న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయాల కారణంగా ఇటీవలికాలంలో తరుచూ క్రికెట్‌కు దూరమవుతున్నాడు. ఐపీఎల్ 2023 సందర్భంగా కాలు విరగ్గొట్టుకున్న కేన్ మామ.. అష్టకష్టాలు పడి వన్డే వరల్డ్‌కప్‌కు అందుబాటులోకి వస్తే, అక్కడ కూడా గాయపడి పలు కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆ గాయం నుంచి కూడా కోలుకుని స్వదేశంలో పాక్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వస్తే, ఇక్కడ కూడా గాయపడి మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
హ్యామిల్టన్‌లో జరిగిన రెండో టీ20 సందర్భంగా గాయపడిన కేన్ మామ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ న్యూజిలాండ్ ప్రకటించింది. రెండో టీ20లో మాంచి టచ్‌లో (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) ఉన్నప్పుడు కండరాల సమస్య కారణంగా అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు. స్కానింగ్ రిపోర్ట్‌ల్లో చిన్న సమస్యే అని తేలినప్పటికీ, టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా క్రికెట్ న్యూజిలాండ్ పాక్‌తో సిరీస్ మొత్తానికి అతన్ని దూరంగా ఉంచింది. పాక్‌తో మిగిలిన మ్యాచ్‌లకు కివీస్ సెలెక్టర్లు విల్ యంగ్‌ను కేన్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు.
కేన్ పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్న గుజరాత్..
కేన్ తాజా పరిస్థితి చూసి అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా ఆందోళన చెందుతుంది. త్వరలో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కేన్ పూర్తిగా కోలుకుంటాడో లేదోనని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతానికి కోలుకున్నా ఆతర్వాత జరిగే సిరీస్‌లు ఆడి దెబ్బలు తగిలించుకుని తమని ఇబ్బంది పెడాతాడేమోనని కలవర పడుతుంది.
33 ఏళ్లకే వయసు పైబడినట్లు కనిపిస్తున్న కేన్ పరిస్థితి గుజరాత్ టైటాన్స్ ఉలిక్కిపడుతుంది. ఇప్పటినుంచి కేన్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటే మంచిదని ఆలోచిస్తుంది. ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో టీ20 జనవరి 17న డునెడిన్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment