ఉత్కంఠ పోరులో పాక్‌పై విజయం.. భారత్‌ ఖాతాలో పదో స్వర్ణం | Asian Games: India Win Thriller vs Pakistan Gold In Mens Squash | Sakshi
Sakshi News home page

Asian Games: ఉత్కంఠ పోరులో పాక్‌పై విజయం.. భారత్‌ ఖాతాలో పదో స్వర్ణం

Published Sat, Sep 30 2023 4:08 PM | Last Updated on Sat, Sep 30 2023 6:37 PM

Asian Games: India Win Thriller vs Pakistan Gold In Mens Squash - Sakshi

పాక్‌పై విజయం.. భారత్‌ ఖాతాలో పదో స్వర్ణం (PC: SAI)

Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్‌ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. స్క్వాష్‌ క్రీడాంశంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరులో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. హోంగ్జూలో శనివారం నాటి ఉత్కంఠ ఫైనల్లో పాక్‌ టీమ్‌ను 2-1తో ఓడించి బంగారు పతకం గెలిచింది. 

సౌరవ్‌ ఘోషల్‌, అభయ్‌ సింగ్‌, మహేశ్‌ మంగావ్కర్‌, హరీందర్‌ సంధులతో కూడిన భారత స్క్వాష్‌ జట్టు ఈ మేరకు పాక్‌ టీమ్‌ను ఓడించి చైనాలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. కాగా భారత్‌ ఇప్పటి వరకు 10 స్వర్ణాలు, 13 రజత, 13 కాంస్య పతకాలు గెలిచింది.

చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కావొచ్చు: టీమిండియా స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement