ఆస్పత్రిలో చేరిన సైనా నెహ్వాల్ | Saina Nehwal admitted to hyderabad hospital for Knee Injury treatment | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన సైనా నెహ్వాల్

Published Thu, Aug 18 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

ఆస్పత్రిలో చేరిన సైనా నెహ్వాల్

ఆస్పత్రిలో చేరిన సైనా నెహ్వాల్

హైదరాబాద్: భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మోకాలి గాయంతో ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల క్రితం ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్టు సైనా నెహ్వాల్ తండ్రి హరవీర్ సింగ్ తెలిపారు. రియో ఒలింపిక్స్ లో మరియా ఉలిటినా (ఉక్రెయిన్)తో జరిగిన మ్యాచ్ లో ఆమె గాయపడిందని చెప్పారు. మోకాలి గాయానికి చికిత్స చేయించుకుంటోందని వెల్లడించారు. ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టు వివరాలు డాక్టర్లు ఇంకా వెల్లడించలేదన్నారు. మెరుగైన చికిత్స కోసం సైనాను శుక్రవారం హైదరాబాద్ నుంచి ముంబైకు తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.

రియో నుంచి ఈ నెల 16న సైనా తిరిగొచ్చింది. తర్వాతి రోజే ఆస్పత్రిలో చేరింది. గాయాన్ని దాచి రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన సైనా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement