knee injury
-
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
గాయపడ్డ సీనియర్ నటి ఖుష్బూ.. పోస్ట్ వైరల్
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ గాయపడింది. మోకాలికి కట్టుతో కనిపించింది. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అయితే గాయానికి కారణాలేంటి? ఏం ప్రమాదం జరిగింది? అనే దాని గురించి బయటపెట్టలేదు. ప్రస్తుతం కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)వెంకటేశ్ 'కలియుగ పాండవులు' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 200కి పైగా సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ సీరియల్ చేసింది. ప్రస్తుతం రియాలిటీ షోలకు జడ్జిగా చేస్తోంది. దీనితో పాటు పాలిటిక్స్‌లో కాస్త బిజీ. మరోవైపు భర్త సుందర్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె కాలికి గాయం కావడంతో ఏమైందా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే గాయపడింది. కొన్నాళ్ల ముందు తెలుగులో వరస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏం చేయట్లేదు. పలు మూవీస్‌లో ఛాన్సులు వచ్చారని అన్నారు గానీ వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను గాయపడినట్లు ఓ ఫొటోతో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్.. స్టార్ హీరోకు షాక్) మోకాలికి దెబ్బలు హీరోయిన్లు అంటే గ్లామర్ చూపించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అలానే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ మోకాలికి దెబ్బలు తగిలించుకుంది. అందుకు సంబంధించిన ఫొటోని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కలిసిరాని లక్ అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి హిట్ సినిమాలతో మంచి ఊపు మీద కనిపించిన పూజాహెగ్డేకు గతేడాది వరస దెబ్బలు తగిలాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ (హిందీ).. ఇలా చేసినవి చేసినట్లు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఇవే అనుకుంటే 'గుంటూరు కారం' నుంచి ఈమెని తప్పించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి పోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పూజాహెగ్డే తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరమైనట్లే. (ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
టీమిండియా స్టార్ ఓపెనర్‌కు షాక్.. ఏకంగా 3-4 నెలల పాటు..
Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతాలు చేశాడు. సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్‌లలో డబుల్ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది. జాతీయ క్రికెట్ అకాడమీలో దీంతో భారత్‌కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఉబ్బిపోయిన మోకాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం. గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు. దేశవాళీ క్రికెట్‌కు దూరం దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు. వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్‌మన్ గిల్ స్థిరపడిపోగా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ రూపంలో ఈ ముంబై బ్యాటర్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకుని.. కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం. కోపంతో గొడవలు జరిగిన సమయంలో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ తనకు తెలియకుండా జరిగిన పొరపాటు వల్ల ప్రత్యర్థి ఆటగాడికి ఎంత నష్టం జరిగిందనేది ఈ వార్త తెలియజేస్తుంది. విషయంలోకి వెళితే.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్,అర్జెంటినోస్ జూనియర్స్ తలపడ్డాయి. మ్యాచ్‌లో ఇరుజట్లు చెరొక గోల్ కొట్టడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. కాగా ఆట 56వ నిమిషంలో బ్రెజిల్ ఫ్లుమినెన్స్ ఆటగాడు మార్సెలో బంతిని తన్నబోయి అనుకోకుండా ప్రత్యర్థి డిఫెండర్ లుసియానో సాంచెజ్ ఎడమ కాలు గట్టిగా తొక్కాడు. మార్సెలో బంతిని తన్నబోయే సమయంలోనే లుసియానో అతని వైపు దూసుకురావడం.. కాలు అడ్డుపెట్టడం జరిగిపోయాయి. దీంతో లుసియానో ఒక్కసారిగా కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఊహించని సంఘటనతో మార్సెలో షాక్ తిన్నాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. లూసియానోను పరీక్షించిన వైద్యులు కాలు విరిగిపోయినట్టు గుర్తించారు. అతను కోలుకునేందుకు 8 నెలల నుంచి 12 నెలలు పట్టనుందని సమాచారం. బాధ భరించలేక ఏడుస్తునే మైదానం వీడిన లూసియానోను చూసి మార్సెలో కంటతడి పెట్టుకున్నాడు. ''నేను ఈరోజు మైదానంలో నేను చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. సహచర ఫుట్‌బాలర్‌ను కావాలని గాయపరచలేదు. లుసియానో సాంచెజ్.. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా'' అని మార్సెలో ట్విటర్లో పేర్కొన్నాడు. మార్సెలో పోస్ట్‌పై అర్జెంటీనా క్లబ్ స్పందిస్తూ.. ''మనం ప్రత్యర్థులం.. శత్రువులం కాదు'' అని కామెంట్ చేసింది. Dios mio https://t.co/LO8ezSX3Oe pic.twitter.com/V9a24dYGBu — Usuarios siendo domados (@sindicatodedom4) August 1, 2023 చదవండి: 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత -
ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్‌నెస్‌పై హస్సీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల విజయంతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్కే గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 ఆడనుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విజయం దిశగా పయనిస్తున్నప్పటికి అనుకున్న ఓవర్లలో పూర్తి చేయకపోవడంతో రన్‌రేట్ సీఎస్కే కంటే తక్కువ ఉంది. దీంతో సీఎస్కే రెండో స్థానంలో నిలచి సొంత ప్రేక్షకుల మధ్య క్వాలిఫయర్-1 ఆడనుంది. ఇదిలా ఉంటే ధోని ఫిట్‌నెస్‌పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. అందుకే పరుగులు తీసేందుకు ఇష్టపడడం లేదని తెలిపాడు. సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మైక్ హస్సీ కామెంటేటర్‌తో మాట్లాడాడు. ధోని మోకాలి సమస్య వంద శాతం సమసిపోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా పరుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. బ్యాటింగ్‌కు కూడా ఆఖరి 2-3 ఓవర్లలో రావడానికి కారణం కూడా అదే. నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంత బాధపెట్టుకొని కూడా అతను తన టార్గెట్‌ను మిస్ అవకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాడు. కాగా ధోని విషయంలో హస్సీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ధోని కూడా మ్యాచ్‌ల్లో చాలాసార్లు తన మోకాలికి బ్యాండేజీ లేదా ఐస్‌క్యాప్ పెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు ధోనికి ఈ సీజన్ చివరిదని రూమర్లు కూడా వచ్చాయి. కానీ రూమర్లను స్వయంగా కొట్టిపారేసిన ధోని 2024 ఐపీఎల్ కూడా ఆడొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇక హస్సీ వ్యాఖ్యలు సీఎస్కే అభిమానులను ఆందోళనలో పడేసింది. ఒకవేళ ప్లేఆఫ్ సమయానికి ధోనికి మోకాలి సమస్య ఎక్కువై మ్యాచ్‌కు దూరమైతే సీఎస్కే పరిస్థితి ఏంటని తెగ బాధపడుతున్నారు. ''దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సమయంలో ధోని ఫిట్‌నెస్‌పై ఆందోళన కలిగించేలా మాట్లాడడం సరికాదని'' అభిమానులు పేర్కొన్నారు. చదవండి: జడేజాపై సీరియస్ అయిన ధోని! -
#venkateshIyer: నొప్పిని భరిస్తూనే..
ఐపీఎల్ 16వ సీజన్లో రెడో శతకం నమోదైంది. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. 49 బంతుల్లో 9 సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలింది. కామెరాన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 4 ఓవర్లో గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన డెలివరీని స్కూప్ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి గట్టిగా తగిలింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో ఫిజియో వచ్చి పరిశీలించి చికిత్స చేశాడు. అయితే అదే సమయంలో ముంబై ఆటగాడు తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ కాలికి మర్దన చేసి క్రీడాస్పూర్తిని చాటుకోవడం విశేషం. ఇక నొప్పి బాధిస్తున్నా వెంకటేశ్ అయ్యర్ తన దూకుడును ఏమాత్రం ఆపలేదు. చూస్తుండగానే ఫిఫ్టీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్.. 90 పరుగులకు చేరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అయితే 90 నుంచి వంద మార్క్ అందుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సింగిల్స్ తీస్తూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. అయితే గాయం పెద్దగా లేకపోవడం ఊరట అని చెప్పొచ్చు. బంతి కాలికి బలంగా తగలడంతో నొప్పి కాస్త ఎక్కువే ఉందని.. ఎలాగూ ఇంపాక్ట్ కింద డగౌట్ కూర్చుంటా కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంది. అని తొలి ఇన్నింగ్స్ అనంతరం చెప్పుకొచ్చాడు. చదవండి: Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే! -
నడవడానికే ఇబ్బందిగా ఉంది.. ధోనికి ఏమైంది!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎంఎస్ ధోని వింటేజ్ మహీని తలపిస్తున్నాడు. క్రీజులో అడుగుపెట్టిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి అదే మంత్రం జపించిన ధోని తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ అదే సీన్‌ను రిపీట్ చేశాడు. చేజింగ్‌లో మునుపటి ధోనిని తలపిస్తూ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ధోని మ్యాచ్‌ను దాదాపు సీఎస్కే చేతుల్లోకి తెచ్చేశాడు. అయితే రాజస్తాన్ బౌలర్ సందీప్ శర్మ ఆఖరి మూడు బంతులను తెలివిగా వేయడంతో సీఎస్కే మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ సంగతి పక్కనబెడితే.. ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు జట్టు కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ ప్రకటించాడు. ధోని గాయం సీఎస్కే ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళన కలిగించింది. తాజాగా సీఎస్కే ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్న వీడియోనూ షేర్ చేసింది. ఆ వీడియోలో పెవిలియన్‌కు వెళ్తున్న ధోని నడవడానికి కాస్త ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎస్కే మాత్రం ఏ వారియర్.. ఏ వెటరన్.. ఏ ఛాంపియన్.. వన్ అండ్ ఓన్లీ అంటూ క్యాప్షన్ జత చేసి అతన్ని చీర్‌అప్ చేసింది. ''ప్రస్తుతం ధోని వైద్యలు పర్యవేక్షణలో ఉన్నాడు. మోకాలి నొప్పికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నాడు. తర్వాతి మ్యాచ్‌కు నాలుగు రోజులు సమయం ఉండంతో అప్పటిలోగా ధోని కోలుకుంటాడని ఆశిస్తున్నా'' అంటూ ప్లెమింగ్ తెలిపాడు. A warrior. A veteran. A champion - The One and Only! 🦁 Full post match 📹 https://t.co/LuLJ13LVt3#CSKvRR #WhistlePodu #Yellove 💛 @msdhoni pic.twitter.com/dgsuPgT92y — Chennai Super Kings (@ChennaiIPL) April 13, 2023 చదవండి: Sandeep Sharma: తండ్రి బౌలింగ్ చూసి కేరింతలు కొట్టిన కూతురు -
కేన్ మామ కథ ముగిసే.. గాయంతో ఐపీఎల్ మొత్తానికి దూరం
న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్స్‌న్ ఐపీఎల్ 2023 టోర్నీ నుంచి వైదొలిగాడు. మోకాలి గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ఆదివారం తన ట్విటర్లో అధికారికంగా ప్రకటించింది. ‘‘సీఎస్కేతో మ్యాచ్‌లో ఆడుతూ గాయపడిన కేన్ విలియమ్సన్.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌కి వెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 జరగనుండటంతో అప్పటిలోపు గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.'' అంటూ పేర్కొంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో గత శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ విలియమ్సన్ గాయపడ్డాడు. అతని మోకాలికి తీవ్ర గాయమవగా.. ఫిజియో, సపోర్ట్ ప్లేయర్ సహాయంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను బ్యాటింగ్‌కి రాలేదు. దాంతో అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ని ఆడించిన గుజరాత్ టైటాన్స్ ఫలితం అందుకుంది. సీఎస్కేతో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్ సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుండగా.. కేన్ విలియమ్సన్ స్థానంలో ఏ ప్లేయర్‌ని ఇంకా గుజరాత్ టైటాన్స్ తీసుకోలేదు. We regret to announce, Kane Williamson has been ruled out of the TATA IPL 2023, after sustaining an injury in the season opener against Chennai Super Kings. We wish our Titan a speedy recovery and hope for his early return. pic.twitter.com/SVLu73SNpl — Gujarat Titans (@gujarat_titans) April 2, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్.. లక్నో తరపున తొలి బౌలర్‌గా -
కొద్దిగా ఆగి ఉంటే వేరుగా ఉండేది.. ఊహించని ట్విస్ట్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9లో తమిళ్ తలైవాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం కంఠీరవ ఇండోర్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడింది. అయితే మ్యాచ్ సందర్భంగా తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా మ్యాచ్ మొదటి హాఫ్ తొలి 10 నిమిషాల్లోనే జరిగింది. గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్లు 7-7తో సమంగా ఉన్న సమయంలో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ చంద్రన్ రంజిత్ రైడ్‌కు వచ్చాడు. ఆ సమయంలో మ్యాట్‌పై తమిళ్ తలైవాస్ నుంచి ఇద్దరే ఉన్నారు. కెప్టెన్ పవన్ సెహ్రావత్ సహా సాహిలా గులియాలు ఉన్నారు. సూపర్ టాకిల్ చేస్తే పాయింట్లు వచ్చే అవకాశం ఉండడంతో సాహిల్.. చంద్రన్ రంజిత్ అప్పర్ బాడీని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పవన్ చంద్రన్ కాలును గట్టిగా హోల్డ్ చేశాడు. కొద్దిగా ఆగితే పాయింట్లు వచ్చేవే. కానీ ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. పవన్ పట్టు సాధించే క్రమంలో అతని మోకాలు బెణికింది. దీంతో మ్యాట్‌పై పడిపోయిన పవన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. అంతసేపు గట్టిగా అరుస్తున్న అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. వెంటనే మెడికల్ స్టాప్ వచ్చి పవన్ సెహ్రావత్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. నొప్పి చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అయితే తమిళ్ తలైవాస్ కోచ్ జె. ఉదయ్ కుమార్ మాత్రం పవన్ సెహ్రావత్ 2-3 రోజుల్లో కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక పవన్ సెహ్రావత్‌ను తమిళ్ తలైవాస్ రూ. 2.26 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఇక కెప్టెన్ పవన్ సెహ్రావత్ స్థానంలో నరేందర్ రైడర్‌గా అరంగేట్రం చేశాడు. ఇక గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 31–31తో డ్రాగా ముగిసింది. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. చదవండి: Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్ -
సూపర్-4కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్.. గాయంతో జడేజా ఔట్
ఆసియాకప్‌లో ఫెవరెట్‌గా కనిపిస్తోన్న టీమిండియాకు బిగ్‌షాక్ తగలింది. మోకాలి గాయంతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసియాకప్ టోర్నీ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. కాగా జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం జడేజా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. ''మోకాలి గాయంతో జడేజా ఆసియాకప్ దూరమయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. ఆసియాకప్‌కు స్టాండ్-బై క్రికెటర్‌గా ఉన్న అక్షర్.. ఇప్పుడు తుది జట్టులోకి రానున్నాడు. దుబాయ్‌లోని జట్టుతో కలవనున్నాడు. జడేజా గాయం తీవ్రతపై స్పష్టం లేదు.'' అంటూ పేర్కొంది. కాగా ఆసియాకప్‌లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ జడేజా ఆడాడు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో జడేజాకు బ్యాటింగ్ అవకాశం రానప్పటికి ఫీల్డింగ్‌లో మెరిశాడు. టీమిండియా సూపర్-4కు చేరుకున్న తరుణంలో జడేజా దూరమవ్వడం టీమిండియాకు కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు. సూపర్-4లో భాగంగా ఆదివారం బి2(పాకిస్తాన్ లేదా హాంకాంగ్)తో జరిగే మ్యాచ్‌కు అక్షర్ పటేల్ లేదా దీపక్ హుడాలలో ఎవరు జట్టులోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ,ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ NEWS - Axar Patel replaces injured Ravindra Jadeja in Asia Cup squad. More details here - https://t.co/NvcBjeXOv4 #AsiaCup2022 — BCCI (@BCCI) September 2, 2022 చదవండి: Neeraj Chopra-BCCI: నీరజ్ చోప్రా 'జావెలిన్'కు భారీ ధర.. దక్కించుకుంది ఎవరంటే? గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్‌ను పాక్ లైట్ తీసుకుంటే అంతే -
కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్
భారత మహిళా దిగ్గజ బాక్సర్.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగింది. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. విషయంలోకి వెళితే.. కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌లో భాగంగా శుక్రవారం 48 కేజీల విభాగంలో నీతూతో తలపడింది. మ్యాచ్ ఆరంభంలోనే మేరీకోమ్ మోకాలికి గాయమైంది.మెడికల్ చికిత్స పొందిన తర్వాత బౌట్‌ను తిరిగి ప్రారంభించారు. అయితే నొప్పి ఉండడంతో మేరీకోమ్ చాలా ఇబ్బందిగా కనిపించింది. ఇది గమనించిన రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆర్ఎస్సీఐ తీర్పు మేరకు నీతూను విజేతగా ప్రకటించారు. ఈ ఓటమితో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ గేమ్స్‌పై ఆమె దృష్టి పెట్టారు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మారిన్ దూరం
మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... రేపటి నుంచి తన సొంతగడ్డపై మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్లు స్పెయిన్ స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్ ప్రకటించింది. 2014, 2015, 2018లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 28 ఏళ్ల మారిన్ ఈ ఏడాది స్విస్ ఓపెన్ సందర్భంగా మోకాలి గాయానికి గురైంది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్రీడలతోపాటు మరే టోర్నీలోనూ ఆమె బరిలోకి దిగలేదు. -
రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం.. ఇకపై !
Is Ravindra Jadeja Taking Retirement from Test cricket?: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్వరలో టెస్ట్ క్రికెట్‌కు త్వరలో గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని జడేజా సహచర ఆటగాడు ఒకరు దైనిక్ జాగరణ్ పత్రికకు తెలిపారు. కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక మోకాలి శస్త్రచికత్స అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్లో 57 మ్యాచ్‌లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2195 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: India Tour Of South Africa: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్ స్పిన్నర్ ఔట్ -
T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా
T.Natarajan Ruled Out Of Vijay Hazare Trophy Due To Knee Injury.. తమిళనాడు ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా కనిపిస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి గాయాల బెడద అతన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా మోకాలి గాయం మరోసారి తిరగబెట్టడంతో దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ కి నటరాజన్ దూరమయ్యాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడిగా ఉన్న నటరాజన్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నప్పటికి.. ఫైనల్లో ఆడాడు. తమిళనాడు టైటిల్ గెలిచిన అనంతరం అతను చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. '' మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టడంతో టోర్నీకి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నటరాజన్ రీహాబిటేషన్ కోసం ఎన్సీఏ అకాడమీకి వెళ్లనున్నాడు. చదవండి: Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ ఇక తమిళనాడు పేసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన నటరాజన్.. 2020-21 ఆసీస్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న నట్టూ ఆసీస్ గడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ఇక నట్టూ తనదైన ప్రదర్శనతో మెప్పించాడు. యార్కర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అతను స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కీలకమవుతాడని భావించారు. ఇంగ్లండ్‌తో తొలివన్డే ఆడిన తర్వాత మొకాలి గాయం నటరాజన్‌ను టీమిండియాకు దూరం చేసింది. అంతే అప్పటినుంచి నటరాజన్ మళ్లీ టీమిండియాకు ఆడలేకపోయాడు. మోకాలి సర్జరీ అనంతరం మళ్లీ మైదానంలో అడుగుపెట్టినప్పటికీ గాయాల బెడద మాత్రం వీడలేదు. ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీలకు దూరంగా ఉన్న నట్టూ ఆ తర్వాత రెండో అంచె పోటీల్లోనే పెద్దగా ఆడలేకపోయాడు. అలా ఒక టోర్నీలో ఆడాడో లేదో మళ్లీ గాయపడడం అతని అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. చదవండి: ICC T20 Rankings: విరాట్ కోహ్లి ఔట్.. కేఎల్ రాహుల్ ఒక్కడే -
120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి..
సాధారణ బరువున్న వాళ్లు వంద స్కిప్‌లు చేస్తే గుండె దడవచ్చి, అలసిపోతారు. అలాంటిది 120 కేజీల బరువున్న బాలికతో ఆమె తల్లి ఒకరోజు కాదు రెండురోజులు కూడా కాదు ఏకంగా మూడు నెల్లపాటు మూడు వేల స్కిప్‌లు చేయించిందట. దీంతో బాలిక తవ్ర అస్వస్థతకు గురైంది. ఇదంతా ఎందుకు చేసిందంటే.. చైనా మీడియా కథనాల ప్రకారం చైనాలోని జెన్‌జియాంగ్ ప్రావిన్స్‌కి చెందిన ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురు ఎత్తు పెరగాలనే ఉద్ధేశ్యంతో చేసిన పని బాలిక ప్రాణాలకే ప్రమాదం తెచ్చింది. యువాన్యువాన్ అనే బాలిక ఎత్తు 1.58 మీటర్లు. బరువు 120 కేజీలు. ఎక్సర్సైజుల ద్వారా ఆమె బరువును తగ్గించి ఎత్తు పెంచాలని తల్లి నిర్ణయించుకుంది. ఐతే దీని గురించి తల్లి ఏ వైద్యుడిని సంప్రదించలేదు. అందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. ప్రారంభంలో రోజుకు వెయ్యి స్కిప్స్ చేయించేది. పోనుపోనూ 3 వేల స్కిప్స్ రోజూ చేయమని పోరు పెట్టేదట. ఇలా మూడు నెలలపాటు చేసింది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. దీంతో బాలిక తరచూ మోకాళ్ల నొప్పి వస్తుందని తల్లికి ఫిర్యాదు చేసేది. ఐతే కూతురు బద్దకంతో ఇలా చెబుతుందని అనుకుందట. బాలికకు మొకాళ్ల నొప్పి తీవ్రతరం కావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్ ‘ట్రాక్షన్ అపొఫిసైటిస్’ అనే కీళ్ల సమస్యకు గురైనట్లు తెలిపాడు. అంతేకాకుండా అధిక వ్యాయామం పిల్లలకు హానికరమని, బరువుతగ్గడానికి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయని, ఇంతకు ముందు కూడా అధిక వ్యాయామం కారంణంగా పదేళ్ల బాలుడు కాలిచీలమండ నొప్పికి గురైనట్లు వెల్లడించాడు. పిల్లలకు వ్యాయామంతోపాటు సరైన నిద్ర, పోషకాహారం, మానసిక స్థితి వంటి వాటిపై కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సదరు మహిళకు సూచించాడు. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! -
IPL 2021: ఒక్క మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగాడు!
IPL 2021: KKR Player Kuldeep Yadav Knee Injury.. కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే మోకాలి గాయంతో ఇంటిబాట పట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సమయంలో కుల్దీప్ గాయపడ్డాడని.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ''కుల్దీప్కు గాయపడినట్లు వచ్చిన వార్తలు నిజమే. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా.. మోకాలు బెణికింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే సర్జరీ అవసరం ఉందని.. ఇండియాకు పంపించాలని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కుల్దీప్కు ముంబైలో సర్జరీ నిర్వహించనున్నారు. అతను కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది '' అని చెప్పుకొచ్చింది. చదవండి: మోర్గాన్‌లా చేయాల్సి వస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడిని.. కాగా కుల్దీప్ ఈ సీజన్లో కేకేఆర్ తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో కుల్దీప్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇక కుల్దీప్ టీమిండియా తరపున చివరగా శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన కుల్దీప్ ఆ తర్వాత జరిగిన టి20ల్లో తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత జరిగిన చివరి రెండు టి20ల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఓవరాల్‌గా కుల్దీప్ యాదవ్ టీమిండియా తరపున 65 వన్డేల్లో 107 వికెట్లు, 23 టి20ల్లో 41 వికెట్లు, 7 టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 45 మ్యాచ్‌లాడిన కుల్దీప్ 40 వికెట్లు తీశాడు. చదవండి: రనౌట్ అవకాశం.. హైడ్రామా.. బతికిపోయిన అశ్విన్ -
Eng vs Ind: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడోటెస్టులో ఓటమిపాలైన టీమిండియాకు మరోషాక్ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన ఫోటోను జడేజా మ్యాచ్ ముగియగానే అభిమానులతో పంచుకున్నాడు. దీంతో జడేజాకు ఏమైందో అని అభిమానులు కంగారు పడ్డారు. విషయంలోకి వెళితే.. లీడ్స్ టెస్టులో రెండో రోజు (గురువారం) ఫీల్డింగ్ చేస్తుండగా.. జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమిండియా మేనేజ్మెంట్ అతని గాయానికి స్కానింగ్ చేయించినట్లు తెలిసింది. స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాలుగో టెస్టులో జడేజా ఆడటంపై క్లారిటీ రానుంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం నాలుగో టెస్టుకు జడేజా స్థానంలో అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: 'నేస్తమా త్వరగా కోలుకో..': సచిన్ కాగా మ్యాచ్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 34 పరుగులు మాత్రమే చేశాడు. లీడ్స్ టెస్టు విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ని ఇంగ్లాండ్ 1-1తో సమం చేయగా.. నాలుగో టెస్టు మ్యాచ్ ఓవల్ వేదికగా సెప్టెంబరు 2 నుంచి ప్రారంభంకానుంది. ఇక శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. చదవండి: ENG Vs IND: ఇన్నింగ్స్ ఓటముల్లో టీమిండియా చెత్త రికార్డు -
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్‌కు గాయం
మాస్కో: టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం గెలిచే భారత క్రీడాకారుల్లో ఒకరిగా భావిస్తున్న స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా గాయపడ్డాడు. రష్యాలో జరుగుతున్న అలీ అలియెవ్ టోరీ్నలో భాగంగా అబ్దుల్ మజీద్ కుదేవ్ (రష్యా)తో జరిగిన 65 కేజీల విభాగం సెమీఫైనల్లో బజరంగ్ కుడి మోకాలి నొప్పితో బౌట్ మధ్యలోనే వైదొలిగాడు. మ్యాట్‌పైనే కుప్పకూలిన బజరంగ్‌కు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత బజరంగ్ నిలబడినా నడవడానికి ఇబ్బంది పడ్డాడు. బజరంగ్ గాయం తీవ్రతపై ఒకట్రెండు రోజుల్లో వివరాలు చెబుతామని అతని కోచ్ షాకో తెలిపారు. -
గాయం బాధిస్తుంది.. ఇంకా ఎన్ని రోజులు ఆడతానో తెలీదు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ తన అభిమానులకు చేదు వార్త చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరుకున్న ఫెడెక్స్.. గత కొంతకాలంగా మోకాలి గాయంతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మూడో రౌండ్ విజయం అనంతరం మీడియా ముందు సూచన ప్రాయంగా వెల్లడించాడు. మోకాలి గాయం చాలా బాధిస్తుంది, దీంతో తాను ఎన్ని రోజులు కొనసాగుతానో తెలియడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. మోకాలికి శస్ట్ర చికిత్స అనంతరం మూడు గంటల 35 నిమిషాల పాటు మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో మట్టి కోర్ట్‌పై వరుసగా మూడు విజయాలు సాధిస్తానని ఊహించలేదని ఆయన అన్నాడు. కాగా, మూడో రౌండ్లో భాగంగా శనివారం రాత్రి మూడున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫెదరర్.. 7-6, 6-7, 7-6, 7-5 తేడాతో 59వ సీడ్ ఆటగాడు డొమినిక్ కోఫర్‌పై అద్భుత విజయం సాధించాడు. ఈ క్రమంలో అతను ఫ్రెంచ్ ఓపెన్‌లో 15వ సారి ప్రిక్వార్టర్స్ దశకు చేరాడు. కాగా, 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన 39 ఏళ్ల ఫెడెక్స్.. సోమవారం ఇటలీకి చెందిన మాటెయో బెరెటినితో నాలుగో రౌండ్లో తలపడాల్సి ఉంది. ఇదిలా ఉంటే, తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వింబుల్డన్ కోసమే ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 28 నుంచి వింబుల్డన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగితే వారం కూడా విశ్రాంతి దొరకదని, అందుకే అతను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కాగా, గతేడాది ఆరంభంలో ఫెదరర్ మోకాలికి రెండు సర్జరీలు జరిగాయి. దీంతో చాలా టోర్నీలకు అతను దూరంగా ఉన్నాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయిన తరువాత ఖతార్ ఓపెన్ 2021లో అతను మళ్లీ బరిలోకి దిగాడు. చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు -
రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నా: నటరాజన్
-
'రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నా'
చెన్నై: యార్కర్ల స్పెషలిస్ట్.. టీమిండియా ఆటగాడు టి. నటరాజన్ మోకాలు గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభంలోనే నట్టూకు గాయం తిరగబెట్టడంతో లీగ్‌కు దూరమయ్యాడు. వైద్యుల అతన్ని పరీక్షించి మోకాలికి సర్జరీ నిర్వహించారు. తాజాగా ఇంట్లోనే ఉంటున్న నట్టూ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ''నేను రోజురోజుకీ ధృఢంగా తయారవుతున్నానంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ఈ సందర్భంగా రీహాబ్, ప్రొగ్రెస్ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు. ''22 యార్డులున్న పిచ్‌పై బౌలింగ్ చేయడానికి త్వరలోనే వస్తా. ఇప్పుడు నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. మోకాలి సర్జరీ విజయవంతం అయింది. మీ ఆశీర్వాద బలంతో త్వరగా కోలుకుంటున్నా. మీరు నాపై చూపిస్తున్న ఆభిమానానికి, ఆదరణకు.. అలాగే కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో నటరాజన్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఆఖరి టెస్టు మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన నటరాజన్ మొత్తంగా ఆసీస్ పర్యటనలో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఆసీస్ పర్యటనలో గాయపడిన నటరాజన్ ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి కోలుకున్నట్లే కనిపించినా ఎస్ఆర్హెచ్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం మళ్లీ గాయం తిరగబెట్టడంతో లీగ్‌కు దూరమయ్యాడు. చదవండి: నటరాజన్‌కు సర్జరీ.. బీసీసీఐ స్పందన -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్: నటరాజన్ డౌటే!
అహ్మదాబాద్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న 5 టీ20 సిరీస్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి. భుజం గాయంతో బాధపడుతున్న నటరాజన్ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో(ఎన్సీఏ) ఉన్నాడు. అతని ఫిట్నెస్ను పరిక్షించి టీ20ల్లో ఆడించాలా వద్దా అనేది మార్చి 12న తేలనుంది. అందుకే నటరాజన్ తొలి టీ20 ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎన్సీఏ మేనేజ్మెంట్ తెలిపింది. కాగా నటరాజన్‌తో పాటు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలు కూడా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తిలు ఫిట్నెస్ పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. అయితే మార్చి 12లోపు ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితే తొలి టీ20లో ఆడే చాన్స్ ఉందంటూ తెలిపింది. ఒకవేళ రిపోర్ట్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలితే మాత్రం నటరాజన్ పూర్తిగా దూరమవ్వనున్నాడు. ఇక నెట్‌బౌలర్‌గా వెళ్లి, ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీసి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: అందమైన బహుమతి.. థాంక్యూ లడ్డూ: నటరాజన్ యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్.. -
కేసీఆర్ మౌనం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల నీళ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని తీసుకెళ్తుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జూమ్ యాప్ ద్వారా శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తే తెలం గాణ 6 టీఎంసీ నీళ్లను నష్టపోతుందని చెప్పారు. 6 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేందుకు జీవో జారీ చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రతిపాదన పూర్తయితే నాగార్జున సాగర్–పాలమూరు ఎత్తిపోతల–కల్వకుర్తి ప్రాజెక్టులకు చుక్క నీరు ఉండవని, దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం అక్కడి ప్రభుత్వం ఈనెల 11న టెండ ర్లు పిలుస్తున్నట్టు తెలుస్తోందని, ఆ ప్రక్రియ పూర్తి కావాలనే అపెక్స్ భేటీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కోరారని ఆరోపించారు. ఉత్తమ్ మోకాలికి గాయం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి మోకాలికి గాయమైంది. ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడ్డారని, దీంతో మోకాలికి బలమైన గాయం తగిలిందని గాంధీభవన్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఆయన 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపాయి. శనివారం మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి ఉత్తమ్‌ను కలిసి పరామర్శించారు. -
ఉత్తమ్ మోకాలికి తీవ్ర గాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ‘మోకాలికి తీవ్ర గాయమైన పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కోరుకుంటుంది’ అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ఆ చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలి పట్టీని (నీ క్యాప్) ధరించారు. నడవటానికి కష్టంగా ఉండటంతో వాకర్ పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నారు. అయితే ఉత్తమ్‌కు ఈ గాయం ఎలా అయ్యిందనే దాని గురించి సమాచారం లేదు. Telangana Congress Social Media Department wishes a speedy recovery to our PCC President & MP Capt. Uttam who has suffered a serious knee injury. pic.twitter.com/dporNQsjXQ — Telangana Congress (@INCTelangana) August 1, 2020 తమ అధ్యక్షుడు ఉత్తమ్ త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ జే గీతా రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘యుద్ధ విమానాలు నడిపే మాజీ పైలట్ మాత్రమే కాదు. పుట్టుకతోనే పోరాటయోధుడు. ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని గీతారెడ్డి ట్వీట్ చేశారు.