Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు
అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతాలు చేశాడు.
సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం
ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్‌లలో డబుల్ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది.
జాతీయ క్రికెట్ అకాడమీలో
దీంతో భారత్‌కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
ఉబ్బిపోయిన మోకాలు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం.
గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు.
దేశవాళీ క్రికెట్‌కు దూరం
దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు.
వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ
కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్‌మన్ గిల్ స్థిరపడిపోగా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ రూపంలో ఈ ముంబై బ్యాటర్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకుని.. కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది.
చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Comments
Please login to add a commentAdd a comment