
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్నతొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్( Kane Williamson) తీవ్ర నిరాశపరిచాడు. పాక్ పేసర్ నసీమ్ షా అద్బుతమైన బంతితో విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడు. అతడి దెబ్బకు కేన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
కివీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నసీమ్ షా.. తొలి బంతిని కేన్ మామకు బ్యాక్ ఆఫ్ ఎ-లెంగ్త్ డెలివరీగా ఆఫ్‌సైడ్ సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ బ్యాక్‌ఫుట్ నుండి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే అతడి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది.
దీంతో కేన్ మామ హెడ్‌ను షేక్ చేస్తూ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా విలియమ్సన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కు అవుట్ కావడం 2019 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రవీంద్ర దూరం..
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్.. న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్ విల్ యంగ్(88 నాటౌట్) మాత్రం తన అద్బుతమైన ఆటతీరుతో కివీ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
29 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన ట్రైసిరీస్‌లో గాయపడిన కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇంక పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.దీంతో అతడు తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాడు. దీంతో అతడు ఆట మధ్యలోనే ఫీల్డ్‌ను వీడి బయటకు వెళ్లిపోయాడు.
తుదిజట్లు
పాకిస్తాన్
ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
న్యూజిలాండ్
డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ
WHAT A BALL FROM NASEEM SHAH ⚡⚡ pic.twitter.com/ghHOFkiSlU
— Johns. (@CricCrazyJohns) February 19, 2025