుకు గ్రామ శివారులో ఉండే బావి వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసిన స్థానికులు తాలిబ్, సల్మాన్‌లు యువతిని బెదిరించి అత్యాచారం చేశారు. విషయం బయటపడి తన కుటుంబం పరువు పోతుందనే భయంతో జరిగిన ఘోరాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు.
కానీ, నిందితులు లైంగిక దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో వైరల్ కావడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ‘మా సోదరిపై జరిగిన అకృత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కీచకులకు ఉరిశిక్ష విధించాల్సిందే. లేదంటే మా కుటుంబం మొత్తం ఆత్మాహుతి చేసుకుంటుంద’ని బాధిత యువతి సోదరి పోలీసులను వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment