Is Ravindra Jadeja Taking Retirement from Test cricket? | Team India Squad For South Africa Tour 2021
Sakshi News home page

Ravindra Jadeja: రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం.. ఇకపై !

Published Thu, Dec 9 2021 12:15 PM | Last Updated on Thu, Dec 9 2021 5:06 PM

Ravindra Jadeja - Sakshi

Is Ravindra Jadeja Taking Retirement from Test cricket?: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా త్వరలో టెస్ట్‌ క్రికెట్‌కు త్వరలో గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని జడేజా సహచర ఆటగాడు ఒకరు దైనిక్ జాగరణ్ పత్రికకు తెలిపారు. కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన  రెండో టెస్ట్‌కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే.

ఇక మోకాలి శస్త్రచికత్స అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరుపున  టెస్ట్‌ క్రికెట్‌లో 57 మ్యాచ్‌లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2195 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టెస్ట్‌ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది.

భారత టెస్ట్‌ జట్టువిరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా

చదవండి: India Tour Of South Africa: భారత​ టెస్ట్‌ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్‌ స్పిన్నర్‌ ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement