
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో భారత ఆర్చర్లు అదరగొడతున్నారు. తాజాగా భారత ఖాతాలో రెండు బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఆర్చరీలో భారత్ రెండు పసిడి పతకాలు భారత్ సాధించింది. పురుషల కాంపౌండ్ ఈవెంట్‌లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్ మెడల్ సాధించగా.. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది.
కాగా ఈ ఏడాది ఆసియాక్రీడల్లో ఇది జ్యోతి సురేఖకు మూడో బంగారు పతకం కావడం విశేషం. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో యువ సంచలనం అధితి గోపిచంద్‌కు కాంస్యం సొంతం చేసుకుంది. ఆర్చరీలో తాజా విజయాలతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 24కు చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 99(24 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment