
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్ కు బెయిల్
ఢాకా: అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్ కు బెయిల్ లభించింది. ఢాకా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు అతడికి బెయిల్ ఇచ్చింది.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల మోడల్- హీరోయిన్ ఒకామె ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ గడువు ముగియడంతో ఈనెల 8న ఢాకా మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట అతడు లొంగిపోయాడు. తాజాగా అతడికి మరోసారి బెయిల్ లభించింది. ప్రపంచకప్కు ఎంపికైన రూబెల్ హొస్సేన్ భవితవ్యం ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది.