టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 7000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి కివీస్ ఆటగాడిగా విలియమ్సన్ రికార్డులకెక్కాడు.
పాకిస్తాన్‌తో రెండో టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన కేన్‌మామ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన జాబితాలో విలియమ్సన్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర ఉన్నారు.
కాగా డ్రాగా ముగిసిన తొలి టెస్టులో విలిమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక పాక్-న్యూజిలాండ్ రెండో టెస్టు కూడా డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు టీ విరామానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 192 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment