ఆసియాక్రీడల్లో భారత్‌ రికార్డు.. 100 పతకాలు! ఇదే తొలిసారి | 100 medals up for India, Womens Kabaddi team clinches gold | Sakshi
Sakshi News home page

Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌ రికార్డు.. 100 పతకాలు! ఇదే తొలిసారి

Published Sat, Oct 7 2023 8:16 AM | Last Updated on Sat, Oct 7 2023 11:47 AM

100 medals up for India, Womens Kabaddi team clinches gold - Sakshi

చైనా వేదికగా జరగుతున్న ఆసియాక్రీడల్లో భారత్‌ సరి కొత్త రికార్డు సృష్టించింది. ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలోనే తొలి సారి 100 పతకాల మార్క్‌ను భారత్‌ అందుకుంది. తాజగా కబడ్డీలో మహిళల జట్టు గోల్డ్‌మెడల్‌ సాధించడంతో.. భారత్‌ ఈ ఘనత సాధిచింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ తుది పోరులో చైనీస్ తైపీ జట్టును 26-25తో భారత్‌ ఓడిం‍చింది.

దీంతో భారత మహిళల కబడ్డీ జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంది. కాగా శనివారం ఒక్క రోజే భారత్‌ మూడు బంగారు పతకాలు సాధించింది. రెండు ఆర్చరీలో రాగా.. మరో స్వర్ణ పతకం కబడ్డీలో వచ్చింది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు 100(25 గోల్డ్‌, 35 సిల్వర్‌, 40 బ్రాంజ్‌) మెడల్స్‌ ఇండియా ఖాతాలో ఉన్నాయి. 
చదవండి: Asian Games 2023: అదరగొడుతున్న ఆర్చర్లు.. భారత్‌ ఖాతాలో మరో రెండు గోల్డ్‌ మెడల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement